newssting
BITING NEWS :
* నేను తెలంగాణను కించ పర్చేలా మాట్లాడలేదు.. తెలంగాణలోని ప్రధాన పట్టణాలకు రైల్ కనెక్టివిటీ లేదని చెప్పాలన్నదే నా ఉద్దేశ్యం.. ఆంధ్ర పాలకుల హయాంలో తెలంగాణ నిర్లక్ష్యానికి గురైందని చెప్పా-కేంద్రమంత్రి కిషన్ రెడ్డి *కాంగ్రెస్‌ ఎంపీ అహ్మద్‌పటేల్‌కు ఐటీశాఖ నోటీసులు.. రూ.400 కోట్ల హవాలా మనీ కేసులో సమన్లు.. ఫిబ్రవరి 11నే నోటీసులు జారీ చేసిన ఐటీశాఖ.. హాజరుకాకపోవడంతో మరోసారి నోటీసులు*కోవిడ్‌-19 బారిన పడి వుహాన్‌ వుచాంగ్‌ హాస్పిటల్‌ డైరక్టర్‌ మృతి.. కరోనాపై ఫస్ట్‌ హెచ్చరిక జారీ చేసిన లియూ చిమింగ్‌... ఆయన మృతికి సంతాపం ప్రకటించిన చైనా వాసులు*ధాన్యం కొనుగోలు కోసం నిధులను కేటాయించారా.. లేదా?, కేటాయిస్తే ఆ నిధులు ఎటుపోయాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలి-పవన్ కల్యాణ్ *ఎన్నికల వరకే రాజకీయం.. ఆ తర్వాత ప్రభుత్వ పథకాలే ముఖ్యం, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులే రేపటి నాయకులు-కేసీఆర్* భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం... ట్రంప్ పర్యటన నేపథ్యంలో కీలక నిర్ణయాలు *పాకిస్థాన్‌లో ముస్లింల సంఖ్య 23 శాతం తగ్గిందట.. మరి వాళ్లంతా ఏమయ్యారు, చనిపోయి ఉండాలి.. ఇస్లామిక్‌లోనైనా కలిసి ఉండాలి లేదా భారత్‌లో చొరబడి స్థిరపడి ఉండాలి!-పీయూష్ గోయల్

గోదారొచ్చి కృష్ణాలో కలిసేన‌మ్మా..!

21-09-201921-09-2019 13:59:01 IST
2019-09-21T08:29:01.632Z21-09-2019 2019-09-21T07:33:17.755Z - - 19-02-2020

గోదారొచ్చి కృష్ణాలో కలిసేన‌మ్మా..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు స్నేహ బంధంతో మ‌రింత ముందుకు సాగుతున్నారు. మ‌నం మ‌నం తెలుగోళ్ల‌మంటూ ఇచ్చిపుచ్చుకునే ధోర‌ణితో వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే విభ‌జ‌న స‌మ‌స్య‌ల‌ను చ‌ర్చ‌ల‌తో ప‌రిష్క‌రించుకుంటూ తెలంగాణ ఏపీ ప్ర‌భుత్వాలు న‌దుల అనుసంధానంపై దృష్టి సారిస్తున్నారు.

గోదావ‌రి నీటిని కృష్ణా బేసిన్‌కు త‌ర‌లించే అంశంపై చ‌ర్చించేందుకు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు కేసీఆర్‌, జ‌గ‌న్ ఈ నెల 24న ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో స‌మావేశం కానున్నారు. ఈ స‌మావేశంలో ఇరు రాష్ట్రాల‌కు చెందిన ఇంజినీర్లు కూడా పాల్గొన‌నున్నారు. గోదావ‌రి నీటిని కృష్ణా బేసిన్‌కు త‌ర‌లించాల‌ని  ముఖ్య‌మంత్రులు ఇద్ద‌రూ గ‌తంలో నిర్ణ‌యించిన సంగ‌తి తెలిసిందే. ఈ విష‌య‌మై ఇప్ప‌టికే స‌మావేశ‌మై చ‌ర్చించిన విష‌యం విధిత‌మే.

అంతేకాకుండా గోదావ‌రి, కృష్ణా న‌దుల అనుసంధానంపై అధ్య‌య‌నం చేసి ఆ త‌రువాత నివేదిక ఇవ్వ‌డానికి ఇరు రాష్ట్రాల్లో ఇంజినీర్ల క‌మిటీలు కూడా ఏర్ప‌డ్డాయి. ఆ క‌మిటీలు ఇదివ‌ర‌కే స‌మావేశ‌మై న‌దుల అనుసంధానంపై చ‌ర్చించాయి. ఇరు రాష్ట్రాల ఇంజినీర్లు నివేదిక‌లు సిద్ధం చేసిన‌ట్టు స‌మాచారం. ఇంజినీర్ల క‌మిటీలు ఇచ్చిన నివేదిక‌ల‌ను కేసీఆర్‌, జ‌గ‌న్‌లు స్ట‌డీ చేయ‌నున్నారు.

తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండేందుకు న‌దుల అనుసంధాన‌మే మేల‌ని ముఖ్య‌మంత్రులు భావిస్తున్న‌ట్టు తెలుస్తుంది. గోదావ‌రి, కృష్ణా న‌దుల‌ను అనుసంధానం చేస్తే ఉమ్మ‌డి న‌ల్గొండ జిల్లాతోపాటు ఏపీలో రాయ‌లసీమ క‌ష్టాలు కూడా తీరుతాయ‌ని ఇరిగేష‌న్ నిపుణులు చెబుతున్నారు.

ఇదే విష‌య‌మై తెలంగాణ జ‌ల‌వ‌న‌రుల ప‌రిర‌క్ష‌ణ సంస్థ చైర్మ‌న్ వీ.ప్ర‌కాష్ మాట్లాడుతూ గోదావ‌రి నీటిని శ్రీ‌శైలం, నాగార్జున సాగ‌ర్‌కు మ‌ళ్లించి తెలంగాణ మిగులు జ‌లాల‌పై ఆధార‌ప‌డ్డ ప్రాజెక్టుల‌తోపాటుగా ఆంధ్ర ప్రాంతంలోని నీటికొర‌త ఉన్న ప్రాజెక్టుల‌కు, మిగులు జ‌లాల‌పై ఆధార‌ప‌డ్డ ప్రాజెక్టుల‌కు నీటిని మ‌ళ్లించాల‌న్న ప్ర‌తిపాద‌న‌కు తెలుగు ముఖ్య‌మంత్రులిద్ద‌రూ అంగీక‌రించార‌న్నారు.

గ‌త ఐదారు నెల‌ల నుంచి ఇరు రాష్ట్రాల‌కు చెందిన ఇంజినీర్లు కూడా ఐదు ప్లాన్స్‌ను రెండు ప్రాంతాల ఇంజినీర్లు త‌యారు చేశార‌ని వీ.ప్ర‌కాష్ తెలిపారు. అందులో ఏదో ఒక ప్లాన్ రూపుదాల్చే అవ‌కాశం ఉంద‌ని, అయితే అందుకు డీటైల్ స‌ర్వే రిపోర్టు కూడా అవ‌స‌ర‌మ‌వుతుంద‌న్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు త‌మ సంస్థ‌కు ప్రిలిమిన‌రీ స‌ర్వే ప్ర‌తిపాద‌న‌లు మాత్ర‌మే వ‌చ్చాయి.

ఉభ‌య తెలుగు రాష్ట్రాల ఇంజినీర్ల నుంచి వ‌చ్చిన ఐదు ప్ర‌తిపాద‌న‌ల్లో ఒక‌టి లేదా రెండు ప్ర‌తిపాద‌న‌ల‌ను ప‌రిశీల‌న‌కు అర్హ‌మైన‌విగా నిర్ణ‌యించాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని, క‌నుక ఈ నెల 24న జ‌ర‌గ‌నున్న ముఖ్య‌మంత్రుల భేటీలో ఇంజినీర్ల ప్ర‌తిపాద‌న‌ల‌పై చ‌ర్చ జ‌రిగే అవ‌కాశం ఉందన్నారు.

అయితే న‌దుల అనుసంధానంపై ముఖ్య‌మంత్రులు అంతిమ నిర్ణ‌యం తీసుకునేందుకు మ‌రికొన్ని భేటీలు అవ‌స‌ర‌మ‌య్యే అవకాశాలు ఉన్నాయ‌న్నారు వీ.ప్ర‌కాష్‌. ఇప్ప‌టి వ‌ర‌కు కేసీఆర్‌, జ‌గ‌న్‌ల భేటీలో రెండుసార్లు మాత్ర‌మే నీటిపారుద‌ల‌కు సంబంధించి చ‌ర్చించార‌ని, మిగ‌తా భేటీల‌లో రాష్ట్ర విభ‌జ‌న‌కు సంబంధించిన తొమ్మిది, ప‌దో షెడ్యూల్స్‌పై చ‌ర్చించార‌ని చెప్పుకొచ్చారు.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle