newssting
BITING NEWS :
*అరుదైన రికార్డు నెలకొల్పిన విరాట్ కోహ్లీ*చేతులెత్తేసిన సౌతాఫ్రికా... సిరీస్‌ కైవసం చేసుకున్న టీమిండియా*తెలంగాణలో పదో రోజుకు చేరిన ఆర్టీసీ కార్మికుల సమ్మె.. నేడు ఇందిరాపార్క్ దగ్గర ట్రేడ్ యూనియన్ల బహిరంగసభ*ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డితో భేటీ కానున్న నటుడు చిరంజీవి*ఢిల్లీ: నేటి నుంచి అయోధ్యపై సుప్రీంకోర్టులో తుదిదశ వాదనలు.. ఈ నెల 17లోపు వాదనలు పూర్తిచేయాలని సుప్రీం నిర్ణయం*నేడు, రేపు నెల్లూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన.. జిల్లా నేతలదో సమీక్షలు*సీపీఐ రాష్ట్రకమిటీ అత్యవసర భేటీ.. ఆర్టీసీ సమ్మె, హుజూర్‌నగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్‌కు మద్దతుపై చర్చ*మా తండ్రి తో ఎలాంటి గొడవలు లేవు...కోడెల మృతికి ఒత్తిడే కారణం: కొడుకు శివరాం, భార్య వాంగ్మూలం *తెలంగాణ ఆర్టీసీలో నియామకాలకు నోటిఫికేషన్...తాత్కాలిక ప్రాతిపదికన డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్, ఎలక్ట్రీషియన్‌ పోస్టులకూ దరఖాస్తుల ఆహ్వానం*నిండుకుండలా సోమశిల జలాశయం..ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 78 టీఎంసీలు...ప్రస్తుత నీటిమట్టం 75 టీఎంసీలు*ఇవాళ గోదావరిలో మునిగిపోయిన బోటు వెలికితీత పనులు మళ్ళీ ప్రారంభం

‘గో’దారెటు.. తూర్పుగోదావరి టీడీపీ నేతల క్యూ

15-09-201915-09-2019 08:59:22 IST
2019-09-15T03:29:22.956Z15-09-2019 2019-09-15T03:29:05.949Z - - 14-10-2019

‘గో’దారెటు.. తూర్పుగోదావరి టీడీపీ నేతల క్యూ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలుగుదేశం పార్టీకి ఆవిర్భావం నుంచీ బలంగా ఉన్నది గోదావరి జిల్లాలు అని చెప్పడానికి సందేహించాల్సిన అవసరం లేదు. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు అనంతపురం, ఉత్తరాంధ్ర జిల్లాలలో కూడా తెలుగుదేశం పార్టీకి బలమైన పునాదులు ఉన్నాయి. అయితే 2019 ఎన్నికల అనంతరం తెలుగుదేశం పునాదులు ఆయా జిల్లాల్లో కదలిపోతున్నాయా అనిపించేలా ఆ పార్టీ నుంచి వలసలు కొనసాగుతున్నాయి.

ముఖ్యంగా గోదావరి జిల్లాలలో పార్టీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఈ జిల్లాలకు చెందిన బలమైన నేతలు పార్టీని వీడే విషయంలో క్యూకడుతున్నారు. ముఖ్యంగా జిల్లాలో బలమైన సామాజిక వర్గమైన కాపు వర్గానికి చెందిన వారు ఒకరి వెంట ఒకరుగా పార్టీని వీడుతుండటంతో గోదావరి జిల్లాలలో తెలుగుదేశం ఇప్పటిలో కోలుకోగలుగుతుందా అన్న అనుమానాలు వ్యక్త మౌతున్నాయి.

ఒకరి వెంటగా ఒకరు గోదావరి జిల్లాల నుంచి పార్టీని వీడుతున్నారు. తాజాగా తోట త్రిమూర్తులు వైకాపా తీర్ధం పుచ్చుకున్నారు. అంతకు ముందే అంటే ఎన్నికలకు ముందే టిడీఎల్పీ ఉపనాయకుడిగా వ్యవహరించిన తోట నరసింహం పార్టీ మారారు. 

గోదావరి జిల్లాలలో తెలుగుదేశం నుంచి వలసలు అధికంగా ఉండడానికి కారణం కాపు రిజర్వేషన్ల అంశంలో అధికార పార్టీ తీరును కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వ్యతిరేకించడం. అలాగే కాపు రిజర్వేషన్ల ఉద్యమం సందర్భంగా జరిగిన అల్లర్ల కేసులలో పలువురు యువకులు ఉండటం కారణమని భావిస్తున్నారు.

ఇంత కాలంగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉన్న కాపు రిజర్వేషన్ల అంశం 2014 ఎన్నికలలో తెలుగుదేశం విజయం సాధించి అధికారం చేపట్టిన తరువాతనే పట్టాలెక్కిందని చెప్పాలి.

న్యాయపరమైన చిక్కుల తలెత్తకుండా, బీసీల ఆగ్రహానికి గురి కాకుండా కాపులకు రిజర్వేష్లను కల్పించాలన్న ఉద్దేశంతో చంద్రబాబు తీసుకున్న జాగ్రత్తలు కాపు ఉద్యమ నేతలలో జాప్యం చేసే ఎత్తుగడలుగా అనిపించాయి.

అందుకే కాపు కార్పొరేషన్ ఏర్పాటు కేంద్రం పెంచిన ఓబీసీ రిజర్వేషన్లలో కాపులకు భాగం కల్పించడం వంటికి కాపు సామాజిక వర్గ నేతలను సంతృప్తి పరచలేకపోయాయని చెప్పాలి. కాపుల రిజర్వేషన్ అంశం కేంద్రం పరిధిలోది అని కుండబద్దలు కొట్టిన వైకాపా అధినేత జగన్ వ్యాఖ్యల పట్ల కాపు నేతలు ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ మెజారిటీ కాపు సామాజిక వర్గం జగన్ నే విశ్వసించిందని 2019 ఎన్నికల ఫలితాల తేల్చేశాయి.

ఆ కారణంగానే కాపు సామాజిక వర్గ నేతలు ఒక్కరొక్కరుగా పార్టీని వీడుతున్నారని చెప్పాల్సి ఉంటుంది. ఉభయ గోదావరి జల్లాలలో కాపు సామాజిక వర్గం రాజకీయాలపై, పార్టీల గెలుపోటములపై ప్రభావం చేయగలిగిన స్థితిలో ఉంది. 

ఈ రెండు జిల్లాలలోనూ ఆ వర్గానికి చెందిన వారి సంఖ్యా బలం కూడా అధికం. అందుకే రాజకీయ పార్టీలు ఆ సమాజిక వర్గ ప్రయోజనాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ఈ నేపథ్యంలోనే ఇంత కాలం బలమైన అండగా నిలిచిన వర్గం తెలుగుదేశంకు దూరమౌతుండటంతో  పార్టీలో ఆందోళన వ్యక్తమౌతున్నది. 

తెలుగుదేశం పార్టీని వీడే నేతలకు బీజేపీ, వైకాపా మధ్య ఛాయిస్ ఉంది. కాపు సామాజిక వర్గం అండ ఎంత ముఖ్యమో తెలిసిన రెండు పార్టీలూ కూడా తెలుగుదేశం నుంచి వచ్చే వారికి రెడ్ కార్పెట్ పరుస్తున్నాయి. దీంతో ఇప్పటి వరకూ పార్టీ వీడే యోచన లేని వారు కూడా తమ ప్రయోజనాలు, సామాజిక వర్గ ప్రయోజనాల విషయంలో ఒక స్పష్టమైన హామీ ఇచ్చే పార్టీ వైపుకే మొగ్గు చూపుతున్నారు. 

తెలుగుదేశం నుంచి వీడాలనుకునే నేతలకు ‘గో’దారిలో రెండు దారులు కనిపిస్తున్నాయి. ఒకటి వైకాపా దారి, మరొకటి బీజేపీ దారి. తమ రాజకీయ ప్రయోజనాలు, తమ వర్గం ప్రయోజనాలు ఏ పార్టీలో సురక్షఇతంగా ఉంటాయన్నది బేరీజు వేసుకుని జెండా మార్చేందుకు ఛాయిస్ ఉండటంతో తెలుగుదేశం నుంచి వలసలు పెరుగుతున్నాయి.

నేతలు పార్టీ మారుతున్న కార్యకర్తలకు పార్టీ వైపే ఉంటారన్న ధీమా ఈ సారి  తెలుగుదేశం పార్టీలో అంతగా కనిపించడం లేదు. వలసలను నిలువరించి గోదావరి జిల్లాలలో పార్టీని పటిష్టంగా ఉంచేందుకు తెలుగుదేశం వద్ద వ్యూహాలు కరువయ్యాయాన్న అనుమానాలు పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద తెలుగుదేశం పార్టీకి అత్యంత బలమైన గోదావరి జిల్లాలలో ప్రస్తుతం పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని చెప్పక తప్పదు.

కేంద్రంఫై ఎదురుదాడికి దిగుతున్న ఏపీ సర్కార్..!

కేంద్రంఫై ఎదురుదాడికి దిగుతున్న ఏపీ సర్కార్..!

   7 minutes ago


రైతు భరోసాకు సర్వం సిద్ధం.. బ్యాంకులకు జగన్ మార్గనిర్దేశం

రైతు భరోసాకు సర్వం సిద్ధం.. బ్యాంకులకు జగన్ మార్గనిర్దేశం

   an hour ago


తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు ఆంధ్ర ఆర్టీసీ బాసట

తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు ఆంధ్ర ఆర్టీసీ బాసట

   an hour ago


పదోరోజుకి సమ్మె,. ఆర్టీసీ జేఏసీ వర్సెస్ ఉద్యోగ జేఏసీ

పదోరోజుకి సమ్మె,. ఆర్టీసీ జేఏసీ వర్సెస్ ఉద్యోగ జేఏసీ

   2 hours ago


సమ్మెపై సర్కార్ సమ్మెట- ప్రజాస్వామ్య హక్కుల సమాధి!

సమ్మెపై సర్కార్ సమ్మెట- ప్రజాస్వామ్య హక్కుల సమాధి!

   2 hours ago


ఉసురు తీస్తున్న సమ్మె.. కేసీఆర్ కు కార్మికుల శాపనార్థాలు

ఉసురు తీస్తున్న సమ్మె.. కేసీఆర్ కు కార్మికుల శాపనార్థాలు

   19 hours ago


కావాల్సినంత ఇసుక.. రోజుకి లక్షటన్నులు

కావాల్సినంత ఇసుక.. రోజుకి లక్షటన్నులు

   19 hours ago


ఏపీ ఆర్ధిక పరిస్థితి ఇప్పట్లో మెరుగుపడే అవకాశమేలేదా?

ఏపీ ఆర్ధిక పరిస్థితి ఇప్పట్లో మెరుగుపడే అవకాశమేలేదా?

   21 hours ago


ఉధృతంగా ఆర్టీసీ సమ్మె-కార్మికుల వంటావార్పు

ఉధృతంగా ఆర్టీసీ సమ్మె-కార్మికుల వంటావార్పు

   21 hours ago


ఆర్టీసీ సిబ్బంది ప్రాణాల పట్ల తెలంగాణ సమాజానికి బాధ్యత లేదా

ఆర్టీసీ సిబ్బంది ప్రాణాల పట్ల తెలంగాణ సమాజానికి బాధ్యత లేదా

   21 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle