newssting
BITING NEWS :
*భారత్ లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటన.. భారీ భద్రతా ఏర్పాట్లు *చిత్తూరు జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల కలకలం..శ్రీ చౌడేశ్వరి ఆలయం వెనకాల ప్రాంతంలో తవ్వకాలు *ఆదిలాబాద్‌ గుడిహత్నూర్‌లో దారుణం....బాలికపై ఇద్దరు కామాంధుల అత్యాచారం* చైనాలో కొనసాగుతున్న కరోనా మరణమృదంగం....ఇప్పటివరకు 2వేల 460కి చేరిన కొవిడ్-19 మృతుల సంఖ్య*ఒడిశా : పూరీ జిల్లా పిప్పిలి ప్రాంతంలో ఏనుగుల బీభత్సం...ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి.., ఐదుగురికి గాయాలు *గుజరాత్‌లోని వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం..ట్రక్కు- టెంపో ఢీ, 11మంది మృతి *68వ రోజు కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళన... హైకోర్టు ఆదేశాలతో తుళ్లూరులో ఎంక్వైరీ చేపట్టిన పోలీసులు* ఢిల్లీలోని జఫ్రాబాద్ మెట్రో స్టేషన్‌లో సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలు..భారీగా తరలివచ్చిన మహిళలు*తిరుమలలో మరోసారి ప్రత్యక్షమైన బంగారు బల్లి.. చూసేందుకు బారులు తీరిన భక్తులు....శిలాతోరణం చక్రతీర్థంలో బంగారు బల్లి ప్రత్యక్షం

గొడ‌వ‌కు జ‌గ‌న్ ఇష్ట‌ప‌డ‌టం లేదా..?

26-09-201926-09-2019 09:18:26 IST
Updated On 26-09-2019 14:00:14 ISTUpdated On 26-09-20192019-09-26T03:48:26.396Z26-09-2019 2019-09-26T03:48:18.305Z - 2019-09-26T08:30:14.660Z - 26-09-2019

గొడ‌వ‌కు జ‌గ‌న్ ఇష్ట‌ప‌డ‌టం లేదా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రెండు తెలుగు రాష్ట్రాల్లో బ‌లంగా ఉన్న అధికార టీఆర్ఎస్‌, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్ర‌త్యామ్నాయ శ‌క్తిగా ఎదిగేందుకు భార‌తీయ జ‌న‌తా పార్టీ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంది. తెలంగాణ‌లో కాంగ్రెస్‌ను, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తెలుగుదేశం పార్టీని దెబ్బ‌తీసి ఆ పార్టీల స్థానంలోకి ఎద‌గాల‌ని భావిస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉండ‌టం, జాతీయ స్థాయిలో తిరుగులేని శ‌క్తిగా ఎద‌గ‌డంతో బీజేపీ ఈ ప్ర‌య‌త్నాల‌ను విజ‌య‌వంతంగా చేస్తోంది.

అధికార పార్టీల‌కు ప్ర‌త్యామ్నాయంగా ఎదిగేందుకు గానూ ప్ర‌తిప‌క్షం స్థాయిలో పోరాటాలు చేయాల‌నే బీజేపీ నేత‌లు భావిస్తున్నారు. తెలంగాణ‌లో వివిధ అంశాల‌పై కాంగ్రెస్‌తో స‌మానంగా బీజేపీ పోరాటం చేస్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనూ వైసీపీపై బీజేపీ పోరాడుతోంది. దీంతో బీజేపీ అటు కేసీఆర్‌కు, ఇటు జ‌గ‌న్‌కు కొత్త సవాల్‌గా మారింది.

కేంద్రంలో అధికారంలో ఉన్న ఆ పార్టీని అంత దూకుడుగా ఎదుర్కోవ‌డంలో టీఆర్ఎస్‌, వైసీపీ వెన‌క‌డుగు వేస్తున్నాయి. ముఖ్యంగా కేంద్ర ప్ర‌భుత్వంతో స‌ఖ్య‌త‌గా ఉండాల‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు. దీంతో రాష్ట్ర బీజేపీ నేత‌లు త‌మ పార్టీని ఎంత‌గా టార్గెట్ చేసినా వైసీపీ నేత‌లు పెద్ద‌గా కౌంట‌ర్ ఇవ్వ‌డం లేదు. విమ‌ర్శ‌లు అటుంచితే కేంద్రంతో స‌ఖ్య‌త‌గా ఉండాల‌ని భావిస్తున్నా కేంద్రం నుంచి ఏపీకి ఎటువంటి ప్రాధాన్య‌తా ద‌క్క‌డం లేదు.

ప్ర‌త్యేక హోదా ఊసే లేదు. ఇత‌ర విభ‌జ‌న హామీల అమ‌లుకు సైతం కేంద్రం జ‌గ‌న్ ఆశించిన స్థాయిలో చొర‌వ చూప‌డం లేదు. పైగా చంద్ర‌బాబు హ‌యాంలో పోల‌వ‌రం, విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల్లో అవినీతి జ‌రిగింద‌ని, వీటిని వెలికితీయాల‌నేది జ‌గ‌న్ టార్గెట్‌. ఈ టార్గెట్‌కు కేంద్ర ప్ర‌భుత్వం అడ్డం ప‌డుతోంది. రివ‌ర్స్ టెండరింగ్, ఒప్పందాల స‌మీక్ష‌లకు వెళ్ల‌వ‌ద్ద‌ని ప‌దేప‌దే చెబుతోంది. అయినా, జ‌గ‌న్ ఖాత‌రు చేయ‌కుండా పోల‌వ‌రం రివ‌ర్స్ టెండ‌రింగ్‌కు వెళ్లారు.

అయితే, కేసీఆర్‌ అండ్ జ‌గ‌న్‌కు ఇబ్బందిక‌రంగా మారిన బీజేపీపై ఎటువంటి వ్యూహంతో ముందుకెళ్తార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. ఇటీవ‌ల జ‌గ‌న్ - కేసీఆర్ హైద‌రాబాద్‌లో స‌మావేశమ‌య్యారు. గోదావ‌రి నీటిని కృష్ణ‌కు త‌ర‌లించ‌డం, విభ‌జ‌న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకోవ‌డం ఈ భేటీ ల‌క్ష్యాలు. అయితే, ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిస్థితుల మీద కూడా ఇద్ద‌రు ముఖ్య‌మంత్రుల మ‌ధ్య చ‌ర్చ జ‌రిగింద‌నే వార్త‌లు వ‌చ్చాయి.

ముఖ్యంగా రెండు రాష్ట్రాల ప్ర‌భుత్వాల నిర్ణ‌యాల‌కు కేంద్రం ఆటంకాలు క‌ల్పిస్తోంద‌ని, రాష్ట్రాల‌కు న్యాయం చేయ‌డం లేద‌ని ముఖ్య‌మంత్రుల భావ‌న‌గా చెబుతున్నారు. రెండు రాష్ట్రాల్లో బీజేపీ దూకుడును అడ్డుకునే విధంగా వీరి మ‌ధ్య చ‌ర్చ జ‌రిగింద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే, ఈ ప్ర‌చారాన్ని జ‌గ‌న్ స‌ర్కార్ ఖండిస్తోంది.

కేంద్రంపై ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు అసంతృప్తిగా ఉన్నార‌ని వ‌చ్చిన వార్త‌ల‌ను జ‌గ‌న్ కార్యాల‌యం వెంట‌నే ఖండించింది. ముఖ్య‌మంత్రుల భేటీలో రాజ‌కీయాల ప్ర‌స్తావ‌న రాలేద‌ని ప్ర‌క‌టించింది. నాలుగు గంట‌ల పాటు జ‌రిగిన ఈ భేటీలో రాజ‌కీయాలు ప్ర‌స్తావ‌న‌కు రాలేదంటే ఆశ్చ‌ర్య‌క‌ర‌మే. కానీ, తెలంగాణ ప్ర‌భుత్వం త‌ర‌పున ఇటువంటి ఖండ‌న ఏమీ రాలేదు. దీనిని బ‌ట్టి కేంద్రంతో ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణానికి జ‌గ‌న్ ఇష్ట‌ప‌డం లేద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle