newssting
BITING NEWS :
*కర్ణాటక: ఉప ఎన్నికల ఫలితాల్లో దూసుకెళ్తున్న బీజేపీ.. 12 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ 2, ఇతరులు 1 స్థానంలో ఆధిక్యం*షాద్‌నగర్ ఎన్ కౌంటర్‌పై సిట్*పోలీసులకు సవాల్ గా మారిన తల్లికూతుళ్ళ హత్యకేసు... హత్య జరిగి ఐదురోజులైనా ఇంకా వీడని మిస్టరీ*దిశ కేసులో తల్లిదండ్రులను విచారించిన జాతీయ మానవహక్కుల సంఘం బృందం*ఇవాళ పార్లమెంటు ముందుకు జాతీయ పౌరసత్వ సవరణ బిల్లు *మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీలో దిశ నిందితుల మృతదేహాలు... నిందితుల కుటుంబసభ్యుల స్టేట్మెంట్ ను రికార్ట్ చేసిన ఎన్.హెచ్.ఆర్. సి*తిరుపతిలో రికార్డు స్థాయిలో ఉల్లి అమ్మకాలు.. 4 గంటల్లో 5 టన్నుల ఉల్లి అమ్మకం*జనసేన కార్యకర్తలపై పవన్ అసహనం.. మీ క్రమశిక్షణా లోపం వల్లే పార్టీ ఓడిపోయిందన్న పవన్ *తిరుపతిలో రెచ్చిపోయిన కామాంధులు.. ముళ్ళపూడిలో బాలికపై ఇద్దరు యువకుల అత్యాచారం *తిరుమల: బూందిపోటులో అగ్నిప్రమాదం.. ఆవిరిగా మారిన నెయ్యి వల్లే ప్రమాదం జరిగిందంటున్న పోటు కార్మికులు *ఇవాళ్టి నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు *తూ.గో: వెలగతోడులో వరి రైతులతో మాట్లాడిన జనసేన అధినేత పవన్ కల్యాణ్... వరి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్న పవన్*చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌పై పోలీసుల విచారణ ప్రారంభం.. ఎన్‌కౌంటర్‌పై ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణాధికారిగా రాచకొండ ఎస్వోటీ సురేందర్‌రెడ్డి నియామకం

గొట్టిపాటిని టార్గెట్ చేశారా..?

25-11-201925-11-2019 07:23:51 IST
2019-11-25T01:53:51.478Z25-11-2019 2019-11-25T01:49:33.025Z - - 09-12-2019

గొట్టిపాటిని టార్గెట్ చేశారా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలుగుదేశం పార్టీకి చెందిన అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి ర‌వికుమార్ గ్రానైట్ క్వారీల్లో వ‌రుస సోదాలు రాజ‌కీయంగా వేడి పుట్టిస్తున్నాయి. ప్ర‌కాశం జిల్లా బ‌ల్లికురువ ప్రాంతంలోని గొట్టిపాటి ర‌వికి చెందిన కిషోర్ క్వారీల్లో మూడు రోజులుగా విజిలెన్స్ అధికారులు సోదాలు జ‌రుపుతున్నారు.

మీడియాను కూడా అనుమ‌తించ‌కుండా సోదాలు జ‌రుగుతున్నాయి. అయితే, ఈ సోదాల వెనుక అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ‌కీయం ఉంద‌నేది తెలుగుదేశం పార్టీ నేత‌ల వాద‌న‌.

ఇటీవ‌ల గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ తెలుగుదేశం పార్టీని వీడే ముందు జ‌రిగిన ప‌రిణామాలు, ఇప్పుడు అద్దంకిలో జ‌రుగుతున్న ప‌రిణామాలు ఒకేలా ఉన్నాయి.

పేద‌ల‌కు న‌కిలీ ఇళ్ల ప‌ట్టాలు ఇచ్చి మోసం చేశార‌ని వ‌ల్ల‌భ‌నేని వంశీపై ఓ కేసు న‌మోదైంది. ఈ కేసు త‌న‌పై క‌క్ష‌పూరితంగా పెట్టార‌ని వంశీ మొద‌ట ఆరోపించారు. త‌ర్వాత ఆయ‌న టీడీపీకి రాజీనామా చేశారు. వైసీపీకి మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

అద్దంకి ఎమ్మెల్యేగా గొట్టిపాటి ర‌వికుమార్ తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేర‌తార‌ని గ‌త కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున ప్ర‌చారం జరుగుతోంది. వాస్త‌వానికి, ర‌వికుమార్‌కు వైసీపీ నేత‌ల‌తో, ముఖ్యంగా ప్ర‌కాశం జిల్లా మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డితో స‌త్సంబంధాలు ఉన్నాయి.

2014లో ఆయ‌న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచే గెలిచి తెలుగుదేశం పార్టీలో చేరారు. అప్పుడు కూడా త‌న క్వారీలు, వ్యాపారాల‌కు ఇబ్బందులు వ‌స్తున్నాయ‌నే ఆయ‌న అధికార టీడీపీలో చేరార‌నే ప్ర‌చారం ఉంది.

అంత‌కాలం ర‌వికి వైసీపీ అధినేత జ‌గన్‌తో మంచి సంబంధాలే ఉండేవి. టీడీపీలోకి వెళ్లాక కూడా ఆయ‌న జ‌గ‌న్‌పై ఎక్క‌డా విమ‌ర్శ‌లు చేయ‌లేదు.

ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వ‌చ్చాక కూడా ఆయ‌న వైసీపీని ప‌ల్లెత్తు మాట కూడా అన‌డం లేదు. ఇదే స‌మ‌యంలో జిల్లా మంత్రి బాలినేనితో పాటు వైసీపీ ముఖ్యుల‌తోనూ సంబంధాలు నెర‌పుతున్నార‌నే ప్ర‌చారం ఉంది. దీంతో గొట్టిపాటి ర‌వి వైసీపీలో చేర‌డం ఖాయ‌మ‌ని, వ‌ల్ల‌భ‌నేని వంశీ త‌ర్వాత టీడీపీకి రాజీనామా చేసేది ఆయ‌నే అనే ఊహాగానాలు వ‌చ్చాయి.

అయితే, ఆయ‌న వైసీపీలోకి మాత్రం రావ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు ఆయ‌న క్వారీల‌పై విజిలెన్స్ అధికారులు వ‌రుస సోదాలు జ‌ర‌ప‌డం వెనుక అధికార పార్టీ వ్యూహం ఉందా అనే అనుమానాలు మొద‌ల‌య్యాయి.

క్వారీల్లో విజిలెన్స్ అధికారులు సోదాలు చేయ‌డం సాధార‌ణ విష‌య‌మే. కానీ, మూడు రోజులుగా వ‌రుస‌గా సోదాలు జ‌రుగుతుండ‌టం, అందునా ఒక్క గొట్టిపాటికి చెందిన క్వారీలోనే జ‌రుగుతుండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

ఇటీవ‌ల ఓ శుభ‌కార్యంలో గొట్టిపాటి ర‌వి మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిని క‌లిశార‌ని, వీరి మ‌ధ్య ఏకాంత చ‌ర్చ‌లు జ‌రిగాయ‌నే వార్త‌లు వ‌చ్చాయి. ఈ స‌మావేశంలో ఆయ‌న‌ను పార్టీలోకి తీసుకొచ్చే దిశ‌గా చ‌ర్చ‌లు జ‌రిగాయ‌నే ప్ర‌చారం ఉంది.

ఆ త‌ర్వాత కూడా గొట్టిపాటి ర‌వి పార్టీలోకి రాక‌పోవ‌డంతో ఆయ‌న‌పై ఒత్తిడి తీసుకొచ్చే దిశ‌గానే టార్గెట్ చేసి విజిలెన్స్ దాడులు చేయిస్తున్నార‌ని టీడీపీ నేత‌లు భావిస్తున్నారు.

మ‌రి, వంశీ ముందు త‌న‌ను వైసీసీ టార్గెట్ చేసి కేసు పెట్టింద‌ని చెప్పి త‌ర్వాత అదే వైసీపీకి జిందాబాద్ కొట్టారు. ఇక్క‌డ గొట్టిపాటి ర‌వి విష‌యంలోనూ ఇదే జ‌రిగే అవ‌కాశం ఉండ‌వ‌చ్చు.

అధికార పార్టీలు త‌మ చేతిలో ఉన్న వ్య‌వ‌స్థ‌ల‌ను ప్ర‌యోగించి ప్ర‌త్య‌ర్థి పార్టీల నేత‌ల‌ను లొంగ‌దీసుకోవ‌డం దేశ‌వ్యాప్తంగా జ‌రుగుతున్న‌దే. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనూ చంద్ర‌బాబు నాయుడు స‌హా గ‌త ముఖ్య‌మంత్రులు ఇదే చేశారు. ఇప్పుడు జ‌గ‌న్ కూడా ఇందుకు మిన‌హాయింపుగా ఏమీ క‌నిపించ‌డం లేదు.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle