newssting
BITING NEWS :
*ఆర్టీసీ జేఏసీ బంద్ విజయవంతం..బయటకు రాని బస్సులు.. పలువురు నేతల అరెస్ట్ *తెలంగాణ సీఎస్‌, టీఎస్ఆర్టీసీ ఎండీకి బీసీ కమిషన్‌ నోటీసులు *మంచిర్యాలలో రిటైర్డ్‌ ప్రభుత్వ వైద్యుడి ఇంట్లో ఎన్‌ఐఏ సోదాలు *ఇస్లామాబాద్ : పాక్ లో ఇమ్రాన్ కు నిరసన సెగలు*హైదరాబాద్ : ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్ పద్మ ఆత్మహత్యాయత్నం *హైదరాబాద్ : బంద్ విజయవంతం-23న ఓయూలో ఆర్టీసీ బహిరంగ సభ*తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఎపీలో నిరసనలు *అమరావతి : తెలుగుదేశాన్ని విలీనం చేస్తానంటే హై కమాండ్ తో మాట్లాడతా : జీవీఎల్*విజయవాడ : తెలుగుదేశం ఎమ్మెల్యే వంశీపై ఫోర్జరీ కేసు

గెలుపెవ‌రిది అధ్య‌క్షా..?

11-05-201911-05-2019 07:09:49 IST
Updated On 29-06-2019 12:01:27 ISTUpdated On 29-06-20192019-05-11T01:39:49.970Z11-05-2019 2019-05-11T01:39:34.211Z - 2019-06-29T06:31:27.823Z - 29-06-2019

గెలుపెవ‌రిది అధ్య‌క్షా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఈ ఎన్నిక‌ల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో హాట్ సీట్ల‌లో ఒక‌టి గుంటూరు జిల్లా స‌త్తెన‌పల్లి నియోజ‌క‌వ‌ర్గం. ఇక్క‌డి నుంచి స్పీక‌ర్‌, సీనియ‌ర్ నేత కోడెల శివ‌ప్ర‌సాద‌రావు పోటీ చేస్తుండ‌ట‌మే ఇందుకు కార‌ణం. ముఖ్యంగా పోలింగ్ రోజు నియోజ‌క‌వ‌ర్గంలోని ఇనిమెట్లలో జ‌రిగిన ఘ‌ట‌న‌తో అంద‌రి దృష్టి ఈ నియోజ‌క‌వ‌ర్గంపై ప‌డింది.

గుంటూరు జిల్లాలో సీనియ‌ర్ నేత‌గా గుర్తింపు పొందిన కొడెల మ‌రోసారి స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేశారు. గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న వైసీపీ అభ్య‌ర్థి అంబ‌టి రాంబాబుపై స్వ‌ల్ప మెజారిటీతో విజ‌యం సాధించారు. త‌ర్వాత ఆయ‌న స్పీక‌ర్ గా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఈ ఐదేళ్ల కాలంలో నియోజ‌క‌వ‌ర్గాన్ని అభివృద్ధి చేశార‌నే భావ‌న ప్ర‌జ‌ల్లో ఉంది.

అయితే, అభివృద్ధి చేశార‌నే పేరుతో పాటు ప్ర‌జ‌ల్లో కోడెల ప‌ట్ల వ్య‌తిరేక‌త కూడా అదే స్థాయిలో ఉన్న‌ట్లు క‌నిపించింది. ముఖ్యంగా కోడెల కుమారుడి వైఖ‌రి, అత‌నిపై విప‌రీత‌మైన అవినీతి ఆరోప‌ణ‌లు రావ‌డం కోడెల‌కు మైన‌స్ గా మారింది. ఓ ద‌శ‌లో నియోజ‌క‌వ‌ర్గంలో అఖిల‌ప‌క్షం ఏర్పాటు చేసుకొని మ‌రీ కోడెల అవినీతిపై పోరాడారు.

గ‌త ఎన్నిక‌ల్లో స్వ‌ల్ప తేడాతో ఓడిపోయిన వైసీపీ అభ్య‌ర్థి అంబ‌టి రాంబాబుపై కొంత సానుభూతి కూడా ఉంది. దీంతో పోలింగ్ కు ముందు రోజు వ‌ర‌కు కోడెల‌కు పెద్ద‌గా సానుకూలత క‌నిపించ‌లేదు. అయితే, పోలింగ్ రోజు ఇనిమెట్ల అనే గ్రామంలో కోడెల‌పై వైసీపీ శ్రేణులు, గ్రామ‌స్థులు దాడి చేయ‌డం పెద్ద చ‌ర్చ‌నీయాంశ‌మైన సంగ‌తి తెలిసిందే.

ఈ ఘ‌ట‌న‌పై మ‌ధ్యాహ్నమే జ‌ర‌గ‌డం, త‌ర్వాత చిరిగిన బ‌ట్ట‌ల‌తోనే కోడెల నియోజ‌క‌వ‌ర్గంలో తిరిగి ఓటేయ‌డం, కోడెల‌పై వైసీపీ దాడి చేసింద‌ని టీవీల్లో పెద్ద ఎత్తున ప్ర‌చారం కావ‌డంతో సీన్ మారే అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్నారు. ఈ ఘ‌ట‌న త‌ర్వాత కోడెల ప‌ట్ల సానుభూతి వ్య‌క్త‌మైంద‌ని, మ‌ధ్యాహ్నం త‌ర్వాత పోలింగ్ కోడెల‌కు అనుకూలంగా జ‌రిగింద‌ని అంటున్నారు.

ఏదేమైనా కోడెల విజ‌యం మాత్రం అంత సులువుగా క‌నిపించ‌డం లేదు. ఇక‌, స్పీక‌ర్ గా ప‌నిచేసిన వారు ఓడిపోవ‌డ‌మో, రాజ‌కీయంగా తెర‌మ‌రుగు కావ‌డ‌మో గత కొన్నేళ్లుగా సెంటిమెంట్ గా వ‌స్తోంది. ఇటీవ‌లి తెలంగాణ‌లోనూ స్పీక‌ర్ గా ఉన్న మ‌ధుసూద‌నాచారి ఓడిపోయారు. ఈ సెంటిమెంట్ మాత్రం కోడెల వ‌ర్గీయుల‌ను క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేస్తోంది.

ఇక‌, ఏపీ డిప్యూటీ స్పీక‌ర్ మండ‌లి బుద్ధ‌ప్ర‌సాద్ మ‌రోసారి కృష్ణా జిల్లా అవ‌నిగ‌డ్డ నియోజ‌కవ‌ర్గం నుంచి పోటీ చేశారు. గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న వైసీపీ అభ్య‌ర్థి సింహాద్రి ర‌మేశ్ పై 5,958 ఓట్ల మెజారిటీతో గెలిచారు. బుద్ధ‌ప్ర‌సాద్‌కు నియోజ‌క‌వ‌ర్గంలో మంచి పేరుంది. సౌమ్యుడిగా, వివాద‌ర‌హితుడిగా ఉన్నారు. 

ఇక‌, వైసీపీ అభ్య‌ర్థి సింహాద్రి ర‌మేశ్‌కు గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన సానుభూతి క‌లిసిరానుంది. దీంతో బుద్ధ‌ప్ర‌సాద్ కూడా గ‌ట్టి పోటీ ఎదుర్కొన్నారు. మొత్తంగా గ‌త అసెంబ్లీలో స్పీక‌ర్‌, డిప్యూటీ స్పీక‌ర్ లుగా ఉన్న వారు ఈసారి విజ‌యం సాధించ‌డం అంత సులువుగా మాత్రం క‌నిపించ‌డం లేదు. 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle