newssting
BITING NEWS :
*అక్రమ వలసదారులను పంపిస్తాం: హోం మంత్రి అమిత్ షా *నేడు, రేపు తెలంగాణ శాసనసభ.. రేపు మండలి సమావేశాలు *మున్సిపల్‌ చట్టాల బిల్లును ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం *22న నింగిలోకి.. చంద్రయాన్‌–2 *కర్నాటకలో ఇవాళ కుమారస్వామి ప్రభుత్వ విశ్వాసపరీక్ష * కుల్ భూషణ్ కి రిలీఫ్.. పాక్ విధించిన మరణశిక్షను రద్దుచేసిన అంతర్జాతీయ న్యాయస్థానం * కర్నాటక అసెంబ్లీకి వెళ్లే ప్రసక్తే లేదు: రెబల్స్‌ *తిరుమలలో ఎల్1, ఎల్ 2, ఎల్ 3 దర్శనాలు రద్దు *ముంబయి పేలుళ్ల సూత్రధారి సయీద్‌ అరెస్టు

గెలుపు పక్కా, మెజారిటీయే ఇప్పుడు లెక్క!

04-04-201904-04-2019 11:52:21 IST
Updated On 09-07-2019 12:11:49 ISTUpdated On 09-07-20192019-04-04T06:22:21.094Z04-04-2019 2019-04-04T06:22:19.009Z - 2019-07-09T06:41:49.668Z - 09-07-2019

గెలుపు పక్కా, మెజారిటీయే ఇప్పుడు లెక్క!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
నెల్లూరు జిల్లాలో తిరుగులేని నేతగా పేరున్న ఆనం రాంనారాయణ రెడ్డి వైఎస్సార్సీపీ తరఫున వెంకటగిరి నుంచి పోటీకి దిగినప్పుడే ఆయన గెలుస్తారని క్యాడర్లో బలమైన నమ్మకం వచ్చేసింది. వెంకటగిరిలో మూడు దశాబ్దాలుగా టీడీపీలో ఉన్న వెంకటగిరి రాజా కుటుంబీకులు తెలుగుదేశాన్ని వీడి జగన్ పార్టీలో చేరడంతో వేలాదిగా ఉన్నవారి వర్గీయులంతా ఆనం వైపు టర్న్ తీసుకున్నారు. దీంతో ఆనం గెలుపు ఖాయమైపోయింది. మున్సిపల్ చైర్‌పర్సన్ దొంతు శారద కూడా ఇటీవల వైఎస్సార్సీపీలోకి వచ్చారు. 

క్యాడర్ అంతా వైసీపీకి వెళ్ళిపోవడంపై వెంకటగిరిపై టీడీపీ ఇప్పటికే ఆశలు వదిలేసుకుంది. అందుకే ఇప్పుడు ఆనంకు వచ్చే మెజారిటీ ఎంత అనేది ప్రిస్టేజ్ ఇష్యూగా మారింది. పులివెందుల తర్వాత అంత మెజారిటీ సాధించి జగన్‌కు బహుమతిగా ఇవ్వాలని ఆనం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అధికారపార్టీ ఎమ్మెల్యే కె.రామకృష్ణ ప్రతి పనిలోనూ మామూళ్లు ముక్కుపిండి వసూళ్లు చేస్తారనే ఆరోపణలున్నాయి. అయినా సిట్టింగ్ ఎమ్మెల్యేకి సీటు ఇవ్వడం క్యాడర్‌పై ప్రభావం చూపిస్తోంది. 

తెలుగుదేశంలో కనీస గౌరవం దక్కక వివాదరహితులైన వెంకటగిరి రాజా కుటుంబీకులు సాయికృష్ణయాచేంద్ర, సర్వజ్ఞకుమార యాచేంద్ర, రామ్‌ప్రసాద్‌ యాచేంద్ర ఆ పార్టీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దొంతు శారద సైతం సిట్టింగ్ ఎమ్మెల్యే పెట్టిన అవమానాలు భరించలేక ఆ పార్టీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరారు.

వెంకటగిరి నియోజకవర్గంలో విద్య, వైద్యం, సాగునీటి రంగాల్లో మౌలిక వసతులు కోసం ఆనం రామనారాయణరెడ్డి ప్రకటిస్తున్న సమగ్ర ప్రణాళికపై పార్టీలకు అతీతంగా మద్దతు లభిస్తుండడంతో ఈ దఫా ఎన్నికల్లో ఆనం రామనారాయణరెడ్డి గెలుపు తథ్యమని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. 

2014లో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో జిల్లా అంతా వైఎస్సార్‌సీపీ గాలి వీచినా వెంకటగిరి మున్సిపాలిటీలో 25 వార్డులకు గానూ 21 వార్డుల్లో టీడీపీకి పట్టం కట్టారు. ఈ విజయాల పరంపర వెనుక  వెంకటగిరి రాజాల కృషి ఉందనేది నిర్విదాంశం.

ఇప్పుడు రాజాల కుటుంబం వైఎస్సార్సీపీలో చేరడం, ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వీస్తున్న ఫ్యానుగాలి.. ఆనం రాంనారాయణరెడ్డికి మంచి వ్యక్తిగా ఉన్న గుర్తింపు వెంకటగిరిలో ఆనం అఖండ మెజారిటీతో గెలవబోతున్నారని ముందే తెలిసిపోయింది. వైసీపీ నవరత్నాల గురించి ఆయన బాగా ప్రచారం చేస్తున్నారు. వైసీపీ క్యాడర్ మాత్రం ఆనం మెజారిటీపై లెక్కలేసుకుంటున్నారు.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle