newssting
BITING NEWS :
*ప్రధాని మోదీని కలిసిన వైఎస్ఆర్సీఎల్పీ నేత జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర సమస్యలపై చర్చ, ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం * వాల్డ్ కప్ వార్మప్ మ్యచ్ లో టీమిండియా పేలవ ప్రదర్శన, న్యూజీల్యాండ్ చేతిలోఓటమి * నరేంద్ర మోదీని పీఎం ఎలక్ట్ గా నియమించిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ * రాష్ట్రపతి కోవింద్ కు కొత్త ఎంపీల జాబితా సమర్పించిన ఈసీ * ఎవరెస్ట్ పర్వతంపై ఈ వారం మరణించిన పర్వతారోహకుల సంఖ్య 10కి చేరిక * తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కు ఏపీలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల జాబితా సమర్పించిన సీఈఓ జీకే ద్వివేది

గుండెపోటుతో వైఎస్ వివేకానందరెడ్డి కన్నుమూత

15-03-201915-03-2019 09:02:39 IST
Updated On 15-03-2019 12:08:01 ISTUpdated On 15-03-20192019-03-15T03:32:39.332Z15-03-2019 2019-03-15T03:31:00.772Z - 2019-03-15T06:38:01.654Z - 15-03-2019

గుండెపోటుతో వైఎస్ వివేకానందరెడ్డి కన్నుమూత
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
జగన్ ఫ్యామిలీలో విషాదం  చోటుచేసుకుంది. జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి గుండెపోటుతో కన్నుమూశారు. రెండురోజులుగా లోట‌స్ పాండ్ లో పార్టీ ఎన్నిక‌ల ప్ర‌చారం లో ఎలాంటి వ్యూహాలు అనుస‌రించాల‌ని అనే అంశం పై జ‌గ‌న్‌తో చ‌ర్చించారు. గురువారం పులివెందులలో ప్ర‌చారంలో పాల్గొన్నారు. ఆయ‌న ఈ తెల్ల‌వారు జామున గుండెపోటుతో మ‌ర‌ణించారు.

ఈ వార్త తెలియ‌టంతో జ‌గ‌న్ కుటుంబం తీవ్రమయిన షాక్‌కి గురైంది. వైఎస్ నుండి జ‌గ‌న్ వ‌ర‌కు రాజ‌కీయంగా మ‌ధ్య‌లో కొంత కాలం విభేదించినా...ఆయ‌న వైఎస్ కుటుంబంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. జగన్ బాబాయిగా పెద్దదిక్కుగా అనేక సలహాలు అందించి ముందుకు నడిపించారు. 1950 ఆస్స‌గు 8న జ‌న్మించిన వైయ‌స్ వివేకా జ‌న్మించారు.

వ్య‌వ‌సాయ గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేసిన వివేకా.. వైయ‌స్ రాజ‌శేఖ‌ర రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికైన స‌మ‌యంలో క‌డ‌ప ఎంపీగా వివేకా ప‌ని చేసారు. 1999,2004 లో వివేకా క‌డ‌ప ఎంపీగా ప‌ని చేసారు. 1989, 1994 లో పులివెందుల‌ ఎమ్మ‌ల్యేగానూ ఆయ‌న ప‌ని చేసారు.

కిర‌ణ్ కుమార్ రెడ్డి ప్ర‌భుత్వంలో వ్య‌వ‌సాయ శాఖ మంత్రిగా ప‌ని చేసిన వివేకానందరెడ్డి ఎమ్మెల్సీగా వ్య‌వ‌హ‌రించారు. పులి వెందుల లో ప‌రాజ‌యం అనంతరం ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేసారు. వైయ‌స్ ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యం లో క‌డ‌ప రాజ‌కీయాల‌ను పూర్తిగా వివేకా ప‌ర్య‌వేక్షించేవారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసి జ‌గ‌న్కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు.

ఆ త‌రువాత క‌డ‌ప లో జ‌రిగిన స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఆయ‌న పోటీ చేసి ఓడిపోయారు. పులివెందులలో  జ‌గ‌న్ త‌ర‌పున ఆయ‌న ప్ర‌చారం ప్రారంభించారు. విషాదం సంగతి తెలియగానే జ‌గ‌న్ కుటుంబం పులివెందుల‌కు బయలుదేరి వెళ్లింది. 

Image result for ysr with ys vivekananda reddy


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకి జర్నలిజంలో విశేష అనుభవం. 21 సంవత్సరాల క్రితం జర్నలిజంలోకి ప్రవేశించిన సత్యనారాయణరాజు ప్రముఖ దినపత్రికలు, న్యూస్ ఛానెళ్ళలో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... మూడేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో సీనియర్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు.ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle