newssting
BITING NEWS :
*కరోనా కట్టడిలో అన్ని వర్గాల కృషిని ప్రశంసించిన ప్రధాని మోడీ. మన్ కీ బాత్ లో పలు అంశాలను ప్రస్తావించిన మోడీ ఆత్మనిర్భర భారత్ ద్వారా ఆర్థికవ్యవస్థకు ఊతం *తెలంగాణలో పెరుగుతున్న కేసులు.. కొత్తగా 74, మరణాలు 77, మొత్తం కేసులు 2499 * జూన్ 30 వరకూ ఐదవ విడత లాక్ డౌన్.. పలు సడలింపులు *దేశ వ్యాప్తంగా జూన్ 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు..కొత్త మార్గదర్శకాలు రిలీజ్ చేసిన కేంద్రం..ఈ సారి లాక్ డౌన్ లో మరిన్ని సడలింపులు..కేవలం కంటైన్మెంట్ జోన్లకే లాక్ డౌన్ పరిమితం*మాల్స్, రెస్టారెంట్లు జూన్ 8 వ తేదీ నుంచి పునఃప్రారంభం..కర్ఫ్యూ సమయం కుదింపు..దేశ వ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ*ఆదివారం మన్ కీ బాత్ లో పలు వివరాలు వెల్లడించనున్న ప్రధాని మోడీ * మాల్స్, రెస్టారెంట్ల, దేవాలయాలు, చర్చిలు జూన్ 8 నుంచి ప్రారంభం *పాఠశాలలు, కాలేజీలు, విద్యాసంస్థలు ప్రారంభంపై రాష్ట్రాలకు నిర్ణయాధికారం *విద్యాసంస్థల ప్రారంభంపై జూలైలో నిర్ణయం*నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామక ఉత్తర్వులు వెనక్కి *ఏపీలో మొత్తం కేసులు 3461

గుంటూరుకి జూన్ 1న తొలి రైలు.. మారిన టికెట్ బుకింగ్ నిబంధనలు

22-05-202022-05-2020 12:12:59 IST
Updated On 22-05-2020 16:28:26 ISTUpdated On 22-05-20202020-05-22T06:42:59.701Z22-05-2020 2020-05-22T06:39:37.951Z - 2020-05-22T10:58:26.924Z - 22-05-2020

గుంటూరుకి జూన్ 1న తొలి రైలు.. మారిన టికెట్ బుకింగ్ నిబంధనలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
లాక్ డౌన్ కారణంగా నిత్యం రద్దీగా వుండే గుంటూరు జంక్షన్ రైల్వే స్టేషన్ బోసిపోయింది.  లాక్‌డౌన్‌ ప్రారంభమైన తర్వాత తొలి రైలు జూన్‌ ఒకటో తేదీన గుంటూరుకు చేరుకోనుంది. సికింద్రాబాద్‌ - గుంటూరు - సికింద్రాబాద్‌ ప్రత్యేక రైలు(గోల్కొండ రైలు సమయం), సికింద్రాబాద్‌ - హౌరా - సికింద్రాబాద్‌ (ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ టైం) మధ్య మరో రైలుని తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకు డైలీ సర్వీసుగా నడపనున్నట్లు సీపీఆర్‌వో రాకేష్‌ తెలిపారు. 

నెంబరు. 07202 సికింద్రాబాద్‌ - గుంటూరు ప్రత్యేక రైలు జూన్‌ ఒకటి నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు బయలుదేరి రాత్రి 9.15 గంటలకు గుంటూరుకు చేరుకొంటుంది. జిల్లాలో పెదకాకాని, నంబూరు, మంగళగిరి, కృష్ణాకెనాల్‌లో నిలుపుదల ఉంటుంది. ఈ రైలు ద్వారా విజయవాడ, ఖమ్మం, వరంగల్‌, సికింద్రాబాద్‌ తదితర ప్రాంతాలకు ప్రయాణం చేయవచ్చు. నెంబరు. 07201 గుంటూరు - సికింద్రాబాద్‌ ప్రత్యేక రైలు జూన్‌ ఒకటో తేదీ నుంచి నిత్యం ఉదయం 6 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 1.50కి సికింద్రాబాద్‌ చేరుకొంటుంది. ఈ రైలులో సెకండ్‌ సిట్టింగ్‌, ఏసీ చైర్‌కార్‌ బోగీలు మాత్రమే ఉంటాయి.   

నెంబరు. 02704 సికింద్రాబాద్‌ - హౌరా(ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ టైంటేబుల్‌) జూన్‌ ఒకటో తేదీన మధ్యాహ్నం 3.55 గంటల నుంచి నిత్యం బయలుదేరుతుంది. ఈ రైలుకు గుంటూరులో పిడుగురాళ్ల, గుంటూరు రైల్వే జంక్షన్‌లో హాల్ట్ సౌకర్యం వుంది. 

స్లీపర్‌, త్రీటైర్‌, టూటైర్‌, ఫస్టు ఏసీ టిక్కెట్ల రిజర్వేషన్‌ ప్రారంభం అయిన కొద్ది నిమిషాల్లోనే బుకింగ్‌ అయిపోయి వెయిటింగ్‌లిస్టులోకి వెళ్లిపోయింది. నెంబరు. 02703 హౌరా - సికింద్రాబాద్‌  (ఫలక్‌నుమా సమయ పట్టిక) ఈ నెల 3న గుంటూరు మీదుగా సికింద్రాబాద్‌కు చేరుకొంటుంది. టిక్కెట్‌లు వెయిటింగ్‌లిస్టులో జారీ చేసినప్పటికీ అవి కన్‌ఫర్మ్‌ అయితేనే రైల్వేస్టేషన్‌లోకి అనుమతిస్తారు. 

ఈ రైళ్లలో తత్కాల్‌, ప్రీమియం తత్కాల్‌ కోటా ఉండదు. జనరల్‌ బోగీలు కూడా ఉండవు. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌/మొబైల్‌యాప్‌ ద్వారా మాత్రమే టిక్కెట్‌లు బుకింగ్‌ చేసుకొనే వెసులుబాటు కల్పించారు. కేంద్ర మంత్రులు, ప్రభుత్వ విప్‌లు, సుప్రీం కోర్టు/హైకోర్టు న్యాయమూర్తులు తదితరులు పీఆర్‌ఎస్‌ కౌంటర్ల ద్వారా టిక్కెట్‌లు బుకింగ్‌ చేసుకోవాలి. సిట్టింగ్‌, మాజీ పార్లమెంట్‌ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీలు, స్వాతంత్య్ర సమరయోధులు, పూర్తి రీయింబర్స్‌మెంట్‌ అయ్యే రైల్వే వారంట్‌లు/వోచర్లు, దివ్యాంగులు, మరో 11 రకాల రోగులు, విద్యార్థులు మాత్రం రైల్వే పీఆర్‌ఎస్‌ కౌంటర్లకు వెళ్లి టిక్కెట్‌లు బుకింగ్‌ చేసుకోవాలి.

సాధారణ ప్రయాణీకులను పీఆర్‌ఎస్‌ కౌంటర్ల వద్దకు అనుమతించరు. ఆర్‌ఏసీ, వెయిటింగ్‌లిస్టులో టిక్కెట్‌లు జారీ చేసినప్పటికీ కన్‌ఫర్మ్‌ అయితేనే ప్రయాణానికి అనుమతి ఉంటుంది. 30 రోజులు ముందుగా అడ్వాన్స్‌ టిక్కెట్‌లు బుకింగ్‌ చేసుకోవచ్చు. ప్రతీ ప్రయాణికుడు రెండు గంటల ముందుగా రైల్వేస్టేషన్‌కు చేరుకోవాలి. వారికి స్ర్కీనింగ్‌, శానిటైజేషన్‌ చేస్తారు. కోవిడ్‌-19 లక్షణాలు లేకపోతేనే అనుమతిస్తారు. గమ్యస్థానం చేరుకొన్న తర్వాత అక్కడి జిల్లా యంత్రాంగం అమలు చేస్తోన్న కొవిడ్‌-19 ప్రొటోకాల్స్‌ని పాటించాలి.

తెలంగాణలో కంటైన్మెంట్ జోన్లలోనే లాక్‌డౌన్ ... అక్కడ షరతులు వర్తిస్తాయ్!

తెలంగాణలో కంటైన్మెంట్ జోన్లలోనే లాక్‌డౌన్ ... అక్కడ షరతులు వర్తిస్తాయ్!

   6 hours ago


తెలంగాణలో కరోనా విజృంభణ.. ఒకేరోజు 6 గురు మృతి!

తెలంగాణలో కరోనా విజృంభణ.. ఒకేరోజు 6 గురు మృతి!

   11 hours ago


భక్తులకు శుభవార్త.. జూన్ 8 నుంచి తిరుమలలో దర్శనాలు

భక్తులకు శుభవార్త.. జూన్ 8 నుంచి తిరుమలలో దర్శనాలు

   14 hours ago


మోడీ మన్ కీ బాత్.. కరోనాపై యుద్ధానికి కొత్త దారులు వెతుకుదాం

మోడీ మన్ కీ బాత్.. కరోనాపై యుద్ధానికి కొత్త దారులు వెతుకుదాం

   14 hours ago


నిమ్మగడ్డ  ఎపిసోడ్‌లో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు

నిమ్మగడ్డ ఎపిసోడ్‌లో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు

   14 hours ago


మోడీ సరే.. మరి తెలంగాణ సీఎం వైఖరేంటో?

మోడీ సరే.. మరి తెలంగాణ సీఎం వైఖరేంటో?

   16 hours ago


యడ్డీ మెడపై రెబెల్స్ కత్తి.. వణుకుతున్న బీజేపీ

యడ్డీ మెడపై రెబెల్స్ కత్తి.. వణుకుతున్న బీజేపీ

   17 hours ago


‘‘ఓ తల్లి ఉసురు మీకు తగలక మానదు’’

‘‘ఓ తల్లి ఉసురు మీకు తగలక మానదు’’

   17 hours ago


తండ్రిని మించిన ఫైర్‌బ్రాండ్‌.. తెర‌పైకి జ‌యారెడ్డి

తండ్రిని మించిన ఫైర్‌బ్రాండ్‌.. తెర‌పైకి జ‌యారెడ్డి

   17 hours ago


డాక్టర్ సుధాకర్ కేసులో సీబీఐ ఏం తేల్చబోతోంది?

డాక్టర్ సుధాకర్ కేసులో సీబీఐ ఏం తేల్చబోతోంది?

   30-05-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle