newssting
BITING NEWS :
* అధికారిక లాంఛనాలతో అరుణ్ జైట్లీ అంత్యక్రియలు పూర్తి* తెలుగు తేజం పీవీ సింధు సరికొత్త చరిత్ర*ప్రపంచ బ్యాడ్మింటన్ ఫైనల్‌లో ఒకుహరాతో తలపడి విజయం సాధించిన పీవీ సింధు* పీవీ సింధుకు మోదీ,జగన్‌,కేసీఆర్‌, చంద్రబాబు, పవన్ అభినందనలు*పీవీ సింధు, ప్రణీత్‌కు రివార్డులు* రైలు పట్టాలపై సెల్ఫీకి రూ.2 వేల జరిమానా*అమెరికాలో కాల్పుల కలకలం..బాలిక దుర్మరణం *ఫ్రాన్స్‌లో నేడు జి-7 దేశాల సదస్సు… హాజరైన భారత ప్రధాని మోడీ *ఏపీలో మూడు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు..మాల, మాదిగ, రెల్లి కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు *ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణంపై వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: మంత్రి బొత్స

గిడ్డి ఈశ్వరి గట్టెక్కుతారా?

30-04-201930-04-2019 08:51:09 IST
Updated On 03-07-2019 11:33:27 ISTUpdated On 03-07-20192019-04-30T03:21:09.948Z30-04-2019 2019-04-30T03:20:49.873Z - 2019-07-03T06:03:27.760Z - 03-07-2019

గిడ్డి ఈశ్వరి గట్టెక్కుతారా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాజ‌కీయాల్లో పార్టీ మార‌డం స‌హ‌జ‌మే అయినా, ప‌రిస్థితిని అంచ‌నా వేయకుండా, తాత్కాలిక ప్రయోజ‌నం చూసుకుంటే దెబ్బతిన‌డం ఖాయం. ఈ సూత్రం ఇప్పుడు విశాఖ జిల్లా ఏజెన్సీ నియోజ‌క‌వ‌ర్గమైన పాడేరు ఎంఎల్ఏ గిడ్డి ఈశ్వరికి వ‌ర్తిస్తుంద‌ని చాలా మంది చెబుతున్న మాట‌. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి 26,141 ఓట్ల మెజార్టీతో గెలిచారు ఈశ్వరి. ఉపాధ్యాయురాలిగా ఉన్న ఈశ్వరికి టిక్కెట్ ఇచ్చి మరీ గెలిపించుకున్నారు జ‌గ‌న్. ఆ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ సీనియ‌ర్ నేత ప‌సుపులేటి బాల‌రాజును సునాయాసంగా ఓడించారు. 

అయితే చంద్రబాబు నాయుడు ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ దెబ్బకు టీడీపీలో చేరారు ఈశ్వరి. దీంతో పాడేరు జ‌నంలో ఆమె చుల‌క‌న అయ్యార‌ట‌.  తాము ఓ పార్టీ నుంచి గెలిపిస్తే, గెలిచిన త‌ర్వాత మ‌రో పార్టీలోకి మార‌డంపై జ‌నం గుర్రుగా ఉన్నట్లు ప్రచారం జ‌రిగింది. జ‌నంలో ఆమె మీద వ్యతిరేక‌త ఉంద‌ని తెల్సినా, ఈ ఎన్నిక‌ల్లో ఆమెకే మ‌ళ్లీ టిక్కెట్ ఇచ్చార‌ట చంద్రబాబు. దీంతో పాడేరు నియోజ‌క‌వ‌ర్గంలోని కీల‌క టీడీపీ నేత‌లతో పాటు మాజీ మంత్రి మ‌ణికుమారి తూతూ మంత్రంగా ప‌ని చేశార‌ట‌. అంటే సైకిల్ పార్టీ నుంచి గిడ్డి ఈశ్వరికి పెద్దగా స‌పోర్టు రాలేద‌ని తెలుస్తోంది. 

ఇదే స‌మ‌యంలో గిరిజ‌నులు మొత్తం జ‌గ‌న్ పార్టీకి జై కొట్టడం కూడా ఆమె విజ‌యావ‌కాశాల‌ను దెబ్బతీసేలా ఉన్నాయ‌ని పాడేరులో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక వైసీపీ నుంచి మాజీ ఎంఎల్ఏ కొట్టగిళ్ల చిట్టినాయుడు కుమార్తె భాగ్యల‌క్ష్మి బ‌రిలో దిగారు. గిరిజ‌నం మొత్తం ఇప్పుడు ఆమె వైపే మొగ్గు చూపిన‌ట్లు ప్రచారం జ‌రుగుతోంది. ఇక జ‌న‌సేన పార్టీ నుంచి బ‌రిలో దిగిన మాజీ మంత్రి ప‌సుపులేటి బాల‌రాజు, కొంత మొత్తంలో ఓట్లను చీల్చార‌ట‌. 

అయితే ఈ చీలిక వ‌ల్ల ఎక్కువ‌గా న‌ష్టపోయేది గిడ్డి ఈశ్వరి అన్నది కూడా పాడేరు నియోజ‌క‌వ‌ర్గంలో ప్రచారం జ‌రుగుతోంది. మొత్తానికి టిక్కెట్ విష‌యంలో స‌క్సెస్ అయిన‌ గిడ్డి ఈశ్వరికి ఫ‌లితాలు ఎలా ఉంటాయ‌న్న దాని మీద పాడేరులో తీవ్ర చ‌ర్చ జ‌రుగుతోంది.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle