newssting
BITING NEWS :
*అక్రమ వలసదారులను పంపిస్తాం: హోం మంత్రి అమిత్ షా *నేడు, రేపు తెలంగాణ శాసనసభ.. రేపు మండలి సమావేశాలు *మున్సిపల్‌ చట్టాల బిల్లును ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం *22న నింగిలోకి.. చంద్రయాన్‌–2 *కర్నాటకలో ఇవాళ కుమారస్వామి ప్రభుత్వ విశ్వాసపరీక్ష * కుల్ భూషణ్ కి రిలీఫ్.. పాక్ విధించిన మరణశిక్షను రద్దుచేసిన అంతర్జాతీయ న్యాయస్థానం * కర్నాటక అసెంబ్లీకి వెళ్లే ప్రసక్తే లేదు: రెబల్స్‌ *తిరుమలలో ఎల్1, ఎల్ 2, ఎల్ 3 దర్శనాలు రద్దు *ముంబయి పేలుళ్ల సూత్రధారి సయీద్‌ అరెస్టు

గాజు గ్లాసూ.. భలే క్రేజీ బాసూ!

27-12-201827-12-2018 12:00:35 IST
2018-12-27T06:30:35.770Z27-12-2018 2018-12-27T06:30:33.607Z - - 18-07-2019

గాజు గ్లాసూ.. భలే క్రేజీ బాసూ!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ విచిత్రమైన ప‌రిస్థితి కనిపిస్తోంది. సినీనటుడు పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనకు ఎన్నికల సంఘం పార్టీ గుర్తును కేటాయించినప్పటి నుంచి హడావిడి పెరిగిపోయింది. పార్టీ గుర్తుగా గాజు గ్లాసును కేటాయించ‌డంతో పార్టీనేత‌ల్లో, అభిమానుల్లో నూత‌నోత్తేజం పెల్లుబుకుతోంది. పార్టీ గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వారంతా నడుంబిగించారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సైతం ఇదే విషయాన్ని పార్టీ కేడర్‌కు వివరించారు. పార్టీ త‌రుపున పోటీ చేయాలని భావిస్తున్న అభ్యర్తులు కూడా గ్లాసు గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్లాల‌ని ప‌వ‌న్ సూచించారు. దీంతో గాజు గ్లాసుల కొనుగోలుపై వారు ఆసక్తి చూపిస్తున్నారు.ఇదంతా బాగానే ఉంది. కానీ జ‌న‌సేన గుర్తు పుణ్యమాని రాష్ట్రంలో మాత్రం విచిత్ర ప‌రిస్థితి నెల‌కొంది. పార్టీ శ్రేణులు, అభిమానులు ఎగ‌బ‌డి గ్లాసుల‌ను కొనుగోలు చేస్తుంటే .. ఉభయ గోదావరి జిల్లా సహా ఆంధ్రాలోని పలు జిల్లాల్లో గాజు గ్లాసులకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. పలు చోట్ల ఈ గ్లాసులకు కొరత కూడా ఉంది. నో స్టాక్ బోర్డులు దర్శనం ఇస్తున్నాయి. మీ దగ్గర లేకుంటే ఎక్కడినుంచైనా తెప్పించండి అంటూ వ్యాపారులను జనసేన నాయకులు అభ్యర్ధిస్తున్నారు. అడ్వాన్స్‌లు కూడా ఇస్తున్నారు. 

దీంతో ఈ గాజు గ్లాసుల ధరలకు రెక్కలొచ్చాయి, సాధారణంగా గాజు గ్లాసు ధర రూ. 10 రూపాయలు వరకూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఉత్తరాంధ్ర సహా ఏపీలోని పలు జిల్లాల్లో ఈ గాజు గ్లాసు ధర 50 రూపాయల వరకు పలుకుతోందని తెలుస్తోంది. మార్కెట్లో గ్లాసులు లేక‌పోవ‌డంతో గ్లాసుల కొర‌త పార్టీ నేతలను పట్టిపీడిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో చలామణీలో ఉన్నవి అన్నీ ప్లాస్టిక్ గ్లాసులే కాబ‌ట్టి గాజు గ్లాసుల‌కు భారీగా డిమాండ్ ఉంది. ఒకప్పుడు గాజు గ్లాసుల వినియోగం ఎక్కువగా ఉండే టీ స్టాల్స్ దగ్గర ఉండేది. కాని పేప‌ర్ క‌ప్‌లు రావ‌డంతో వాటి అమ్మకాలు కూడా తగ్గిపోయాయి. కొన్ని చోట్ల గాజు గ్లాసులు లేవంటూ నో స్టాక్ బోర్డు పెట్టేశారు. జనసేన కార్యకర్తలు, నాయకులు తమకు గాజు గ్లాసులు పెద్ద సంఖ్యలో కావాలంటూ కంపెనీలకు ఆర్డర్లు కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా క‌నుమ‌రుగవుతున్న గాజుగ్లాసులు జ‌న‌సేన పుణ్యమా అని మ‌రో సారి వెలుగులోకి వ‌స్తున్నాయి. మార్కెట్లలో మూల‌న ప‌డిన స్టాకంతా హాట్ కేకుల్లా అమ్ముడుపోతుండ‌టంతో షాపు య‌జ‌మానులు ఖుషీగా ఉన్నారు. నేతలు మాత్రం కనిపించిన వారికల్లా గాజు గ్లాసులు ఇస్తూ మా పార్టీ గుర్తు ఇదే మరిచిపోకండి సుమా అంటూ ప్రచారం మొదలెట్టేశారు. 2019 ఎన్నికల నాటికి తమ గాజు గ్లాసు గుర్తు ప్రతి ఇంట్లో సందడి చేయడం ఖాయం అంటూ జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle