newssting
BITING NEWS :
*శాసనమండలి రద్దుకి జగన్ తీర్మానం..ఆమోదం *భోగాపురం పోర్ట్‌, మచిలీపట్నం ఎయిర్‌పోర్ట్‌లపై చర్చించనునున్న కేబినేట్‌*ఏపీలో నేటి శాసనసభ సమావేశాలకు టీడీపీ దూరం*ఆంధ్రప్రదేశ్‌: నేడు ఉదయం 11గంటలకు ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలు*దేశవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు *అసోంలో బాంబుపేలుళ్ళు *హైదరాబాద్ లో బీజేపీ ఆధ్వర్యంలో భరతమాత మహా హారతి. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన గవర్నర్ తమిళిసై*మేడారం జాతరకు ముఖ్యమంత్రి కెసిఆర్ కు ఆహ్వానం. సమ్మక్క... సారలమ్మ జాతరకు రావాలని ఆహ్వానం. ఆహ్వానించిన మంత్రులు ఇంద్రకిరణ్ రెడ్డి, ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్*మండలి రద్దు జగన్ అనుకున్నంత సులభంకాదన్న నేతలు. కేంద్రం అంత సులభంగా రద్దుపై నిర్ణయం తీసుకోదు *ఏపీ రాజ్ భవన్ లో గవర్నర్ ఎట్ హోమ్ కార్యక్రమం. రాజకీయ, వివిధ రంగాల్లోని ప్రముఖులకు గవర్నర్ విందు. ఎట్ హోమ్ కు హాజరైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్, స్పీకర్ తమ్మినేని, మండలి చైర్మన్ షరీఫ్ *సెలక్ట్ కమిటీ ఏర్పాటులో తోలి అడుగు. కమిటీకి సభ్యుల పేర్లను ఇవ్వాలని పార్టీలకు చైర్మన్ లేఖ*ఏపీలో స్పీకర్, ఛైర్మన్లతో విడి విడిగా భేటీ అయిన గవర్నర్..కీలక సమయంలో స్పీకర్, ఛైర్మన్లతో గవర్నర్ భేటీపై ఆసక్తి

గాంధీ సంకల్పయాత్రతో బయటపడ్డ ప్రజా సమస్యలెన్నో!

02-11-201902-11-2019 15:45:03 IST
Updated On 02-11-2019 16:51:50 ISTUpdated On 02-11-20192019-11-02T10:15:03.878Z02-11-2019 2019-11-02T10:15:02.136Z - 2019-11-02T11:21:50.086Z - 02-11-2019

గాంధీ సంకల్పయాత్రతో బయటపడ్డ ప్రజా సమస్యలెన్నో!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
బీజేపీ ఏపీలో 15 రోజుల పాటు నిర్వహించిన గాంధీ సంకల్పయాత్రలో అనేక సమస్యలు తెరమీదకు వచ్చాయి. విభజన తరువాత ఏపీకి ఒక సీనియర్ నేత సారధ్యం, కేంద్రం సహకారం అవసరమని భావించి ప్రజలు టిడిపి, బిజెపి కూటమికి పట్టం కట్టారు. కానీ ప్రజలు ఆశించిన రీతిలో అభివృద్ధి జరగకపోవడం లోపంగా మారింది.

చంద్రబాబునాయుడుపై వ్యతిరేకతతో ప్రజలు వైసిపికి పట్టం కట్టారు. అయితే కేవలం అయిదు నెలల్లోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏకపక్ష పోకడలతో వ్యతిరేకత తెచ్చుకున్నారు. పోలవరం రీటెండర్లు, రాజధాని పనులు నిలిపివేత, ప్రభుత్వ చర్యల కారణంగా పారిశ్రామికవేత్తలు వెనక్కివెళ్లడం, వరద నీటి నిర్వహణలో విఫలమవడం వంటి విషయాలపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని గుర్తించింది బీజేపీ.

ప్రాంతీయ పార్టీలైన టిడిపి, వైసిపిలపై వున్న వ్యతిరేకత జాతీయపార్టీ అయిన బిజెపికి అనుకూలించే అవకాశాలు కనిపిస్తున్నాయనే చెప్పాలి. ఆయా ప్రాంతాలను బట్టి ఒక్కో చోట ఒక్కో సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్టు బీజేపీ గుర్తించింది. పశ్చిమ కృష్ణాలో ప్రజలు సాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. సాగర్ ఆయకట్టు జోన్ 2లో వుండడం వల్ల నీరు సరిగా అందడం లేదు. సాగునీరు లేకపోవడం వల్ల రైతులు వర్షాధారంగా పెద్ద ఎత్తున సుబాబుల్ సాగు చేస్తున్నారు. కానీ దీనికి రేటు లేకపోవడం, కొనుగోళ్లు సరిగా జరగకపోవడం వల్ల రైతులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. 

టన్నుకు కనీస ధర రూ.4,200 వుండగా, కేవలం రెండు వేలకే కొంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డెల్టా ప్రాంతాలైన గుడివాడ, పామర్రు నియోజకవర్గాల ప్రజలు సరైన రోడ్లు లేక ఇబ్బందిపడుతున్నారు. గుడివాడ పట్టణం అయితే ఎలాంటి అభివృద్ధికీ నోచుకోలేదు.ప్రకాశం జిల్లా కూడా సాగర్ జోన్ 2లో వుండడం వల్ల నాలుగేళ్లుగా నీరందక ఇబ్బందిపడుతున్నారు. పశ్చిమ కృష్ణా లాగే ఇక్కడ కూడా సుబాబుల్ సాగు ఎక్కువ. దీన్ని కొనే నాధుడే లేడు. ఈ జిల్లాలో పేపర్ మిల్లు ఏర్పాటుకు గత ప్రభుత్వం ఇండోనేషియా కంపెనీతో ఎంవోయు కుదుర్చుకుంది. అయితే కొత్త ప్రభుత్వం వచ్చాక దీని జాడే లేదు. రామాయపట్నం పోర్టు ఈ జిల్లా ప్రజలకు సెంటిమెంటుగా మారింది. వెలుగొండ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలున్నా, చెరువులు పూర్తిగా నింపడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైంది. హంద్రీ నీవా కాలువలకు సకాలంలో నీటి విడుదల చేయకపోవడం, కాలువలను చెరువులకు అనుసంధానించడంలో నిర్లక్ష్యం వహించడం పట్ల ప్రజలు ఆగ్రహంతో వున్నారు.

గాలేరు నగరి ప్రాజెక్టును పూర్తిచేసి చిత్తూరు జిల్లాకు నీరివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అదే విధంగా టమోటా పంటకు గిట్టుబాటు ధరల్లేక ఒక్కోసారి పొలాల్లోనే వదిలేయాల్సి వస్తోందని, టమోటా నిల్వ చేసుకునే సౌకర్యాలు ఏర్పాటు చేయడంతో పాటు, టమోటా ఆధారిత ఉత్పత్తుల తయారీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.

పాదయాత్ర ద్వారా బీజేపీ నేతల దృష్టికి వచ్చిన వివిధ సమస్యలన్నింటిపై అధ్యయనం చేసి, వీటి పరిష్కారానికి బీజేపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వస్తే బీజేపీ పట్ల ప్రజల్లో సానుకూల దృక్పథం కనిపించవచ్చునని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

కేంద్రమంత్రులు, బీజేపీ కీలక నేతలు తరచూ గ్రామాల్లో పర్యటించడం, బీజేపీ పరిస్థితిని ఎప్పటికప్పుడు కేంద్ర నాయకత్వానికి తెలియచేయడం ద్వారా బీజేపీ బలమయిన పార్టీగా ఎదిగే అవకాశం కలుగుతుంది. ఏదో మొక్కుబడిగా వచ్చి వెళ్ళిపోతే మంచి అవకాశాన్ని చేజార్చుకున్నట్టు అవుతుంది. ఎన్నికలకు మరో నాలుగేళ్ళు అవకాశం ఉన్నా.. ఇప్పటినుంచే పకడ్బందీ ప్రణాళికతో ముందుకెళితే 2024 నాటికి బీజేపీ ఏపీ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించడం ఖాయం. 

హైకోర్టు మెట్లెక్కిన సీఎం జగన్.. వ్యక్తిగత మినహాయింపుకోసం అభ్యర్ధన

హైకోర్టు మెట్లెక్కిన సీఎం జగన్.. వ్యక్తిగత మినహాయింపుకోసం అభ్యర్ధన

   5 hours ago


శాసనమండలి రద్దుపై విపక్షాల ఆగ్రహం..ఎవరెవరు ఏమన్నారంటే..

శాసనమండలి రద్దుపై విపక్షాల ఆగ్రహం..ఎవరెవరు ఏమన్నారంటే..

   7 hours ago


రాజన్నరాజ్యం అంటే ఇదేనా..? జగన్ పై వంగవీటి రాధా ఫైర్

రాజన్నరాజ్యం అంటే ఇదేనా..? జగన్ పై వంగవీటి రాధా ఫైర్

   8 hours ago


హాజీపూర్ కేసులో తుది తీర్పు ఫిబ్రవరికి 6కి వాయిదా!

హాజీపూర్ కేసులో తుది తీర్పు ఫిబ్రవరికి 6కి వాయిదా!

   10 hours ago


కోమటిరెడ్డి రాజగోపాల్ అరెస్ట్...చౌటుప్పల్‌లో టెన్షన్ టెన్షన్

కోమటిరెడ్డి రాజగోపాల్ అరెస్ట్...చౌటుప్పల్‌లో టెన్షన్ టెన్షన్

   10 hours ago


లోకేష్ పై ఎమ్మెల్యే రోజా ఫైర్.. బలిసిన కోడి అంటూ చురకలు

లోకేష్ పై ఎమ్మెల్యే రోజా ఫైర్.. బలిసిన కోడి అంటూ చురకలు

   10 hours ago


శాసనమండలి రద్దుకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్

శాసనమండలి రద్దుకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్

   10 hours ago


ఎయిర్ ఇండియా కథ అంతేనా? కొనేది ఎవరో?

ఎయిర్ ఇండియా కథ అంతేనా? కొనేది ఎవరో?

   14 hours ago


కేబినెట్ భేటీపై ఉత్కంఠ.. మండలి రద్దేనా?

కేబినెట్ భేటీపై ఉత్కంఠ.. మండలి రద్దేనా?

   14 hours ago


జూప‌ల్లిపై జాలి చూపేదే లేదా..?

జూప‌ల్లిపై జాలి చూపేదే లేదా..?

   15 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle