newssting
BITING NEWS :
*శబరిమల వివాదంపై సుప్రీం తీర్పు.శబరిమల వివాదం విస్తృత ధర్మాసనానికి బదిలీ *రాఫెల్‌ డీల్‌ : కేంద్రానికి క్లీన్‌చిట్‌ .. రివ్యూ పిటిషన్లు కొట్టివేత *రాహుల్ గాంధీకి రిలీఫ్.. పరువునష్టం కేసుపై సుప్రీం తీర్పు *వైసీపీలో చేరనున్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్*ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ ఆఫీస్.. సుప్రీం మరో సంచలన తీర్పు*ఏపీ కొత్త సీఎస్‌గా నీలం సహాని...నిన్న రాత్రి ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కార్....ఇవాళ బాధ్యతలు స్వీకరించిన నీలం సహాని *ఇసుక కొరతపై చంద్రబాబు దీక్ష...12 గంటల పాటు దీక్షలో కూర్చున్న బాబు* ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ పర్యటన...మనబడి నాడు - నేడు కార్యక్రమానికి శ్రీకారం*విశాఖ: బ్లూ ఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీస్ సంస్థలో సీఐడీ సోదాలు.. మన శాండ్ ఆన్‌లైన్ ఇసుక సరఫరా వెబ్‌సైట్ హ్యాక్ చేసినట్టు అనుమానం*ఢిల్లీ: అయోధ్య ట్రస్ట్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు.. పార్లమెంట్‌లో అయోధ్య ట్రస్ట్ బిల్లు ప్రవేశపెట్టనున్న కేంద్రం*ఆర్టీసీ సమ్మెపై విచారణను ఈనెల 18కి వాయిదా వేసిన హైకోర్ట్*అమరావతి: పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోతున్నాయనడం కరెక్ట్ కాదు.. చంద్రబాబు, లోకేష్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు: మంత్రి బొత్స

గాంధీ సంకల్పయాత్రకు బీజేపీ శ్రీకారం

15-10-201915-10-2019 15:25:55 IST
Updated On 15-10-2019 15:23:39 ISTUpdated On 15-10-20192019-10-15T09:55:55.497Z15-10-2019 2019-10-15T09:52:20.150Z - 2019-10-15T09:53:39.866Z - 15-10-2019

 గాంధీ సంకల్పయాత్రకు బీజేపీ శ్రీకారం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో దూసుకుపోయేందుకు బీజేపీ సర్వప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటోంది. పనిలో పనిగా జాతీయతా వాద అంశాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్ళేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అమరావతి, పోలవరం అంశాలను జనంలోకి తీసుకుపోతోంది. మహాత్మాగాంధీ సిద్ధాంతాలకు మరింత ప్రచారం కల్పించేందుకు గాంధీజీ సంకల్పయాత్రకు శ్రీకారం చుట్టింది ఏపీ బీజేపీ. అందులో భాగంగా ఇవాళ కృష్ణాజిల్లా జగ్గయ్యపేట నుంచి పాదయాత్రను ప్రారంభించారు. గాంధీజీ సంకల్ప యాత్రలో భాగంగా జగ్గయ్యపేటలో జరిగిన పాదయాత్ర లో  ప్రజలు, బిజెపి శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నాయి. 

ఈసందర్భంగా రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి మాట్లాడారు. నకిలీ గాంధీ లు 60 ఏళ్ళు పాలించడం వల్ల దేశానికి నష్టం జరిగిందని, గాంధీ గారి నిజమైన వారసత్వానికి ప్రతీక గా బిజెపి పనిచేస్తోందన్నారు సుజనా చౌదరి. ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రతిష్టను గాంధీ గారిలా ప్రపంచానికి చాటారన్నారు. ఇక ప్రాంతీయ వాదాలకు కాలం చెల్లిందని, ఇప్పుడు ప్రజలు జాతీయ వాదం వైపు మొగ్గు చూపుతున్నారన్నారు.

Image may contain: 21 people, people smiling, crowd

మహాత్మాగాంధీజీ యావత్ ప్రపంచానికీ చూపిన అహింసాయుత మార్గం..దేశ ప్రజలకు దిశా నిర్దేశం చేసిన విలువలు.స్వాతంత్య్ర సాధనలో గాంధీజీ త్యాగాలు..భారతీయలకు దక్కిన స్వాతంత్య్ర ఫలాలు..ప్రపంచ వ్యాప్తంగా గాంధీజీ పొందిన కీర్తి..దేశ ప్రజలకు, నేటి తరం యువతకు చాటి చెప్పేందుకు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో రాష్ట్ర బీజేపీ నాయకులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో గాంధీ సంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టారు. 

ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ సారధ్యంలో బీజేపీనేతలు ఎంపీ టి.జి.వెంకటేష్, పార్థసారథి కర్నూలులో గాంధీ సంకల్ప యాత్రను నేడు ఘనంగా ప్రారంభించారు..కడప జిల్లాలో ఎంపీ సీఎం రమేష్ ఆధ్వర్యంలో గాంధీ సంకల్పయాత్ర ప్రారంభమయింది. కడప జిల్లా పోట్లదుర్తి నుంచీ ప్రారంభమైన గాంధీ సంకల్పయాత్ర ప్రొద్దుటూరు మీదుగా కొర్రపాడు వరకు సాగింది.

Image may contain: 11 people, people smiling, people standing and outdoor

గాంధీ సంకల్ప యాత్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ కార్యదర్శి,బీజేపీ ఆంధ్రప్రదేశ్ సహా ఇంఛార్జ్ శ్రీ సునీల్ దేవధర్ పాల్గొని గాంధీ గారి ఆదర్శాలను ప్రజలకు తెలియజేశారు. గాంధీ గారి ఆశయాలను,ఆదర్శ సూత్రాలను,ఆయన ఆచరించిన సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గాంధీ సంకల్పయాత్రలో పార్టీ శ్రేణులు,బీజేపీ స్థానిక నేతలు మరియు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle