newssting
BITING NEWS :
*శబరిమలలో మండల-మకరవిళక్కు పూజలు ప్రారంభం.. ఏపీ మహిళల్ని వెనక్కి పంపిన కేరళ పోలీసులు *ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో దూసుకుపోతున్న భారత్.. 300 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్న టీమ్ ఇండియా*ఆర్టీసీ జేఏసీ డిమాండ్లను పరిష్కరించలేమని ఆర్టీసీ యాజమాన్యం ...హైకోర్ట్ కు అఫిడవిట్ *రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ఇచ్ఛాపురం పర్యటన రద్దు *సోమవారం నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు *మధ్యాహ్నం 2గంటలకు బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీ..శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ *ఎంఎంటిఎస్ లోకోపైలట్ చంద్రశేఖర్ మృతి... కాచిగూడ రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన లోకో పైలట్*శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో భారీగా పోలింగ్‌..ఓటు హక్కు వినియోగించుకున్న 80 శాతం మంది ఓటర్లు

గవర్నర్ ముందు బీజేపీ ‘అమరావతి’ పంచాయితీ

12-09-201912-09-2019 08:27:48 IST
2019-09-12T02:57:48.266Z12-09-2019 2019-09-12T02:54:12.361Z - - 18-11-2019

గవర్నర్ ముందు బీజేపీ ‘అమరావతి’ పంచాయితీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ రాజకీయాలపై ఫోకస్ పెట్టిన బీజేపీ ప్రతి అంశాన్ని తనకు అనుకూలంగా మలచుకుంటోంది. ఒకవైపు టీడీపీ మరోవైపు వైసీపీ ఛలో ఆత్మకూరుకి పిలుపునిస్తే.. బీజేపీ మాత్రం రాష్ట్రంలో పాలన సరిగా లేదని. రాజధాని అంశంపై గందరగోళం ఏర్పడిందని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ని కలిసి వినతిపత్రం అందించారు.

బీజేపీ నేతలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్, జమ్ముల శ్యామ్ కిషోర్ ఆధ్వర్యంలో అమరావతి రాజధాని రైతుల బృందం సభ్యులు గవర్నర్ తో భేటీ అయ్యారు. ఈసందర్భంగా బీజేపీ నేతలు రాజధాని పట్ల రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని గవర్నర్ దృ‌ష్టికి తెచ్చారు. 

జగన్‌ సర్కార్‌కు పరిపాలనపై దృష్టి లేదని, కేవలం ప్రతిపక్షాలపై దాడి చేయడంపైనే ఎక్కువ దృష్టి ఉందని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ సుజనాచౌదరి విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు గాడి తప్పాయన్నారు.

పాలనపై వైసీపీ నేతలు దృష్టి పెట్టాలని కోరారు.  పోలవరంపై కిరణ్‌కుమార్‌రెడ్డి తీవ్ర నిర్లక్ష్యం వహించారని చెప్పారు. ఇక టీడీపీ హయాంలో కాలయాపన జరగడం వల్ల ట్రాక్ తప్పిందని చెప్పుకొచ్చారు.

ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కూడా ఏకపక్ష ధోరణితో వెళ్తోందన్నారు. కేంద్రం హెచ్చరిస్తున్నా.. పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రభుత్వ తీరు ఇలాగే కొనసాగితే కేంద్రం కచ్చితంగా జోక్యం చేసుకుంటుందన్నారు. జమిలి ఎన్నికలపై తనకు సమాచారం లేదన్నారు. జమిలి ఎన్నికలపై మాట్లాడే స్థాయి మాజీ సీఎం చంద్రబాబుకు లేదన్నారు. ఆయన కేవలం ఎమ్మెల్యే మాత్రమేనన్నారు.

మంత్రి బొత్స ప్రకటనతో అమరావతి ప్రాంతంలో రైతులు, ప్రజలు అయోమయంలో ఉన్నారన్నారు. ముఖ్యమంత్రి ప్రకటన కోసం రైతులు ఎదురు చూస్తున్నారని ఈ అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకువచ్చామన్నారు సుజనా చౌదరి.

పోలవరం ఆగిపోతే రాష్ట్రంలో వ్యవసాయం సంక్షోభంలో పడుతుంది. కృష్ణాలో నీటి లభ్యత తగ్గిన పరిస్థితుల్లో ఎపికి పోలవరమే దిక్కు. రివర్స్ టెండరింగ్ వద్దని పిపిఎ చేసిన సూచనను రాష్ట్రం బేఖాతరు చేస్తోంది. పోలవరం ఒక పంటకాలం ఆలస్యమైతే రైతులకు పది వేల కోట్ల నష్టం వస్తుందన్నారు ఎంపీ సుజనా చౌదరి. రాష్ట్ర విభజన అనంతరం రాజధాని అమరావతి కోసం సాగుభూములిచ్చిన రైతులకు న్యాయం చేయాలని,  రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను, వారి ఆందోళనను గవర్నర్ దృష్టికి తీసుకొచ్చామన్నారు సుజనా చౌదరి. 

జగన్‌ మాస్టర్‌ ప్లాన్‌ సక్సెస్‌..!  కమ్మ వర్సెస్‌ కమ్మ!!

జగన్‌ మాస్టర్‌ ప్లాన్‌ సక్సెస్‌..! కమ్మ వర్సెస్‌ కమ్మ!!

   38 minutes ago


అధికారుల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే..!

అధికారుల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే..!

   2 hours ago


ఆ 70 కోట్ల కోసమే బీజేపీ మాజీ ఎమ్మెల్యే వైసీపీలో చేరుతారా..?

ఆ 70 కోట్ల కోసమే బీజేపీ మాజీ ఎమ్మెల్యే వైసీపీలో చేరుతారా..?

   6 hours ago


దీక్ష భగ్నం.. ఆర్టీసీ జేఏసీ నేత అశ్వథ్ధామరెడ్డి అరెస్ట్

దీక్ష భగ్నం.. ఆర్టీసీ జేఏసీ నేత అశ్వథ్ధామరెడ్డి అరెస్ట్

   9 hours ago


కేంద్రానికి చేరిన టీటీడీలో అన్యమతస్తుల వ్యవహారం

కేంద్రానికి చేరిన టీటీడీలో అన్యమతస్తుల వ్యవహారం

   11 hours ago


కాంగ్రెస్‌కు - ఎన్నిక‌ల‌కు సంబంధం ఉన్న‌ట్టా..?  లేన‌ట్టా..?

కాంగ్రెస్‌కు - ఎన్నిక‌ల‌కు సంబంధం ఉన్న‌ట్టా..? లేన‌ట్టా..?

   13 hours ago


పంచాయతీ ఎన్నికలు జరిపి తీరాల్సిందే.. హైకోర్టు

పంచాయతీ ఎన్నికలు జరిపి తీరాల్సిందే.. హైకోర్టు

   13 hours ago


జగ‌న్ ఓకే అంటే ఇద్ద‌రూ వ‌చ్చేస్తారట‌..!

జగ‌న్ ఓకే అంటే ఇద్ద‌రూ వ‌చ్చేస్తారట‌..!

   14 hours ago


తెలంగాణ ఆర్టీసీ చేతులెత్తేసిందా?

తెలంగాణ ఆర్టీసీ చేతులెత్తేసిందా?

   15 hours ago


నేనొప్పుకోను.. అవినీతి జరిగిద్ది! మంత్రులకు షాకిచ్చిన జగన్‌!!

నేనొప్పుకోను.. అవినీతి జరిగిద్ది! మంత్రులకు షాకిచ్చిన జగన్‌!!

   16 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle