newssting
BITING NEWS :
*దిశ కేసులో నలుగురు నిందితులను షాద్ నగర్ లో ఎన్ కౌంటర్ చేసిన పోలీసులు*దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై స్పందించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ *దిశ ఘటన హెచ్చరిస్తోంది - పవన్ కళ్యాణ్ * నర పీడితులకు సరైన శిక్ష పడింది - మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ *దేశంలో ఒక భయంకరమైన సంఘటన జరిగింది, మీరు నిందితులను చంపకూడదు- ఎంపీ మేనకాగాంధీ * దిశకు తగిన న్యాయం జరిగింది - అక్కినేని నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, మంచు మనోజ్, నాని, పూరీజగన్నాధ్ * రూ.150కి చేరిన కిలో ఉల్లి ధర.. ఉల్లి కొనలేక ఇబ్బంది పడుతున్న ప్రజలు *దిశ ఘటన తర్వాత దేశం మొత్తం ఆగ్రహంతో ఉంది - కేజ్రీవాల్*కేంద్రీయ సైనిక్ బోర్డుకు కోటి రూపాయలు విరాళంగా ప్రకటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్*రేపిస్టులపై రాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.. రేపిస్టులపై దయ అవసరంలేదు.. నిందితులు క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకునే అవకాశమే ఉండకూడదన్న రాష్ట్రపతి *నిందితుల హత్యకేసుపై దిశ తల్లిదండ్రుల స్పందన.. మా బిడ్డకు తగిన న్యాయం జరిగిందని వ్యాఖ్య

గవర్నర్ ను కలిసిన చంద్రబాబు బృందం కోరిందేమిటంటే?

19-09-201919-09-2019 15:31:21 IST
Updated On 19-09-2019 15:43:15 ISTUpdated On 19-09-20192019-09-19T10:01:21.070Z19-09-2019 2019-09-19T09:59:35.362Z - 2019-09-19T10:13:15.364Z - 19-09-2019

గవర్నర్ ను కలిసిన చంద్రబాబు బృందం కోరిందేమిటంటే?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలుగుదేశం అధినేత, విపక్ష నేత నారా చంద్రబాబునాయుడి నేతృత్వంలో టీడీపీ బృందం ఏపీ గవర్నర్ హరిచందన్ ను కలిసింది.  ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ ఆత్మహత్యపై విచారణ జరిపించాలని వారు ఈ సందర్భంగా గవర్నర్ ను కోరారు. రాజకీయ వేధింపులే కోడెల ఆత్మహత్యకు కారణమని వారీ సందర్భంగా గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. వైకాపా అధికారం చేపట్టిన తరువాత ఈ మూడు నెలల పాలన అంతా అరాచకమేనని పేర్కొన్న బాబు బృందం కోడెలపై రాజకీయ వేధింపుల తీరును వివరించారు.

చిన్న చిన్న కారణాలకు సైతం పెద్ద పెద్ద కేసులు నమోదు చేయడం నుంచీ, అసెంబ్లీ ఫర్నీచర్ విషయంలో పెట్టిన కేసును ఇందుకు ఉదాహరణగా చూపారు. స్పీకర్ గా బాధ్యతలు చేపడుతూ..చేసిన ప్రతిజ్ణాభంగానికి పాల్పడ్డారనన్న కేసు పెట్టడాన్ని చంద్రబాబు ఈ సందర్భంగా ఎత్తి చూపారు. వైకాపా అధికారంలోనికి వచ్చినప్పటి నుంచీ తెలుగుదేశం శ్రేణులు, నాయకులే లక్ష్యంగా రాజకీయ, భౌతిక దాడులు జరుగుతున్నాయని బాబు బృందం గవర్నర్ కు ఫిర్యాదు చేసింది. ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశంపై కక్ష సాధింపు వినా పాలనా పరంగా చేసిందేమీ లేదని గవర్నర్ కు వివరించింది.

కోడెల శివప్రసాద్ ఆత్మహత్య సంఘటన అనంతరం వైకాపా నేతల వ్యాఖ్యలు, ఆరోపణలు, వాటికి తెలుగుదేశం స్పందన మొత్తంగా ఒక విషాద సమయంలో నేతలు సంయమనం పాటించలేదని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఒక నాయకుడి మరణాన్ని రాజకీయంగా లెక్కలు తేల్చుకునే వేదికగా మార్చుకోవడానికి జరిగిన ప్రయత్నం ఎంతైనా గర్హనీయమని చెప్పాలి. 

కోడెల అంత్యక్రియలు పూర్తయిన మరుసటి రోజే తెలుగుదేశం బృందం చంద్రబాబు నేతృత్వంలో గవర్నర్ ను కలిసి విచారణకు డిమాండ్ చేయడంతో ఈ ఆరోపణలు, ప్రత్యారోపణలు మరింత ఉధృతమౌతాయని పరిశీలకులు అంటున్నారు. ఇప్పటికే మాజీ స్పీకర్ మృతిపై దర్యాప్తు సాగుతున్నది కనుక ఈ విమర్శల పర్వానికి ఇరు పక్షాలూ కూడా ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ వేధింపుల తీవ్రత కారణంగానే కోడెల బలవన్మరణానికి పాల్పడ్డారని దర్యాప్తు నిష్పాక్షికంగా జరగేలా చూడాలని తెలుగుదేశం బృందం గవర్నర్ ను కొరింది.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle