newssting
Radio
BITING NEWS :
బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి దశలో 55.69 శాతం పోలింగ్‌ నమోదైనట్టు తెలిపిన ఎన్నికల కమిషన్‌. కరోనా వైరస్‌ భయాలు ఉన్నప్పటికీ పోలింగ్‌ మాత్రం ఇంతకు ముందుకన్నా ఎక్కువే నమోదైనట్టు తెలుస్తోంది. తొలి దశలో 16 జిల్లాల్లో విస్తరించిన 71 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగగా సంబంధిత నియోజకవర్గాల్లో గతంలోకంటే ఈసారి పోలింగ్ శాతం అధికంగా నమోదు * తమ పార్టీ తరఫున బరిలో నిలిచిన రాంజీ గౌతమ్‌ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న ఏడుగురు ఎమ్మెల్యేలను బీఎస్పీ అధినేత్రి మాయావతి గురువారం పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. కీలకమైన రాజ్యసభ ఎన్నికల సమయంలో ఎస్పీ తీర్థం పుచ్చుకోవడానికి వీరు ప్రయత్నిస్తున్నట్టు తెలియగానే ఆమె ఈ నిర్ణయం తీసుకొన్నారు * కార్మిక నాయకుడు, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ముఖ్య సహచరుడు ఎస్‌.బీ మోహన్‌రెడ్డి(78) గురువారం తెల్లవారుజామున మరణించారు. ఆరునెలల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న మోహన్‌ రెడ్డి ఆరోగ్యం విషమించగా ఆంధ్రమహిళా సభ దవాఖానలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందారు * జమ్ముకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలోని వైకే పొరా ప్రాంతంలో గురువారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులు జరిపి ముగ్గురు స్థానిక బీజేపీ నేతల ప్రాణాలు తీశారు. పాకిస్థాన్‌ ఇంటెలిజన్స్‌ ఏజెన్సీ మద్దతున్న రెసిస్టంట్‌ ఫ్రంట్‌ ఉగ్రవాద సంస్థ ఈ దాడికి బాధ్యతవహిస్తూ ప్రకటన చేసిందని పోలీసులు చెప్పారు * తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గోకవరం మండలం తంటికొండ వెంకటేశ్వర ఆలయం ఘాట్‌ రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున పెళ్లి బృందానికి చెందిన మినీ వ్యాన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు * డోసుల కొరత కారణంగా.. స్పుత్నిక్‌-వి టీకా మూడో దశ ట్రయల్స్‌ను రష్యా తాత్కాలికంగా నిలిపివేసింది. నవంబరు 10వ తేదీ నుంచి ట్రయల్స్‌ను పునరుద్ధరించనున్నారు. గమలేయా రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, రష్యన్‌ రక్షణ మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌-వి టీకాను రష్యా ఆగస్టు నెలలో నమోదు చేసింది * మద్యం ధరలను క్రమబద్ధీకరిస్తూ ఏపీ ప్రభుత్వం గురువారం ఆదేశాలు జారీ చేసింది. సవరించిన ధరలు ప్రీమియం, మీడియం బ్రాండ్లకు వర్తించేలా ఉత్తర్వులిచ్చింది. ఇవి శుక్రవారం నుంచి అమల్లోకి వస్తాయని ఆదేశాల్లో పేర్కొంది * మిలాద్‌ ఉన్‌ నబీ ఉత్సవాలు, ర్యాలీ సందర్భంగా పాతబస్తీలో పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు. ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.

గవర్నర్ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ ... ఏం జరగబోతోంది?

27-07-202027-07-2020 10:19:36 IST
Updated On 27-07-2020 10:37:03 ISTUpdated On 27-07-20202020-07-27T04:49:36.681Z27-07-2020 2020-07-27T04:49:17.257Z - 2020-07-27T05:07:03.784Z - 27-07-2020

గవర్నర్ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ ... ఏం జరగబోతోంది?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో రాజకీయాలు ఎప్పుడూ హాట్ హాట్ గానే వుంటాయి. ఏపీ రాజధాని విభజనకు సంబంధించిన బిల్లులపైన నేడు గవర్నర్ నిర్ణయం తీసుకోనున్నారు అనే వార్తలు వస్తున్నాయి. మూడురాజధానులు, ఏపీ సీఆర్డీయే రద్దు బిల్లులు ఎప్పుడో రాజ్ భవన్ కు చేరాయి. ఇప్పటికే గవర్నర్ న్యాయ సలహా అడిగారు. న్యాయ సలహా కూడా ప్రభుత్వ న్యాయ విభాగం నుంచి వచ్చిన నేపథ్యంలో ఇకపై గవర్నర్ నిర్ణయం తీసుకోబోతున్నారు అనే వార్తలు వస్తున్నాయి. 

అయితే ఆ నిర్ణయం ఎలా ఉండబోతోంది. గవర్నరే నిర్ణయాన్ని ప్రకటిస్తారా లేక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అభిప్రాయం తీసుకుంటారా అనే చర్చ జరుగుతోంది. ఏపీ, తెలంగాణ విడిపోయిన సందర్భంలో ఏపీకి ఒకటే రాజధాని ఉండాలని చట్టంలో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు మూడు రాజధానులుగా విభజన చేస్తున్నందున ఇది చట్టపరంగా ఇబ్బందులు ఉంటాయా అనే అంశంపై కేంద్ర అభిప్రాయాన్ని గవర్నర్ తీసుకునే అవకాశం ఉండవచ్చు. 

అలా తీసుకోవాలని చాలా మంది గవర్నర్‌ను కోరిన నేపథ్యంలో గవర్నర్ నిర్ణయం ఏ మేరకు ఉంటుంది అనేది ఆసక్తి రేపుతోంది.విపక్షాలు మాత్రం వీటిని ఆమోదించవద్దని గవర్నర్ బిబి హరిచందన్ ను కోరుతున్నాయి. గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఈ విషయంలో వివాదాలు రాకుండా ఉండేలా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఏపీ సర్కారుకు కోర్టుల్లో ఎదురుదెబ్బలు తగులుతోన్న నేపథ్యంలో దీనికి ఎనలేని ప్రాధాన్యత ఏర్పడింది.

వికేంద్రీకరణ బిల్లు.. ఏపీ పునర్విభజన చట్టం-2014తో ముడిపడి ఉంది. దీంతో ఈ విషయంలో ఎలా ముందుకు వెళితే బాగుంటుందనే అంశంపై గవర్నర్ న్యాయసలహాలు తీసుకుంటున్నారు. గురువారం, శుక్రవారాల్లో పలువురు న్యాయకోవిదులు, సీనియర్ న్యాయవాదుల అభిప్రాయాలను రాజ్ భవన్ అధికారులు అడిగి తెలుసుకున్నట్లు వెల్లడైంది. సంప్రదింపుల అనంతరం రెండు రోజుల్లో బిల్లులపై గవర్నర్ తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. శాసనమండలి సెలెక్ట్ కమిటీకి వెళ్లాల్సిన బిల్లులపై ఎలాంటి నిర్ణయం తీసుకోరాదని ప్రతిపక్షం టీడీపీ వాదిస్తోంది. 

మూడురాజధానుల బిల్లులు, సీఆర్డీయే రద్దుబిల్లులు రాజ్ భవన్ కు పంపారు. ఈ బిల్లులు మరోసారి న్యాయశాఖ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీఎంవో పరిశీలన అనంతరం తిరిగి గవర్నర్ చెంతకే చేరాయి. ఈలోపే ఈ బిల్లులపై ప్రధానమంత్రి కార్యాలయం ఆరా తీయడంతో, తర్వాత ఏం జరగబోతోందనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు, రాష్ట ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పునర్నియామకం విషయంలో గవర్నర్,కోర్టుల ఆదేశాలను పట్టించుకోకపోవడంపై జగన్ సర్కారకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బలు తగిలాయి. ఈ నేపథ్యంలో గవర్నర్ నిర్ణయం ఎలా వుంటుందనేది అటు ప్రతిపక్షం, ఇటు అధికారపక్షాన్ని టెన్షన్ పెడుతోంది. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle