newssting
BITING NEWS :
* గోదావరిలో పర్యాటక బోటు మునక పలువురు గల్లంతు. *వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రజలకెన్నో ఇబ్బందులు.. ఇక పోరాటమే:పవన్ కళ్యాణ్ *.హైదరాబాద్ చేరుకున్న సత్య నాదెళ్ళ ...తండ్రి మాజీ ఐఏఎస్ అధికారి బీఎన్ యుగంధర్ అంత్యక్రియలు *బద్వేలులో భారీ అగ్నిప్రమాదం *హుజూర్‌నగర్‌ అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్‌ ...కాంగ్రెస్‌ అభ్యర్థిగా పద్మావతి *మిగులు రాష్ట్రాన్ని దివాలా తీయించారు ..కేసీఆర్ పై భట్టి విమర్శలు *నేడు భారత్‌–దక్షిణాఫ్రికా తొలి టి20

గవర్నర్‌కి చేరిన వరద పంచాయితీ

19-08-201919-08-2019 16:47:06 IST
2019-08-19T11:17:06.998Z19-08-2019 2019-08-19T11:17:04.999Z - - 15-09-2019

 గవర్నర్‌కి చేరిన వరద పంచాయితీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో వరద రాజకీయం రసవత్తరంగా మారుతోంది.  వరద సహాయక చర్యల్లో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టారు టీడీపీ నేతలు. ఏపీ గవర్నర్‌ హరిచందన్‌ను కలిశారు టీడీపీ నేతలు. జూలై 25 తరువాత, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలు, ఏపి రాష్ట్రాన్ని కృష్ణా వరదలు వస్తాయి, చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాయి. మరి జగన్ ప్రభుత్వం ఏమి చేసిందని వారు ప్రశ్నించారు.

వరద నిర్వహణ చేతకాకో, చంద్రబాబు ఇంటిని ముంచాలన్న వైసీపీ ప్రభుత్వ కుట్ర మూలంగానో కృష్ణానది వరదలు పేదల ఇళ్ళను చుట్టుముట్టి వందలమందిని నిరాశ్రయులను చేశాయి. కట్టుబట్టలతో బయటపడిన బాధితులు తిండి, తాగునీరు లేక అల్లాడుతున్నారు. ఈ సమయంలో ఆదుకోవాల్సిన ముఖ్యమంత్రి అమెరికాలో షికార్లు చేస్తూ తన పార్టీకి వచ్చిన సీట్ల గురించి గొప్పలు చెప్పుకుంటూ, ఆనంద ఆంధ్రప్రదేశ్ నా కల అంటూ ఉపన్యాసాలు దంచేస్తున్నారు. ఇక్కడేమో ప్రభుత్వం నిద్రపోతోందని టీడీపీ మండిపడింది. 

గోదావరి కృష్ణా నదుల వరదల వల్ల రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఏపీ ప్రభుత్వానికి, ప్రభుత్వ అధినేతకు పిచ్చి పట్టిందని మాజీమంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు.  చంద్రబాబు నివాసాన్ని,చంద్రబాబును ఇబ్బంది పెట్టాలని ఫ్లడ్ మానేజ‌్‌మెంట్ చేశారని విమర్శించారు.

నిజానికి ఏపీలో అంతగా వర్షాలు పడలేదని, పైనుంచి వచ్చిన వరదను కంట్రోల్ చేయలేకపోయారని టీడీపీ నేతలు గవర్నర్ కి వివరించారు. గోదావరికి వరద వచ్చినప్పుడు జెరూసలేం,కృష్ణా నదికి వరద వచ్చినప్పుడు సీఎం అమెరికా విహారాయాత్రలకు వెళ్లారని ఎద్దేవా చేశారు. ప్రకాశం బ్యారేజీలో 40టీఎంసీ నీటిని నిల్వ చేసుకోవచ్చని మంత్రి చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 

వరద తీవ్రత అంచనాలో, ముందస్తు సహాయక చర్యల విషయంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యింది. వైసీపీ నేతల అవగాహనా రాహిత్యం స్పష్టంగా తెలుస్తోంది. - నారా చంద్రబాబు నాయుడు

రాష్ట్రంలో ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను వినియోగించుకుంటే నీటిని నిల్వ చేసుకోవడానికి అవకాశం ఉండేదన్నారు. వరదలు వచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే చంద్రబాబు నివాసం చుట్టు మంత్రులు చక్కర్లు కొడుతున్నారని విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో శాడిస్ట్ విధానాలను ప్రభుత్వం అవలంబిస్తుందని మండిపడ్డారు మరో టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి.

పోలవరానికి వరదలు వచ్చినప్పుడు ఎక్కడా ప్రజలు ఇబ్బందులు పడలేదన్నారు. చంద్రబాబు నివాసంలోకి నీళ్లు రావాలని నీటిని నిలిపి దిగువకు విడుదల చేసారని ఆరోపించారు. వరదలపై ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కనీసం రివ్యూ చెయ్యలేదని, ఏపీలో ప్రభుత్వం ఉందా అని టీడీపీనేతలు విమర్శించారు. 

 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle