newssting
BITING NEWS :
*టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నేడు విజయనగరం జిల్లాలో పర్యటన* క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌తో సినీ నిర్మాతల భేటి...హాజ‌రైన దగ్గుపాటి సురేష్, శ్యాంప్రసాద్ రెడ్డి, నల్లమలుపు బుజ్జి *నేడు 72వ రోజు రాజధాని ప్రాంత రైతుల ఆందోళన *వాళ కర్నూలులో సీఎం జగన్ పర్యటన...ఎమ్మెల్మే శ్రీదేవి కుమారుడి విహహానికి హాజరు కానున్న జగన్*నేడు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలవనున్న కాంగ్రెస్ నేతలు..ఢిల్లీలో అల్లర్లపై రాష్ట్రపతికి ఫిర్యాదు *నేడు రాజధానికి సంబంధించిన పిటిషన్లపై హైకోర్టులో విచారణ..హైకోర్టులో వాదనలను వినిపించనున్న ప్రభుత్వ తరపు న్యాయవాది *ఇవాళ గుంటూరు జైలు నుంచి రాజధాని రైతుల విడుదల *రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 24 మంది మృతి *మహిళల టీ-20 ప్రపంచకప్...నేడు భారత్ - న్యూజిలాండ్ మ్యాచ్

గన్న‘వరం‘ లోకేష్ కల నెరవేరుస్తుందా?

02-11-201902-11-2019 11:32:04 IST
Updated On 02-11-2019 17:08:49 ISTUpdated On 02-11-20192019-11-02T06:02:04.893Z02-11-2019 2019-11-02T06:01:55.905Z - 2019-11-02T11:38:49.627Z - 02-11-2019

గన్న‘వరం‘ లోకేష్ కల నెరవేరుస్తుందా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాలు రోజు రోజుకు ఓ రేంజ్‌లో వేడెక్కుతున్నాయి. ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ  దీపావ‌ళి నాడు త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి, టీడీపీ స‌భ్య‌త్వానికి రాజీనామా చేస్తున్న‌ట్టు ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. అయితే ఆయ‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి ఎప్పుడు రాజీనామా చేస్తార‌న్న‌దానిపై ఇంకా క్లారిటీ లేదు. ప్ర‌క‌ట‌న చేసిన త‌రువాత నుంచి ఆయ‌న అండ‌ర్ గ్రౌండ్‌లోకి వెళ్లిపోయారు. ఆ త‌రువాత వ‌ల్ల‌భ‌నేని వంశీ నుంచి ఎటువంటి పొలిటిక‌ల్ కామెంట్స్ విన‌ప‌డ‌లేదు.

వాట్సాప్‌లో రాజీనామాకు కార‌ణాలు చెప్పారు. కానీ, ఆయ‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి ఇంకా రాజీనామా చేయ‌లేదు. కానీ, ఆయ‌న రాజీనామాపై, గ‌న్న‌వ‌రం ఉప ఎన్నిక‌పై రాజ‌కీయంగా ఊహాగానాలు  మొద‌ల‌య్యాయి.

గ‌న్న‌వ‌రం టీడీపీ సిట్టింగ్ సీటు. మొన్న‌టి ఎన్నిక‌ల్లో వంశీ కేవ‌లం 838 ఓట్ల తేడాతో వైసీపీ అభ్య‌ర్ధి యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావుపై గెలిచారు. వైసీపీ నుంచి పోటీచేసిన యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావుకు ల‌క్షా 3వేల 43 ఓట్లు వచ్చాయి. వంశీకి ల‌క్షా 3వేల 881 ఓట్లు ప‌డ్డాయి. ఇక్క‌డ జ‌న‌సేన పోటీ చేయ‌లేదు. పొత్తులో భాగంగా పోటీ చేసిన సీపీఐకు 6675 ఓట్లు పోల‌య్యాయి.

ఒక‌వేళ వ‌ల్ల‌భ‌నేని వంశీ రాజీనామా చేస్తే ఏం జ‌రుగుతుంది అన్న‌దానిపై ప‌లు ర‌కాల ఊహాగానాలు బెజ‌వాడ రాజ‌కీయ వీధిలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. వంశీ రాజీనామా చేసి ఏ పార్టీలోకి వెళ‌తారు అన్న‌దానిపై ఇంకా క్లారిటీ లేదు. ఒక‌రోజు ఆయ‌న బీజేపీ నేత సుజ‌నా చౌద‌రిని కలిశారు. ఆ వెంట‌నే ఏపీ సీఎం జ‌గ‌న్‌ను క‌లిశారు. దీంతో ఆయ‌న వైసీపీలోకి వెళ‌తారా..?  లేక బీజేపీలోకి వెళ‌తారా..? అన్న‌ది క్లారిటీ లేదు. ఆయ‌న ఏ పార్టీలోకి వెళ‌తార‌న్న విష‌యంపై కార్య‌క‌ర్త‌ల‌కు కూడా తెలీదు.

గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం తెలుగుదేశానికి కంచుకోట‌. మొద‌ట్లో క‌మ్యునిస్టులకు ఈ స్థానంపై ఆధిప‌త్యం ఉండేది. క్ర‌మంగా వారు ప్రాభ‌వాన్ని కోల్పోయారు. 2009, 2014 స‌హా మొన్న‌టి ఎన్నిక‌ల్లో టీడీపీ హ్యాట్రిక్ విజ‌యాన్ని న‌మోదు చేసింది. 2009లో దాస‌రి బాల‌వ‌ర్ధ‌న్‌రావు ఇక్క‌డి నుంచే గెలిచారు.

2014, 2019 ఎన్నిక‌ల్లో వంశీ విజ‌యం సాధించారు. ప్ర‌స్తుతం దాస‌రి బాల‌వ‌ర్ధ‌న్‌రావు టీడీపీలో లేరు.. ఆయ‌న వైసీపీలో ఉన్నారు. ఒక‌వేశ వంశీ ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేస్తే గ‌న్న‌వ‌రంకు ఉప ఎన్నిక వ‌స్తే టీడీపీకి బ‌ల‌మైన సామాజిక‌వ‌ర్గం ఓటు బ్యాంకు ఉన్న గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గ ఉప ఎన్నిక‌లో నారా లోకేష్ పోటీ చేస్తార‌నే ప్ర‌చారం ఒకటి న‌డుస్తుంది.

మాజీ మంత్రి దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర‌రావుకు కూడా ఉప ఎన్నిక టికెట్ ఇవ్వొచ్చ‌ని అంటున్నారు. ఉప ఎన్నిక‌లో వంశీ ఏ పార్టీ త‌రుపున బ‌రిలోకి దిగుతారా..? లేదా..? అన్న‌ది స‌స్పెన్స్.

వైసీపీ ఇన్‌చార్జ్‌గా యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావుకు ఏం చేస్తార‌న్న‌ది ఇంకో ఆస‌క్తిక‌ర అంశం. వైసీపీ టికెట్ ఇవ్వ‌క‌పోతే యార్ల‌గ‌డ్డ టీడీపీ నుంచి పోటీ చేస్తారు అన్న ఊహాగానాలూ మ‌రోవైపు నుంచి మొద‌ల‌య్యాయి. మొత్తానికి వంశీ రాజీనామా చేయ‌లేదు. ఉప ఎన్నికా రాలేదు. కానీ, పార్టీ అభ్య‌ర్ధుల విష‌యం చ‌ర్చించే వ‌ర‌కు వెళ్లింది. అయితే అగ్గి రాజేసి సైలెంట్ అయిన వంశీ  రాబోయే రోజుల్లో ఏం చేయ‌బోతున్నారు అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. 

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle