గంటా... సెంటిమెంట్ కొనసాగుతుందా..?
25-03-201925-03-2019 08:16:43 IST
Updated On 25-03-2019 13:27:11 ISTUpdated On 25-03-20192019-03-25T02:46:43.644Z25-03-2019 2019-03-25T02:46:39.884Z - 2019-03-25T07:57:11.210Z - 25-03-2019

రాజకీయాల్లో ప్రజాబలంతో పాటు అదృష్టం కూడా కలిసిరావాలి. అదృష్టం కలిసి వస్తేనే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ నేతల్లో మోస్ట్ లక్కీ ఫెలో అని ఏ నాయకుడినైనా చెప్పుకోవాలి అంటే ముందుగా గుర్తొచ్చే పేరు మంత్రి గంటా శ్రీనివాసరావు. నిజంగా, ఆయన రాజకీయాల్లో అదృష్టవంతులు. రెండు వేర్వేరు పార్టీలు ఏర్పాటు చేసిన ప్రభుత్వాల్లో వరుసగా రెండుసార్లు మంత్రి పదవి దక్కించుకోవడమే ఇందుకు మొదటి ఉదాహరణ. ఇక, ప్రతీ ఎన్నికకు నియోజకవర్గాన్ని మార్చుకుని గెలవడం మరో ఉదాహరణ. 1999లో తెలుగుదేశం తరపున అనకాపల్లి పార్లమెంటుకు ఎన్నికైన గంటా.. 2004లో చోడవరం నుంచి అసెంబ్లీకి పోటీ చేసి గెలిచారు. 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి అనకాపల్లి అసెంబ్లీకి విజయం సాధించారు. చిరంజీవికి అత్యంత సన్నిహితులుగా ముద్రపడ్డ ఆయన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశాక మంత్రి పదవి దక్కించుకున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో మంత్రిగా పనిచేసిన ఆయన రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్‌ను వీడి టీడీపీలో చేరారు. అప్పుడు భీమిలీ అసెంబ్లీ టిక్కెట్ తెచ్చుకున్న ఆయన 37 వేల ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. చంద్రబాబుతో తనకున్న పరిచయం, ఆయన రాజకీయ చాణక్యంతో బాబు క్యాబినెట్ లోనూ మంత్రి పదవి దక్కించుకున్నారు. ఈ ఎన్నికల్లో అందరూ ఊహించినట్లుగానే ఆయన నియోజకవర్గం మార్చుకున్నారు. కాకతాళీయమో, రాజకీయ పరిస్థితుల కారణమో కానీ ఆయన విశాఖపట్నం ఉత్తరం స్థానం నుంచి బరిలో ఉన్నారు. ఇక్కడ ఇతర నాయకులు టీడీపీ టిక్కెట్‌పై అనేక ఆశలు పెట్టుకున్నా చివరకు గంటాకు టిక్కెట్ దక్కింది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి పొత్తుల్లో భాగంగా బీజేపీ తరపున బరిలో ఉన్న విష్ణుకుమార్ రాజు 18 వేల మెజారిటీతో గెలిచారు. ఇప్పుడు మళ్లీ ఆయన బరిలో ఉన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి కొత్త అభ్యర్థి కేకే రాజు పోటీ చేస్తున్నారు. జనసేన నుంచి పసుపులేటి ఉషాకిరణ్‌కు టిక్కెట్ దక్కింది. సిట్టింగ్ ఎమ్మెల్యే లేకపోవడం, పార్టీ నేతల మధ్య సమన్వయం కుదరకపోవడంతో కొంతకాలం క్రితం వరకు ఈ నియోజకవర్గంలో టీడీపీ స్తబ్ధుగా ఉండేది. టిక్కెట్ దక్కించుకున్న గంటా అసంతృప్తులను బుజ్జగించడంలో సఫలమయ్యారు. టిక్కెట్ ఆశించిన వారంతా గంటాకు మద్దతుగా పనిచేస్తున్నారు. మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా నివసించే ఈ నియోజకవర్గంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు వైసీపీ, బీజేపీ, జనసేన మధ్య చీలిపోనుండటం టీడీపీకి కలిసొచ్చే అంశం. ఉత్తర భారతీయులు అధికంగా ఉండటం, సిట్టింగ్ ఎమ్మెల్యే కావడం బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్ రాజుకు కలిసి వచ్చే అవకాశం ఉంది. వైసీపీ తరపున కొత్త అభ్యర్థి అయినా గట్టి పొటీదారుగా ఉండనున్నారు. అన్నివర్గాలను ప్రసన్నం చేసుకునే పనిలో ఆయన ఉన్నారు. ఇక, జనసేన కూడా ఇక్కడ బలంగా ఉంది. 2009లో ప్రజారాజ్యం పార్టీ ఇక్కడ రెండో స్థానంలో నిలిచి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యింది. మొత్తానికి నాలుగు పార్టీలో మధ్య పోరు హోరాహోరీగా ఉన్న విశాఖ ఉత్తరంలో చతుర్మఖ పోరు టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావుకు కలిసొచ్చే అవకాశం ఉంది. నియోజకవర్గం మారినప్పుడల్లా గెలిచిన ఆయన సెంటిమెంట్ ఎలా కొనసాగిస్తారో చూడాలి.

రాజధాని అమరావతిలోనే.. జగన్ క్లారిటీ
14-12-2019

దిశ తండ్రి బదిలీ.. కేసీయార్‌కి థ్యాంక్స్
14-12-2019

పెద్దల సభకు కవిత... వినోద్‌కు మొండిచెయ్యేనా?
14-12-2019

జగన్ సర్కార్ నిర్ణయంపై ప్రశంసలు
14-12-2019

జగన్ ప్రకటనతో ఇరుకునపడ్డ కేసీఆర్
14-12-2019

తొలిసారి జగన్‌కు చంద్రబాబు సపోర్ట్..దిశ బిల్లుకు సభ ఆమోదం
13-12-2019

క్షమాపణలు చెప్పను.. మోడీ కూడా అదేమాటన్నారు!
13-12-2019

ఈ రంగులేంటి? వైసీపీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం
13-12-2019

విమర్శలను ఎదుర్కొనే దమ్ములేదా?
13-12-2019

చంద్రబాబుపై చర్యలకు అసెంబ్లీలో తీర్మానం
13-12-2019
ఇంకా