newssting
BITING NEWS :
బాబ్రీ మసీదును నేలమట్టం చేసిన కేసులో నేడు వెలువడనున్న తీర్పు. దాదాపు 28 సంవత్సరాల సుదీర్ఘ విచారణ అనంతరం తీర్పును ప్రకటించనున్న సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి ఎస్‌కే యాదవ్‌. ఈ కేసులో నిందితులుగా ఉన్న బీజేపీ సీనియర్‌ నేతలు ఎల్‌కే ఆడ్వాణీ, మురళీ మనోహర్‌ జోషి, ఉమాభారతి, కల్యాణ్‌ సింగ్‌, విశ్వహిందూ పరిషత్‌ నేతలు విష్ణుహరి దాల్మియా, గిరిరాజ్‌ కిశోర్‌, వినయ్‌ కటియార్‌, సాధ్వి రితంబర తదితరులు. వీరిలో అశోక్‌ సింఘాల్‌, విష్ణుహరి దాల్మియా, గిరిరాజ్‌ కిశోర్‌ మరణించగా కరోనాతో చికిత్స పొందుతున్న ఉమా భారతి, కల్యాణ్‌ సింగ్. మిగిలిన వారిలో కొందరు నేడు కోర్టుకు హాజరయ్యే అవకాశం * పాకిస్థాన్ దేశంలోని మర్దాన్ నగరంలో జరిగిన పేలుడు. ఈ ప్రమాదంలో నలుగురు మరణించగా, మరో 12 మంది తీవ్రంగా గాయాలు. గ్యాస్ వల్ల మర్దాన్ నగరంలోని జడ్జి బజార్ ప్రాంతంలో పేలుడు సంభవించిందని చెప్పిన పాక్ పోలీసులు. ఈ పేలుడులో ఓ బాలుడితోపాటు మొత్తం నలుగురు మృతి. గాయపడిన 12 మందిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్న పోలీసులు * ఒడిశాలో కరోనా వీర విజృంభణ. కరోనా బారిన పడ్డ ఒడిశాలోని ప్రఖ్యాత పూరీ జగన్నాథ ఆలయంలో నాలుగు వందల మంది. అందులో 351 మంది సేవకులు, 53 మంది సిబ్బందికి వైరస్‌. వీరిలో ఇప్పటికే 9 మంది మృతి. మరోవైపు ఒడిశా స్పీకర్‌ రజనీకాంత్‌ సింగ్‌ తో సహా మరో 11 మంది ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ * బిహార్ ఎన్నికల్లో పోటీకి బీఎస్పీతో కలిసి ఆర్ఎల్ఎస్‌పీ ప్రత్యేక ఫ్రంట్. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మాయావతి బహుజనసమాజ్ పార్టీ, జనతాంత్రిక్ పార్టీతో కలిసి తాము ప్రత్యేక ఫ్రంట్ గా పోటీ చేస్తామని రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వా ప్రకటన. మొత్తం 243 అసెంబ్లీ స్థానాల్లోనూ పోటీ చేస్తుందని ప్రకటించిన ఉపేంద్ర * శీతాకాలంలో కరోనా వ్యాప్తి తీవ్రమయ్యే అవకాశం ఉందని కేంద్ర నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వినోద్ పాల్ హెచ్చరిక. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్రఆరోగ్యమంత్రిత్వ శాఖ, నిపుణుల బృందం హెచ్చరిక. రాబోయే రెండు మూడు నెలలు ప్రజలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్కులు ధరించడంతోపాటు సామాజిక దూరాన్ని కొనసాగించాలని డాక్టర్ పాల్ సూచన * హత్రాస్ గ్యాంగ్ రేప్ బాధితురాలి మృతదేహాన్ని ఉత్తరప్రదేశ్ పోలీసులు బుధవారం తెల్లవారుజామున బలవంతంగా దహనం చేసినట్లుగా ఆరోపిస్తున్న బాధితురాలు కుటుంబ సభ్యులు. మృతురాలి కుటుంబసభ్యులు నిరసన వ్యక్తం చేసినప్పటికీ మృతదేహాన్ని పోలీసులే బలవంతంగా దహనం చేశారని ఆరోపణ. ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌ జిల్లాలో నలుగురు మృగాలు యువతిపై అత్యాచారం చేసి నాలుక కోసి, గొంతు నులిమిన ఘటనతో కన్నుమూసిన 19ఏళ్ల యువతి * సూర్యాపేట‌ జిల్లాలోని కోదాడ‌లో అదుపుత‌ప్పి ఇంట్లోకి దూసెకెళ్లిన లీలాద‌రి ట్రావెల్స్ ప్రైవేటు బ‌స్సు. రాజ‌స్థాన్ నుంచి విశాఖ‌ప‌ట్నం ప్రయాణిస్తుండగా బుధవారం తెల్ల‌వారుజామున సూర్యాపేటలో అదుపుత‌ప్పి డివైడ‌ర్‌ను ఢీకొట్టిన బస్సు. రోడ్డు వెంబ‌డి ఉన్న రెండు విద్యుత్ స్తంభాల మ‌ధ్య‌లోనుంచి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు. ప్ర‌మాద సమ‌యంలో బ‌స్సులో 36 మంది ప్ర‌యాణికులు ఉండగా నలుగురికి గాయాలు * దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ వెలువడటంతో రాష్ట్రంలో మొదలైన పొలిటికల్‌ ఫీవర్‌. నియోజకవర్గంపై దృష్టి సారించనున్న అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతితో అనివార్యమైన ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్, బీజేపీలకు కీలకం కానున్న గెలుపు * 288వ రోజుకు చేరుకున్న రాజధాని రైతుల నిరసనలు. అమరావతి గ్రామాల్లోని శిబిరాల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళనలు. రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేసిన రాజధాని రైతులు. కరోనా సూచనలు పాటిస్తూ కొనసాగుతున్న అమరావతి ఉద్యమం *

గంటా ఎంట్రీకి ముహూర్తం ఖరారు.. ఆగస్టు 16 ఫైనల్ !

04-08-202004-08-2020 15:11:37 IST
Updated On 04-08-2020 16:14:44 ISTUpdated On 04-08-20202020-08-04T09:41:37.718Z04-08-2020 2020-08-04T09:41:18.034Z - 2020-08-04T10:44:44.657Z - 04-08-2020

గంటా ఎంట్రీకి ముహూర్తం ఖరారు.. ఆగస్టు 16 ఫైనల్ !
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పార్టీ మారడం ఖాయం అయింది. ఆయన పార్టీ మార్పుపై క్లారిటీ వచ్చింది. వైసీపీలో చేరికకు రంగం సిద్ధం చేసుకున్నారు.ఇప్పటికే ఆయన చేరికపై విస్తృత ప్రచారం జరుగుతున్నా.. తేదీపై స్పష్టత లేదు. ముందుగా ఆగస్ట్ 15 అన్నారు. ఆ తర్వాత 9న అన్న ప్రచారం కూడా జరిగింది. అయితే వీటన్నిటిని పక్కన పెట్టి 16వ తేదీని ఫిక్స్ చేశారు. 

అదే రోజు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో గంటాతో పాటు పలువురు టీడీపీ మాజీ నేతలు వైసీపీలో చేరబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి వైసీపీ మద్దతుదారుడిగా గంటా కొనసాగుతారు. ఆయన వర్గానికి చెందిన నేతలు మాత్రం వైసీపీ కండువాలు కప్పుకుంటారని వార్తలు వెలువడుతున్నాయి. ఇప్పటికే టీడీపీకి చెందిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, కరణం బలరాం బాటలోనే గంటా కూడా వ్యవహరించనున్నారు. వీళ్ళు ముగ్గురూ అనుచరులతో పార్టీలో చేరినా వైసీపీ మద్దతుదారులుగా వున్నారు. వీరికి వేరే సీట్లు కేటాయించారు. వారిలాగే గంటా కూడా కొంతకాలం వుంటారని భావిస్తున్నారు. 

ఉత్త‌రాంధ్ర పార్టీ వ్య‌వ‌హారాలు మొత్తం విజ‌య‌సాయిరెడ్డి క‌నుస‌న్న‌ల్లో జ‌రుగుతున్నాయి. ఉత్త‌రాంధ్ర జిల్లాల‌కు సంబంధించి సాయిరెడ్డి చెప్పిందే వైసీపీలో ఫైన‌ల్ అన్న‌ట్లుగా ప‌రిస్థితి ఉంది. అయితే, విజయసాయికి తెలియకుండా గంటాను పార్టీలోకి తీసుకుంటారని ప్రచారం సాగింది. విజయసాయి కరోనా పాజిటివ్ తో ఆస్పత్రిలో చేరిన వేళ ఈ వ్యవహారం మరింత రంజుగా మారింది.

కానీ అలా జరగలేదు. విశాఖ‌ప‌ట్నానికి సంబంధించిన ఓ కీల‌క రాజ‌కీయ మ‌లుపులో విజ‌య‌సాయిరెడ్డి ఇష్టానికి విరుద్ధంగా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ నిర్ణ‌యం తీసుకుంటారనే చ‌ర్చ జ‌రిగింది. తెలుగుదేశం పార్టీకి చెందిన విశాఖ‌ప‌ట్నం ఉత్త‌రం ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేర‌బోతున్నార‌ని తెలుస్తోంది. నిజానికి ఆయ‌న గ‌త ఎన్నిక‌ల ముందే రాష్ట్రంలో వైసీపీ వేవ్ న‌డుస్తుంద‌ని ప‌సిగ‌ట్టారు. ఎన్నిక‌ల ముందే టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరాల‌ని భావించారు. ఇందుకు సంబంధించిన చ‌ర్చ‌లు కూడా ముగిశాయి.టీడీపీ పెద్ద‌లు బుజ్జ‌గించ‌డం వ‌ల్ల చివ‌ర‌కు ఆయ‌న ఆ పార్టీలోనే కొన‌సాగారు.

టీడీపీకి 23 సీట్లు రావడంతో మళ్ళీ గంటా గాలి వైసీపీ వైపు మళ్లింది. కానీ గంటా రాకను జిల్లాలోని వైసీపీ నేతలు వ్యతిరేకించారు. దీంతో పార్టీ నేతలు వెనక్కి తగ్గారు.  భీమిలి నుంచి విశాఖ ఉత్త‌ర నియోజ‌క‌వ‌ర్గానికి మారి విజ‌యం సాధించారు.

కానీ, పార్టీ ఓడిపోవ‌డంతో ఆయ‌న ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చిన నాటి నుంచే సైలెంట్‌గా మారిపోయారు. పార్టీ వ్య‌వ‌హారాల‌కు పూర్తిగా దూర‌మ‌య్యారు. వైసీపీ ప్ర‌భుత్వంపై ఎటువంటి విమ‌ర్శ‌లు చేయ‌డం లేదు. పైగా విశాఖ‌ప‌ట్నాన్ని పాల‌నా రాజ‌ధాని చేయాల‌ని ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని టీడీపీ స్టాండ్‌కు వ్య‌తిరేకంగా స‌మ‌ర్థించారు. తాజాగా పాలనా రాజధానిగా విశాఖ ఫిక్స్ అయింది. గవర్నర్ కూడా రాజముద్ర వేయడంతో గంటా వైసీపీలోకి రావడానికి గట్టి ప్రయత్నాలు చేశారు. 

ఏపీలో మ‌త మార్పిళ్ల‌పై క‌న్నేసిన కేంద్రం... నిజ‌మేనా?

ఏపీలో మ‌త మార్పిళ్ల‌పై క‌న్నేసిన కేంద్రం... నిజ‌మేనా?

   an hour ago


దీపిక కిడ్నాప్ కథ సుఖాంతం.. ట్విస్ట్ ఏమిటంటే..!

దీపిక కిడ్నాప్ కథ సుఖాంతం.. ట్విస్ట్ ఏమిటంటే..!

   2 hours ago


దుబ్బాకలో కారు కంగారు.. రంగంలోకి ట్రబుల్ షూటర్ హరీష్!

దుబ్బాకలో కారు కంగారు.. రంగంలోకి ట్రబుల్ షూటర్ హరీష్!

   3 hours ago


తెలంగాణలో మళ్ళీ వైరస్ వ్యాప్తి.. పెరుగుతున్న పాజిటివ్ కేసులు!

తెలంగాణలో మళ్ళీ వైరస్ వ్యాప్తి.. పెరుగుతున్న పాజిటివ్ కేసులు!

   3 hours ago


తెలంగాణలో సామాన్యులకు కరెంట్ బిల్ షాక్.. మధ్యతరగతి ఇక్కట్లు!

తెలంగాణలో సామాన్యులకు కరెంట్ బిల్ షాక్.. మధ్యతరగతి ఇక్కట్లు!

   3 hours ago


అమెరికా విద్యపై ఆన్‌లైన్‌ సదస్సుకు వంద విదేశీ వర్శిటీలు

అమెరికా విద్యపై ఆన్‌లైన్‌ సదస్సుకు వంద విదేశీ వర్శిటీలు

   3 hours ago


ఉపఎన్నిక నోటిఫికేషన్‌‌తో మొదలైన పొలిటికల్‌ ఫీవర్‌

ఉపఎన్నిక నోటిఫికేషన్‌‌తో మొదలైన పొలిటికల్‌ ఫీవర్‌

   4 hours ago


దగ్గుబాటి పురంధేశ్వరికి కరోనా పాజిటివ్

దగ్గుబాటి పురంధేశ్వరికి కరోనా పాజిటివ్

   5 hours ago


మంచిదే కానీ.. సీఎం జగన్ హెచ్చరిక

మంచిదే కానీ.. సీఎం జగన్ హెచ్చరిక

   6 hours ago


స్వచ్ఛభారత్‌లో తెలంగాణ మళ్లీ నంబర్‌ వన్‌.. హ్యాట్రిక్ రికార్డు

స్వచ్ఛభారత్‌లో తెలంగాణ మళ్లీ నంబర్‌ వన్‌.. హ్యాట్రిక్ రికార్డు

   7 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle