newssting
BITING NEWS :
*అమరావతి: ముగిసిన బీఏసీ సమావేశం... మూడు రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం*రాజధాని ప్రకటనకు ముందు గుట్టుచప్పుడు కాకుండా టీడీపీ నేతలు భూములు కొన్నారు... గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 4070 ఎకరాలు తేలింది, కంతేరు గ్రామంలో చంద్రబాబు 14.2 ఎకరాలు కొన్నారు-మంత్రి బుగ్గన *అసెంబ్లీ వికేంద్రీకరణ బిల్లు ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి బుగ్గన *మూడురాజధానులకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ *అమరావతి, విశాఖలో మంత్రులు అందుబాటులో ఉంటారు.. స్థానిక జోన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.. నాలుగు జిల్లాలకు కలిపి జోనల్ డెవలప్‌మెంట్ బోర్డు, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే బిల్లు ఉద్దేశం-మంత్రి బుగ్గన*సీఆర్డీఏ రద్దు బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి బొత్స, మూడు రాజధానుల ప్రతిపాదలను బిల్లులో పేర్కొన్న ప్రభుత్వం*రంగారెడ్డి జిల్లా: షాద్‌నగర్‌లో చిరుత కలకలం.. ఓ ఇంటిపై చిరుత సంచారం, భయాందోళనలో స్థానికులు*ఛలో అసెంబ్లీకి అమరావతి జేఏసీ పిలుపు.. మద్దతు ప్రకటించిన టీడీపీ, సీపీఐ.. టీడీపీ ఎమ్మెల్యేలు*బెంగళూరు వన్డేలో టీమ్ ఇండియా విజయం. 3 వన్డేల సీరీస్ ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న టీమ్ ఇండియా

గంటా ఎంట్రీకి అవంతి అడ్డుపుల్లలు?

03-09-201903-09-2019 14:31:37 IST
Updated On 05-09-2019 16:28:15 ISTUpdated On 05-09-20192019-09-03T09:01:37.232Z03-09-2019 2019-09-03T09:01:34.671Z - 2019-09-05T10:58:15.030Z - 05-09-2019

గంటా ఎంట్రీకి అవంతి అడ్డుపుల్లలు?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
విశాఖ‌ప‌ట్నం రాజ‌కీయాల‌ను ఇద్ద‌రు కీల‌క నేత‌లు విమ‌ర్శ‌లు, ప్ర‌తివిమ‌ర్శ‌ల‌తో వేడెక్కిస్తున్నారు. ఒక‌రి చ‌రిత్ర ఒక‌రు బ‌య‌ట‌పెట్టుకుంటున్నారు. ప‌ర‌స్ప‌రం త‌క్కువ చేసి మాట్లాడుకుంటున్నారు.

అయితే, ఇంత‌లా తిట్టుకుంటున్న వీరిద్ద‌రూ నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు మిత్రులు కావ‌డం ఇక్క‌డ‌ గ‌మ‌నార్హం. తెలుగుదేశం పార్టీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు, ప్ర‌స్తుత మంత్రి అవంతి శ్రీనివాస్ మ‌ధ్య మాట‌ల యుద్ధం న‌డుస్తోంది.

వ్యాపార రంగం నుంచి రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించారు ఈ ఇద్ద‌రు నెత‌లు. వీరిలో గంటా శ్రీనివాస‌రావు సీనియ‌ర్‌. 2009లో ప్ర‌జారాజ్యం పార్టీ స్థాపించిన నాటి నుంచి వీరు క‌లిసి అడుగులు వేస్తున్నారు. పీఆర్పీలో ఇద్ద‌రు విశాఖ‌ప‌ట్నం జిల్లా నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. అవంతి శ్రీనివాస్‌తో పాటు మ‌రో న‌లుగురు పీఆర్పీ ఎమ్మెల్యేల‌కు గంటా శ్రీనివాస‌రావు లీడర్‌గా ఉండేవారు.

2014లో ఐదుగురు ఎమ్మెల్యేలు క‌లిసి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఐదుగురికి టిక్కెట్లు ఇవ్వాల‌నే ష‌ర‌తు పెట్టి గంటా వారిని టీడీపీలోకి తీసుకెళ్లారు. కానీ, ముగ్గురికే టిక్కెట్లు వ‌చ్చాయి.

ప్ర‌తీ ఎన్నిక‌కూ నియోజ‌క‌వ‌ర్గాన్ని మార్చే గంటా.. ఆ ఎన్నిక‌ల్లో త‌న వెంట న‌డిచే అవంతి శ్రీనివాస్ సీటుకే ఎస‌రు పెట్టారు. ఆయ‌న ఎమ్మెల్యేగా ఉన్న భీమిలి నుంచి గంటా పోటీ చేసి గెలిచారు. మ‌రోసారి మంత్రి అయ్యారు. అప్ప‌టికే అసంతృప్తికి గురైన అవంతి చాలాకాలం గంటాతో స‌ఖ్య‌త‌గానే ఉన్నారు.

ఇటీవ‌లి ఎన్నిక‌ల ముందు కూడా వీరి బ్యాచ్ మొత్తం వైసీపీలోకి వెళుతుంద‌నే ప్ర‌చారం జ‌రిగింది. కానీ, చివ‌ర‌కు అవంతి శ్రీనివాస్ ఒక్క‌రే వైసీపీలో చేరి భీమిలి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రి కూడా అయ్యారు.

దీంతో ఇంత‌కాలం లోలోపల ఉన్న వీరిద్ద‌రి మ‌ధ్య విభేదాలు ఇప్పుడు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. ఇటీవ‌ల గంటా శ్రీనివాస‌రావు వైసీపీలోకి వ‌స్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. గంటా పార్టీలోకి వ‌స్తే జిల్లాలో, పార్టీలో అవంతి ప్రాబ‌ల్యం త‌గ్గే అవ‌కాశం ఉంది.

దీంతో ఆయ‌న‌కు పార్టీ త‌లుపులు మూసేయాల‌నే అవంతి శ్రీనివాస్ ప్ర‌య‌త్నిస్తున్నారు. అందుకే ఆయ‌న‌ను పార్టీలోకి రానివ్వ‌మ‌ని, త‌మ పార్టీ గంటా లాంటి వారిని చేర్చుకోద‌ని, గంటా త‌ర‌చూ పార్టీలు మారుతూ రాజ‌కీయ వ్య‌భిచారానికి పాల్ప‌డుతున్నార‌ని ప‌దేప‌దే చెబుతున్నారు.

పార్టీలోకి రావాల‌నే ఆలోచ‌న కూడా ఆయ‌న‌కు రాకుండా ముందు జాగ్ర‌త్త‌గానే అవంతి ఇలాంటి వ్యాఖ్య‌లు చేస్తున్న‌ట్లు కనిపిస్తోంది.

అయితే, గంటా మాత్రం తాను వైసీపీలో చేరాల‌నుకుంటే అవంతి లాంటి వారు ఆప‌లేర‌ని చెబుతున్నారు. మ‌రి, ఈ ఇద్ద‌రు నేత‌లు మ‌రోసారి ఒకే పార్టీలో క‌లిసి ప‌ని చేస్తారా లేదా అనేది త్వ‌ర‌లోనే తేలిపోనుంది.

 

డీఎస్ పశ్చాత్తాపం.. కాంగ్రెస్‌ని వీడి తప్పుచేశా!

డీఎస్ పశ్చాత్తాపం.. కాంగ్రెస్‌ని వీడి తప్పుచేశా!

   9 hours ago


పనిచేయని పవన్ ఆదేశాలు .. రాపాక రూట్ అటేనా?

పనిచేయని పవన్ ఆదేశాలు .. రాపాక రూట్ అటేనా?

   10 hours ago


కామన్ సెన్స్ కి వచ్చిన తిప్పలు.. సెన్సాఫ్ హ్యూమరట!

కామన్ సెన్స్ కి వచ్చిన తిప్పలు.. సెన్సాఫ్ హ్యూమరట!

   11 hours ago


రాజకీయ పార్టీల వికృత క్రీడకు బలైపోయిన ఆంధ్రుడు!

రాజకీయ పార్టీల వికృత క్రీడకు బలైపోయిన ఆంధ్రుడు!

   13 hours ago


స్పీకర్ నామమాత్రమేనా? జగనే సుప్రీం అవుతున్నారా?

స్పీకర్ నామమాత్రమేనా? జగనే సుప్రీం అవుతున్నారా?

   15 hours ago


అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ప్రవేశ పెట్టిన బుగ్గన

అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ప్రవేశ పెట్టిన బుగ్గన

   15 hours ago


హైపవర్ కమిటీ నివేదికకి కేబినెట్ ఓకె.. మూడురాజధానులకు సై

హైపవర్ కమిటీ నివేదికకి కేబినెట్ ఓకె.. మూడురాజధానులకు సై

   15 hours ago


టీడీపీ హయాంలో అభివృద్ధి... బీజేపీ, కాంగ్రెస్ నేతల పోటీ

టీడీపీ హయాంలో అభివృద్ధి... బీజేపీ, కాంగ్రెస్ నేతల పోటీ

   15 hours ago


జేపీ న‌డ్డా.. ఇక బీజేపీ బాస్‌..! ఎవ‌రాయ‌న‌..?

జేపీ న‌డ్డా.. ఇక బీజేపీ బాస్‌..! ఎవ‌రాయ‌న‌..?

   15 hours ago


'జ‌గ‌న్‌కు మోడీ, అమిత్ షా అండ‌'.. మీకు అర్ధ‌మ‌వుతుందా..?

'జ‌గ‌న్‌కు మోడీ, అమిత్ షా అండ‌'.. మీకు అర్ధ‌మ‌వుతుందా..?

   16 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle