newssting
BITING NEWS :
*ఢిల్లీలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్... పలువురు కేంద్రమంత్రులను కలిసే అవకాశం*ఇవాళ తిరుమల శ్రీవారి దర్శనానికి రానున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్..రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్న చీఫ్ జస్టిస్ *జగన్ సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ ని సూసైడ్ ఆంధ్రప్రదేశ్ గా మార్చేసారు-లోకేష్ * బస్సు రోకోకి ఆర్టీసీ జేఏసీ పిలుపు.. అనుమతిలేదన్న పోలీసులు..బస్ డిపోల దగ్గర 144 సెక్షన్ విధింపు* ఇవాళ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం.. పార్టీ అధ్యక్షత బాధ్యతలు తీసుకున్న తర్వాత సోనియా గాంధీ నేతృత్వంలో తొలిసారి కీలక భేటీ*టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, కూన రవిపై ప్రివిలేజ్ పిటిషన్ ఇచ్చిన వైసీపీ..స్పీకర్ తమ్మినేనిని పరుష పదజాలంతో దూషించారని ఫిర్యాదు *ఎన్నికలు నాకు కొత్తేమీ కాదు.. దమ్ముంటే గన్నవరంలో చంద్రబాబు, లోకేష్ పోటీచేయాలి-వంశీ సవాల్

గంటా అందుకే అక్కడికి వెళ్ళలేదా?

04-11-201904-11-2019 08:39:18 IST
2019-11-04T03:09:18.852Z04-11-2019 2019-11-04T03:08:56.398Z - - 16-11-2019

గంటా అందుకే అక్కడికి వెళ్ళలేదా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాష్ట్రంలో ఇసుక కొర‌త‌ను నిర‌సిస్తూ జ‌న‌సేన పార్టీ విశాఖ‌ప‌ట్నంలో నిర్వ‌హించిన లాంగ్ మార్చ్ గ్రాండ్ స‌క్సెస్ అయ్యింది. రాష్ట్ర‌వ్యాప్తంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానులు, జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు విశాఖ‌ప‌ట్నంలో క‌దం తొక్కారు. అయితే, అన్ని ప్ర‌తిపక్ష పార్టీల‌ను ఒక్క చోట చేర్చాల‌నే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌య‌త్నాలు మాత్రం ఫ‌లించ‌లేదు.

కేవలం తెలుగుదేశం పార్టీ నుంచి మాత్ర‌మే నేత‌లు లాంగ్ మార్చ్‌కు హాజ‌ర‌య్యారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫోన్ చేసి అడ‌గ‌గానే ఈ కార్య‌క్ర‌మానికి సంఘీభావం తెలిపిన చంద్రబాబు నాయుడు త‌మ పార్టీ త‌ర‌పున నేత‌ల‌ను పంపించాల‌ని నిర్ణ‌యించారు. ఉత్త‌రాంధ్ర‌కు చెందిన మాజీ మంత్రులు గంటా శ్రీనివాస‌రావు, అయ్య‌న్న‌పాత్రుడు, అచ్చెన్నాయుడును లాంగ్ మార్చ్‌కు వెళ్లాల‌ని ఆదేశించారు.

అయ్య‌న్న‌, అచ్చెన్నాయుడు ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రై ప్ర‌సంగించారు. కానీ, గంటా శ్రీనివాస‌రావుకు మాత్రం చంద్ర‌బాబు ఆదేశాల‌ను సైతం బేఖాత‌రు చేస్తూ లాంగ్ మార్చ్‌కు దూరంగా ఉన్నారు.

ఇందుకు కార‌ణాల‌పై ర‌క‌ర‌కాల ప్ర‌చారం జ‌రుగుతోంది. వాస్త‌వానికి గంటా శ్రీనివాస‌రావు మెగా కుటుంబానికి అత్యంత స‌న్నిహితుడు.కాపు సామాజ‌క‌వ‌ర్గానికి చెందిన ఆయ‌న చిరంజీవి ప్ర‌జారాజ్యం పార్టీలో కీల‌క నేత‌గా, మంత్రిగా ప‌నిచేశారు. అనంత‌రం టీడీపీలో చేరినా చిరంజీవితో చాలా స‌న్నిహితంగా ఉంటారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో చిరంజీవి ఎక్క‌డ‌కు వ‌చ్చినా గంటా ప‌క్క‌న ఉండి త‌న పాత నాయ‌కుడికి త‌గిన గౌర‌వ‌మిస్తారు. ఇప్పుడు చంద్ర‌బాబే చెప్ప‌డంతో ప‌వ‌న్ క‌ళ్యాణ్ మీటింగ్‌కు గంటా త‌ప్ప‌కుండా హాజ‌ర‌వుతార‌ని, ఏర్పాట్లకు కూడా ఆయ‌న స‌హ‌క‌రిస్తార‌ని అంతా అనుకున్నా అలా జ‌ర‌గ‌లేదు.

తెలుగుదేశం పార్టీని గంటా శ్రీనివాస‌రావు వీడుతారంటూ గ‌త కొన్ని రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆయ‌న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రోవైపు ఆయ‌న బీజేపీ వైపు కూడా చూస్తున్నార‌ని, అందుకే ఆ పార్టీ కీల‌క నేత రాంమాధ‌వ్‌ను సైతం క‌లిశార‌నే ప్ర‌చారం ఉంది.

ఒక‌వేళ ఆయ‌న వైసీపీలో చేరాల‌నుకున్నా ప‌వ‌న్ క‌ళ్యాణ్ కార్య‌క్ర‌మానికి వెళ్ల‌డం మైన‌స్ అవుతుంది. బీజేపీకి కూడా ప‌వ‌న్ మీటింగ్‌కు సంఘీభావం తెలిపినా హాజ‌ర‌య్యేది లేద‌ని తెగేసి చెప్పినందున గంటా బీజేపీలో చేరాల‌నుకుంటున్నా లాంగ్ మార్చ్‌కు వెళ్ల‌డం ఇబ్బందిక‌ర‌మ‌వుతుంది.

దీంతో పాటు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో కూడా గంటాకు స‌ఖ్య‌త లేద‌ని స‌మాచారం. అందుకే చంద్ర‌బాబు ఆదేశాల‌ను సైతం బేఖాత‌రు చేస్తూ గంటా సైలెంట్‌గా లాంగ్ మార్చ్ కార్య‌క్రమానికి దూరంగా ఉన్నారు. ఆయ‌న వ‌ర్గం ఎమ్మెల్యేలుగా ఉన్న వారు కూడా ఈ కార్య‌క్రమానికి హాజ‌ర‌వ‌లేదు.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle