newssting
BITING NEWS :
తెలంగాణ రాస్ట్రంలో అతి పెద్ద జాతర అయిన మేడారం తేదీలు ఖరారు ఫిబ్రవరి 7, 8 న భక్తులు తమ మొక్కులు చెల్లించుకోనున్నారు * ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ సెమీస్‌లో బజ్‌రంగ్‌ పూనియాకు నిరాశ వివాదాస్పదరీతిలో పరాజయం * చైనా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాయిప్రణీత్‌ సింధు సహా అంతా అవుట్‌ * కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మకం: మోదీ * స్టాక్‌మార్కెట్లో రికార్డు లాభాలు, సెన్సెక్స్‌ 1921, నిఫ్టీ 569 పాయింట్లు జంప్‌* మన్మోహన్ సింగ్ పాక్‌పై సైనిక చర్యకు ప్లాన్ వేశారు : బ్రిటన్ మాజీ ప్రధాని * ఇకపై మంత్రి హరీశ్‌రావుతో ఘర్షణ ఉండదన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి * సచివాలయ ఉద్యోగాల పేరిట భారీ స్కాం.. ప్రశ్నపత్రాల లీకేజీపై చంద్రబాబు ట్వీట్ * ప్రధానమంత్రిని తిట్టడం దేశద్రోహం కిందికి రాదు: ఢిల్లీ పోలీసులు. * రామమందిరంపై సుప్రీం కోర్టు తీర్పును విశ్వసిద్దాం: నాసిక్‌ సభలో ప్రధాని నరేంద్రమోదీ *

ఖాకీ వర్సెస్ ఖాకీ... డేటా వార్ !

05-03-201905-03-2019 13:11:22 IST
Updated On 06-03-2019 19:41:44 ISTUpdated On 06-03-20192019-03-05T07:41:22.130Z05-03-2019 2019-03-05T07:35:11.962Z - 2019-03-06T14:11:44.634Z - 06-03-2019

ఖాకీ వర్సెస్  ఖాకీ... డేటా వార్ !
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
చోరీ జరిగింది నిజం. దొంగతనం చేసినతను  పరారీలో ఉన్నాడు.... అంటారొకరు 

అది నా సొంత సొత్తు... నేనే అతనికి ఇచ్చాను. నా వస్తువును నేనే ఇస్తే అది దొంగతనమౌతుందా? 

ఇదీ ఇప్పుడు తెలంగాణ- ఆంధ్రా పోలీసుల మధ్య నడుస్తున్న డేటా చోరీ కథ ! 

తప్పెవరిదో తీరిగ్గా తేల్చుకుంటారో..  లేక ఒకళ్ళమీద ఇంకొకళ్ళు కేసులు పెట్టుకుని కోర్టులకెక్కుతారో తరువాత కథ !

ఇంతకీ అసలు విషయమేంటి..  పోయిన వస్తువేంటి ? విలువైన సమాచారం. ఆ సమాచారం నిక్షిప్తం చేసిన కంప్యూటర్ హార్డ్ డిస్క్. ప్రజలకు సంబంధించిన అనేక వ్యక్తిగత వివరాల్ని సేకరించిన ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం దాన్ని బాధ్యతారహితంగా  బయటవాళ్ళతో ఎలా పంచుకుంటుంది? అది కచ్చితంగా నేరమే అవుతుందని గతంలో సుప్రీమ్ కోర్ట్ ఒక తీర్పులో స్పష్టం చేసింది. అంతకుముందు  ఏపీ  ప్రభుత్వం సర్వే పేరుతో ప్రజలకు సంబంధించిన అనేక వివరాల్ని సేకరించింది. అయితే ఇటువంటి వివరాల్ని గోప్యంగా ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అయితే ఇప్పుడు ఆ డేటా బయటి వ్యక్తుల చేతిలోకి వెళ్ళిపోయింది. దాంట్లో ఉన్న సమాచారాన్ని తెలుగుదేశం పార్టీ తన ఎన్నికల అవసరాల కోసం వాడుకుంటోందన్నది ప్రధాన ప్రతిపక్షం ఆరోపణ.

డాటాను ప్రభుత్వం అశోక్ అనే వ్యక్తి నడుపుతున్న ఐటీ గ్రిడ్స్ అనే సంస్థకు ఇచ్చిన మాట వాస్తవం. సేవా మిత్ర అనే ఒక యాప్‌ను తయారుచేసి ఈ మొత్తం సమాచారాన్ని అందులో ఉంచారని... తన ఫొటోతో బాటు తన వ్యక్తిగత సమాచారం కూడా ఈ సేవామిత్ర యాప్‌లో ఉన్నదంటూ లోకేష్ రెడ్డి అనే వ్యక్తి హైద్రాబాదులో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కీలకమైన ఆధార్ వంటి కార్డుల్లో ఉండే సమాచారం బయటి వ్యక్తుల చేతుల్లోకి ఎలా వెళ్ళిందంటూ బాధితుడి ఫిర్యాదు సారాంశం. ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ సంస్థకు చెందిన ఉద్యోగులను అందులోకి తీసుకుని ప్రశ్నించారు. నా ఉద్యోగుల్ని అన్యాయంగా అదుపులోకి తీసుకున్నారంటూ సంస్థ నిర్వాహకుడు అశోక్ కోర్టులో హెబీయస్ కార్పస్ పిటిషన్ వేసాడు. అయితే పోలీసులు తమను అదుపులోకి తీసుకోనేలేదంటూ ఆ ఉద్యోగులు చెప్పడంతో కోర్టు పిటిషన్ కొట్టేసింది. 

ఇక బంతి మళ్ళీ రాజకీయ కోర్టులోకి వచ్చి పడింది. ఇదంతా వైస్సార్సీపీ-తెరాస కలిసి ఆడుతున్న కుట్ర అంటూ చంద్రబాబు ఆరోపిస్తారు. ఆంధ్రా పోలీసులొచ్చి ఇక్కడ చేస్తున్న జులుం సహించబోమంటారు కేటీయార్. సైబరాబాద్ పోలీసులు మాత్రం దీన్ని సీరియస్ గానే తీసుకున్నారు. స్టోరీలో అసలు కీలకమైన వ్యక్తి, సంస్థ యజమాని అశోక్ గాయాబ్ ! ఆయన పోతూపోతూ రెండు హార్డ్ డిస్కులని తన  వెంట తీసుకుపోయాడు. ఇది రెండు రాష్ట్రాల మధ్య జరుగుతున్న రాజకీయమో.. లేక ఖాకీల మధ్య ప్రత్యక్ష యుద్ధమోగానీ విషయం మాత్రం చాలా సీరియస్. 

ఇప్పటికే ఆధార్ కార్డు వివరాలన్నీ బజార్లో దొరుకుతున్నాయంటూ గగ్గోలు పెడుతున్నారు ప్రజాస్వామికవాదులు..సైబర్ నిపుణులు. 500 రూపాయలు పడేసి డేటా కొనుక్కోవచ్చంటూ ఒక ఇంగ్లీష్ పత్రిక ఏకంగా ప్రత్యేక వార్తా కథనాన్ని వండి వార్చింది. విషయం కోర్టు దాకా వెళ్ళింది. మా సమాచారం లీక్ అయ్యే ప్రసక్తే లేదంటుంది యూఐడీఏఐ సంస్థ.

ఎవరూ ఇవ్వకుండానే ప్రజలకు సంబంధించిన కీలకమైన సమాచారం మొత్తం బజారు పాలైతే బాధ్యత వహించాల్సిన ప్రభుత్వాలు రకరకాల సాకులు చెప్తున్నాయి. అంతెందుకు...తెలంగాణాలో 2014లో తెరాస ప్రభుత్వం అధికారంలోకి రాగానే సోషియో ఎకనామిక్ సర్వే పేరుతో ఇంటింటికీ వెళ్లి సమాచారం సేకరించింది. 

ఆ సమాచారాన్ని సంబంధించిన ప్రాథమిక వివరాలు చెప్తామంటూ అప్పట్లో తెరాస ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ ఇప్పటివరకూ అదేమీ జరగలేదు. అసలా వివరాల్ని మదింపు చేశారో లేదో కూడా తెలియదు. విభజన అనంతరం ఇదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలకమైన సమాచారాన్ని హైద్రాబాదులోనే ఉన్న కార్వీ సంస్థతో పంచుకుందనే సమాచారం ఉన్నది.

అయితే అటువంటి కీలకమైన సమాచారం ప్రైవేటు సంస్థతో ఎలా పంచుకుంటారంటూ పత్రికల్లో వార్తా కథనాలే వచ్చాయి. ఇక ఇప్పుడు తాజాగా ఈ ఐటీ గ్రిడ్స్ అనే సంస్థతో సేవామిత్ర కోసం ఒప్పందం చేసుకుని వివరాల్ని వారికి అందించిందనే ఆరోపణలు వున్నాయి. 

ఆధార్ కార్డు వ్యవహారమే తీసుకుంటే ఆది నుంచీ దాని చరిత్ర ఎన్నెన్ని వంకర్లు తిరిగిందో మనకు తెలిసిందే. యూపీఏ హయాంలో నందన్ నీలేకని ఆధ్వర్యంలో ఆరంభమైన ఈ ఆధార్ కార్డు ప్రాజెక్టును బీజేపీ ఆదిలోనే వ్యతిరేకించింది. అధికారంలోకి రాగానే రద్దు చేస్తామంటూ బీరాలకు పోయింది. దాని స్థానంలో ఇంకో డేటా ప్రాజెక్టును ఆరంభిస్తామంటూ ప్రకటనలు కూడా చేసింది.

ఆ తరువాత ఏమైందో కానీ ఒక శుభముహూర్తాన ఆధార్ కార్డుకే ఆమోద ముద్ర వేసేసి అది తప్పదంటూ ఆర్డర్ కూడా జారీ చేసింది. చివరకు వ్యవహారం కోర్టుదాకా కెళ్ళింది. అన్నింటికీ ఆధార్ కార్డు అవసరం లేదని కోర్టు తీఱుపు చెప్పించి. ముఖ్యంగా టెలికాం కంపెనీలు, బ్యాంకులకి ఈ ఆధార్ కార్డు తప్పనిసరేమీ కాదంటూ తేల్చిపారేసింది. అప్పటికే జనాల సమాచారం ప్రైవేటు వాళ్ళ చేతుల్లో పది బజార్లలో చక్కర్లు కొడుతోంది. చాలా ప్రైవేట్ సంస్థలు మార్కెటింగ్ పేరుతో చేసే ఫోన్లన్నీ ఐటువంటి వివరాల ఆధారంగానే అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు.

ప్రజలకు రక్షణగా ఉండాల్సిన ప్రభుత్వాలు... వాళ్లకు సంబంధించిన కీలకమైన సమాచారాన్ని ప్రైవేట్ వ్యక్తులు, సంస్థల చేతుల్లో పడేయడం ఎంత ప్రమాదకరమైన వ్యవహారమో రానురానూ తెలుస్తుంది. తమ పార్టీకి కాకుండా ఇంకో పార్టీకి ఓట్లు వేస్తారన్న ఉద్దేశంతో ఆ పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించడం ఒక్కటే అయితే దాన్ని ఇంకో రకంగా పరిష్కరించుకోవచ్చు. కానీ ఆ అవినీతి అక్కడితో ఆగుతుందా ఆగదు... వ్యక్తిగత సమాచారం గోప్యంగా ఉంచుకునే హక్కు ప్రతీ పౌరుడిదీ. అది రాజ్యాంగం కల్పించిన హక్కు. దానికి తూట్లు పొడిచే పని రాజకీయ పార్టీలే చేస్తుంటే.. ప్రభుత్వాలే దగ్గరుండి చేయిస్తుంటే ఇంకెవడి మొరపెట్టుకోవాలి ? 

మళ్ళీ కోర్టు మెట్లెక్కడమే పరిష్కారం ! యువరానర్... ప్లీజ్...!

-సతీష్ బాబు 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle