newssting
BITING NEWS :
*దిశ చట్టం తెచ్చినందుకు ఏపీ సీఎం జగన్‌కు అభినందనలు తెలిపిన ప్రత్యుష తల్లి సరోజినిదేవి *ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా వెంకట్రామిరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక *ఎన్‌కౌంటర్‌లో మరణించిన నలుగురు దిశ నిందితుల మృతదేహాల్ని భద్ర పర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం * కాంగ్రెస్‌ ‘భారత్‌ బచావో’ ర్యాలీ* ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా విడుదల....ఫోర్బ్స్‌ జాబితాలో నిర్మలాసీతారామన్‌*బ్రిటన్‌ ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీ ఘన విజయం*భారత పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌కు గాయం. వెస్టిండీస్‌తో జరిగే మూడు వన్డే సిరీస్‌లకు దూరం * టి20 క్రికెట్‌లోకి వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రేవో

ఖజానా ఖాళీ అయిందా? జీతాలు చెల్లింపు కష్టమైందా? అసలు వాస్తవమేంటి

04-10-201904-10-2019 14:59:10 IST
2019-10-04T09:29:10.883Z04-10-2019 2019-10-04T09:28:57.567Z - - 15-12-2019

ఖజానా ఖాళీ అయిందా? జీతాలు చెల్లింపు కష్టమైందా? అసలు వాస్తవమేంటి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వేలాదిమంది ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం అక్టోబర్ 1న సెప్టెంబర్ నెల వేతనాలు అందివ్వలేకపోయిందని ఒక పత్రికలో వచ్చిన వార్త సంచలనం రేకెత్తించింది. తన ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని దుస్థితిలో ఏపీ ప్రభుత్వం ఉందంటూ డబ్బుల్లేవు.. ఆర్థిక అగాథంలో రాష్ట్రం అనే శీర్షికన వచ్చిన ఆవార్త ప్రజలనేమో కానీ ఉద్యోగుల మతి కాస్తా పోగొట్టింది. 

ఉద్యోగులే కాకుండా రాష్ట్రంలోని ఫించనుదారులు కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నారని ఆ వార్త తెలిపింది. ఏపీఆర్టీసీ ఉద్యోగులకయితే 80 శాతం వేతనాలు మాత్రమే అందించారని పేర్కొంది. ఒకవైపు పెండింగ్ బిల్లులు మరోవైపు సంక్షేమ పథకాలు రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసేసాయి, ప్రభుత్వోద్యోగుల జీతాలు చెల్లించడానికే ఆర్థిక శాఖ సతమతమవుతోందని ఆ వార్త సారాంశం.

కానీ లక్షలాదిమందిపై ప్రభావం చూపిన ఈ వార్త నిజమేనా.. కాదంటున్నారు రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి. ఆ వార్త పచ్చి అబద్దమని పేర్కొంటూ గణాంకాల చిట్టా విప్పారు. ఆర్థిక శాఖ వివరాల ప్రకారం, అక్టోబర్ 1న 3,26,155 మంది ఉద్యోగులకు 2,083 కోట్ల రూపాయల వేతనాలను అందించారు. కాగా 3,62,174 ఫించనుదారులకు రూ. 1,964 కోట్ల రూపాయలను విడుదల చేశామని ఆర్థిక శాఖ తెలిపింది.

రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్టీసీ విలీమైనందున ఏపీఆర్టీసీ ఉద్యోగుల జీతాలను తగ్గించారని  కూడా ఆ పత్రిక చె్ప్పింది. దీనికి నిరసనగా ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు తీశారని, ఉద్యోగులకు పూర్తి స్తాయి వేతనాలు కల్పించాలంటూ డిమాండ్ చేశారని ఆ పత్రిక రాసింది.

అయితే వైఎస్సార్ ఆర్టీసీ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లాచంద్రయ్య ఈ విషయమై వివరణ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద చెల్లింపుల కొరత ఉందని కానీ ఈ పరిస్థితిని త్వరలో చక్కదిద్దుతారని చెప్పారు. మంగళవారం నాటికే కొద్దిమంది ఉద్యోగులకు వేతనాలు బట్వాడా చేశారని , అక్టోబర్ 2న బ్యాంకులకు సెలవు కాబట్టి ఆ మరుసటి దినం అంటే 3వతేదీన మిగిలిన ఉద్యోగులకు వేతనాలు అందాయని ఆయన చెప్పారు. 

కాగా ఆర్టీసీ ఉద్యోగులకు పూర్చి జీతాలు గురువారం నాటికి పంపిణీ చేశారని యూనియన్ ప్రెసిడెంట్ వైవీ రావు తెలిపారు. 

అయితే రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయిందని, వాహన మిత్ర, రైతుభరోసా వంటి సంక్షేమ పథకాలను నిర్వహించే సామర్త్యం రాష్ట్ర ప్రభుత్వం కోల్పోయిందని ఆ పత్రిక  పేర్కొంది.  కానీ ప్రభుత్వ వర్గాలనుంచి దీనిపట్ల ఎవరూ స్పందించకపోవడం గమనార్హం.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle