newssting
BITING NEWS :
*భారత్ లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటన.. భారీ భద్రతా ఏర్పాట్లు *చిత్తూరు జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల కలకలం..శ్రీ చౌడేశ్వరి ఆలయం వెనకాల ప్రాంతంలో తవ్వకాలు *ఆదిలాబాద్‌ గుడిహత్నూర్‌లో దారుణం....బాలికపై ఇద్దరు కామాంధుల అత్యాచారం* చైనాలో కొనసాగుతున్న కరోనా మరణమృదంగం....ఇప్పటివరకు 2వేల 460కి చేరిన కొవిడ్-19 మృతుల సంఖ్య*ఒడిశా : పూరీ జిల్లా పిప్పిలి ప్రాంతంలో ఏనుగుల బీభత్సం...ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి.., ఐదుగురికి గాయాలు *గుజరాత్‌లోని వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం..ట్రక్కు- టెంపో ఢీ, 11మంది మృతి *68వ రోజు కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళన... హైకోర్టు ఆదేశాలతో తుళ్లూరులో ఎంక్వైరీ చేపట్టిన పోలీసులు* ఢిల్లీలోని జఫ్రాబాద్ మెట్రో స్టేషన్‌లో సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలు..భారీగా తరలివచ్చిన మహిళలు*తిరుమలలో మరోసారి ప్రత్యక్షమైన బంగారు బల్లి.. చూసేందుకు బారులు తీరిన భక్తులు....శిలాతోరణం చక్రతీర్థంలో బంగారు బల్లి ప్రత్యక్షం

ఖజానా ఖల్లాస్.. జగన్ కింకర్తవ్యం?

05-09-201905-09-2019 09:49:08 IST
2019-09-05T04:19:08.427Z05-09-2019 2019-09-05T04:18:59.987Z - - 24-02-2020

ఖజానా ఖల్లాస్.. జగన్ కింకర్తవ్యం?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆస్తి మూరెడు. ఆశ బారెడు సామెత అచ్చం ఏపీ ప్రభుత్వానికి అతికినట్టు సరిపోతుంది. రాష్ట్రంలో తీవ్ర ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. ఒకవైపు రోజుకో హామీతో జగన్ వందవ రోజు వైపు దూసుకుపోతున్నారు. కానీ ఖజానా మాత్రం ఒట్టిపోయింది.

ఉద్యోగుల జీతాలు మినహా ఇతర బిల్లులను చెల్లింపును నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వం ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. 2019-20 ఆర్ధిక సంవత్సరంలో రెవిన్యూ రాబడిలో   పలు శాఖలు తీవ్రంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. దీంతో రాబడి బాగా తగ్గిపోయింది. 

13 జిల్లాల్లోని ఆయా పీఏఓ, ట్రెజరీ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున బిల్లుల చెల్లింపుల కోసం పెద్ద ఎత్తున ధరఖాస్తులు ఉన్నాయి. కొన్ని శాఖల్లో ఎన్నికల సమయం నుండి అద్దెకు తీసుకొన్న కార్లకు అద్దె బకాయిలు కూడ చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది.

తమకు బకాయిలు చెల్లించాలని కోరుతూ క్యాబ్ ఓనర్స్ ఆందోళనలు కూడ నిర్వహించారు. ప్రతి నెల ఒక్కో కారుకు రూ. 60వేలను ప్రభుత్వం చెల్లిస్తోంది. ఐదు నెలలుగా కారు అద్దె బకాయిలు చెల్లించడం లేదని క్యాబ్ ఓనర్స్ మొత్తుకుంటున్నారు. 

కారు అద్దె కాకుండా ఇతర బిల్లులను నిధులు లేని కారణంగా చెల్లించడం లేదని తెలుస్తోంది. ఆయా శాఖల్లో పెండింగ్ లో ఉన్న బిల్లులను  చెల్లించేందుకు నిధులను ఇవ్వాలని జిల్లాల యంత్రాంగాలుత్రాంగం ప్రభుత్వాన్ని కోరినా ఆర్థిక శాఖ అధికారులు ఏం చేయలేక చేతులెత్తేస్తున్నారు. .సాధారణంగా ప్రతి ఏటా ఫిబ్రవరి, మార్చి మాసాల్లో బిల్లుల చెల్లింపులో కొంత ఇబ్బందులు ఉంటాయి. 

ఈ ఏడాది ఏపీలో ఆదాయానికి, ఖర్చుకు మధ్య  చాలా వ్యత్యాసం ఉంది. దీంతో పెండింగ్ బిల్లుల చెల్లించేందుకు ప్రభుత్వం తీవ్రంగా ఇబ్బందులను ఎదుర్కొంటుంది. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం పసుపు కుంకుమ, రుణమాఫీ అంటూ కోట్లాది రూపాయలు చివరి నిముషంలో మళ్ళించిందనే ఆరోపణలున్నాయి. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో  పలు సంక్షేమ కార్యక్రమాల అమల్లో భాగంగా బిల్లులు ఇప్పటికీ పెండింగ్ లో ఉన్నాయి. 

ఖాళీ ఖజానాతో జగన్ పాలన ప్రారంభించారు. కేవలం వేతనాలు, పెన్షన్లను చెల్లించేందుకు మాత్రమే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. రాష్ట్రంలో ఆదాయ పరిస్థితిపై ఏపీ సీఎం జగన్ ఇటీవల అధికారులతో  సమీక్ష నిర్వహించారు.ఈ సమీక్షలో గణాంకాలు షాక్  కు గురిచేశాయి.ఈ ఏడాది ఆర్ధిక సంవత్సరంలో  14 శాతం వాణిజ్య పన్నుల వాటా పెరిగే అవకాశం ఉందని భావిస్తే, వాణిజ్య పన్నుల వాటా పెరుగుదల కేవలం 5.3 శాతంగా మాత్రమే నమోదైంది. 

ఇసుక కొరత కారణంగా నిర్మాణ రంగం సంక్షోభం ఎదుర్కొంటోంది. దీతో ఆదాయ వనరులు భారీగా పడిపోయాయని ఆర్ధిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇనుము, ఉక్కు, సిమెంట్ అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. దీని ప్రభావం రాష్ట్ర ఖజానాపై పడిందని ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల ముందు నవరత్నాలను జగన్ ప్రచారం చేశారు. నవరత్నాలకు బడ్జెట్ లో పెద్దపీట వేసింది జగన్ సర్కార్.అయితే  జగన్ సర్కార్ అమలు చేయాలనుకొన్నా నవరత్నాలకు డబ్బులు ఎక్కడి నుండి వస్తాయనే విషయమై ప్రస్తుతం చర్చకు దారి తీస్తోంది.

నవరత్నాలు అమలు చేయాలంటే భారీగానే నిధులు అవసరమౌతాయి. కేంద్రం, ఇతర ఆర్థిక సంస్థలు నిధులిస్తేనే ప్రభుత్వ కార్యకలాపాలు సజావుగా సాగుతాయి. రాష్ట్ర అర్హతకు మించి అప్పులున్నాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో అప్పులు చేసేందుకైనా తమకు అవకాశం ఉందా అనే చర్చ మంత్రుల్లో వ్యక్తమౌతోంది. రాష్ట్ర ఖజనాను నింపేందుకు జగన్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle