newssting
BITING NEWS :
*మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కార్యాలయంలో భారీ చోరీ*పాకిస్తాన్‌లో హైదరాబాద్‌ వాసి అరెస్ట్‌...అరెస్ట్‌ అయిన వ్యక్తి ప్రశాంత్‌ గా గుర్తింపు* రాజమండ్రి రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు*ఇవాళ సమ్మెపై తుది నిర్ణయం.. జడ్జిమెంట్‌ కాపీ చూశాక తుది నిర్ణయం.. సమ్మె యథాతథంగా కొనసాగుతుంది.. సడక్‌బంద్, రాస్తారోకోలు మాత్రం వాయిదా-అశ్వత్థామరెడ్డి*దీక్ష విరమించినా ఆర్టీసీ జేఏసీ ఆందోళన కొనసాగుతుంది-కోదండరాం*ఆర్టీసీ సమ్మెపై విచారణ ముగించిన హైకోర్టు *హైకోర్టుకు కొన్ని పరిమితులుంటాయి.. పరిధిదాటి ముందుకు వెళ్లలేం.. కార్మికశాఖ చూసుకుంటుంది.. 2 వారాల్లో సమస్య పరిష్కరించాలని సూచిస్తాం-హైకోర్టు

క‌లిసి ప‌నిచేస్తాం.. కానీ మిత్రుల‌ము కాదు..!

21-09-201921-09-2019 14:54:28 IST
2019-09-21T09:24:28.111Z21-09-2019 2019-09-21T09:24:23.024Z - - 20-11-2019

క‌లిసి ప‌నిచేస్తాం.. కానీ మిత్రుల‌ము కాదు..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలుగుదేశం పార్టీ నుంచి సీనియ‌ర్ నేత‌, మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేర‌డం తూర్పు గోదావ‌రి జిల్లా రాజకీయాల్లో కీల‌క ప‌రిణామం. అనేక ఊహాగానాలు, ప్ర‌చారాలు, చ‌ర్చ‌ల అనంత‌రం ఆయ‌న వైసీపీ గూటికి చేరారు. వాస్త‌వానికి ఎన్నిక‌ల ముందే ఆయ‌న పార్టీలో చేరేందుకు ప్ర‌య‌త్నించినా కుద‌ర‌లేదు.

ఆయన‌ను మండ‌పేట నుంచి పోటీ చేయాల్సిందిగా అప్పుడు వైసీపీ ఆఫ‌ర్ ఇచ్చింది. దీంతో తోట టీడీపీ నుంచే ఆయ‌న స్వంత నియోజ‌క‌వ‌ర్గం రామ‌చంద్రపురం నుంచి పోటీ చేసి వైసీపీ అభ్య‌ర్థి చెల్లుబోయిన వేణుగోపాల్ చేతిలో ఓట‌మి పాల‌య్యారు. ఆ త‌ర్వాత టీడీపీ అధిష్ఠానం ప‌ట్ల అసంతృప్తితో ఉన్న ఆయ‌న ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీ కండువా క‌ప్పుకున్నారు.

అయితే, ప్ర‌స్తుత మంత్రి, వైసీపీ సీనియ‌ర్ నేత పిల్లి సుభాష్‌చంద్ర బోస్‌తో ఉన్న విభేదాల కార‌ణంగా ఆయ‌న ఎట్టి ప‌రిస్థితుల్లో వైసీపీలో చేరర‌ని అంతా అనుకున్నారు. 30 ఏళ్లుగా వీరిద్ద‌రూ రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు. ఇద్ద‌రు రెండు ప్ర‌ధాన సామాజ‌క‌వ‌ర్గాల‌కు చెందిన నాయ‌కులు. దీంతో ఇద్ద‌రూ క‌ల‌వ‌డం క‌ష్టం అనుకున్నారు. కానీ, అనూహ్యంగా బోస్‌తో పాటు ఎమ్మెల్యే వేణుగోపాల్ స‌మ‌క్షంలోనే ఆయ‌న పార్టీలో చేరారు.

ఈ సంద‌ర్భంగా క‌లిసిక‌ట్టుగా ప‌నిచేస్తామ‌ని ముగ్గురు నేత‌లూ మీడియా ముందు చెప్పారు. ఇక నుంచి తామంతా ఒక‌టేన‌న్నారు. కానీ, అనూహ్యంగా బోస్ త‌న స్వ‌రం మార్చారు. పార్టీలో చేరినా తోట త్రిమూర్తులు త‌న‌కు శ‌త్రువే అని ఆయ‌న అన్నారు.

తోట త్రిమూర్తులుపై ద‌ళితుల శిరోమండ‌నం కేసు ఏళ్లుగా పెండింగ్‌లో ఉంటూ వ‌స్తోంది. వైసీపీ అధికారంలోకి వ‌చ్చాక ఆ కేసు విచార‌ణ ఊపందుకుంది. దీంతో ఇప్పుడు తోట వైసీపీలో చేర‌డంతో ఈ కేసులో త‌మ‌కు న్యాయం జ‌ర‌గ‌ద‌ని ద‌ళిత సంఘాలు భావిస్తున్నాయి. అందుకే జిల్లాలో ఆందోళ‌న‌లు చేస్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో ద‌ళిత నేత‌లు మంత్రి బోస్‌ను సైతం అడ్డుకోగా.. వైసీపీలో చేరినా త‌న‌కు తోట శ‌త్రువేన‌ని, కేసులో ద‌ళితుల‌కు న్యాయం జ‌రిగేలా త‌న వంతు ప్ర‌య‌త్నం చేస్తాన‌ని హామీ ఇవ్వ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ద‌ళితుల‌కు న్యాయం చేస్తాన‌నే ఆయ‌న ప్ర‌క‌ట‌న స‌రైన‌దే అయినా తోట త‌న శ‌త్రువ‌ని చెప్ప‌డాన్ని బ‌ట్టి చూస్తే తోట‌తో బోస్‌కు స‌ఖ్య‌త క‌ష్ట‌మే అనిపిస్తోంది.

కాపు సామాజ‌క‌వ‌ర్గంలో ప‌ట్టున్న నేత అయిన తోట త్రిమూర్తులు చేరిక‌తో త‌మ బ‌లం మ‌రింత పెరుగుతుంద‌ని వైసీపీ అంచ‌నా వేసింది. కానీ, సామాజ‌క‌వ‌ర్గ స‌మీక‌ర‌ణ‌ల్లో చూసుకున్నా, నేత‌ల మ‌ధ్య స‌ఖ్య‌త‌ను చూసుకున్న తోట చేరిక ఎంత లాభ‌మో, అంత న‌ష్టం కూడా చేసే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle