newssting
BITING NEWS :
తెలంగాణ రాస్ట్రంలో అతి పెద్ద జాతర అయిన మేడారం తేదీలు ఖరారు ఫిబ్రవరి 7, 8 న భక్తులు తమ మొక్కులు చెల్లించుకోనున్నారు * ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ సెమీస్‌లో బజ్‌రంగ్‌ పూనియాకు నిరాశ వివాదాస్పదరీతిలో పరాజయం * చైనా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాయిప్రణీత్‌ సింధు సహా అంతా అవుట్‌ * కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మకం: మోదీ * స్టాక్‌మార్కెట్లో రికార్డు లాభాలు, సెన్సెక్స్‌ 1921, నిఫ్టీ 569 పాయింట్లు జంప్‌* మన్మోహన్ సింగ్ పాక్‌పై సైనిక చర్యకు ప్లాన్ వేశారు : బ్రిటన్ మాజీ ప్రధాని * ఇకపై మంత్రి హరీశ్‌రావుతో ఘర్షణ ఉండదన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి * సచివాలయ ఉద్యోగాల పేరిట భారీ స్కాం.. ప్రశ్నపత్రాల లీకేజీపై చంద్రబాబు ట్వీట్ * ప్రధానమంత్రిని తిట్టడం దేశద్రోహం కిందికి రాదు: ఢిల్లీ పోలీసులు. * రామమందిరంపై సుప్రీం కోర్టు తీర్పును విశ్వసిద్దాం: నాసిక్‌ సభలో ప్రధాని నరేంద్రమోదీ *

క‌మ‌లం పార్టీ పరిస్థితి ఇంత ద‌య‌నీయ‌మా..?

03-07-201903-07-2019 07:56:46 IST
Updated On 03-07-2019 11:55:56 ISTUpdated On 03-07-20192019-07-03T02:26:46.443Z03-07-2019 2019-07-03T02:26:21.960Z - 2019-07-03T06:25:56.179Z - 03-07-2019

క‌మ‌లం పార్టీ పరిస్థితి ఇంత ద‌య‌నీయ‌మా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్ర‌దేశ్‌లో బ‌ల‌ప‌డి వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి వైఎస్సార్ కాంగ్రెస్‌కు ప్ర‌త్యామ్నాయం కావాల‌ని ఉవ్విళ్లూరుతున్న భార‌తీయ జ‌న‌తా పార్టీ వ‌ల‌స‌ల‌నే న‌మ్ముకుంది. పార్టీలో ఎవ‌రు చేరుతామ‌ని వ‌చ్చినా రెడ్ కార్పెట్ ప‌రిచి మ‌రీ స్వాగ‌తం ప‌లుకుతున్నారు. వారు ఎలాంటి నాయ‌కులు, వారి పూర్వాప‌రాలు ఏంటి, వారి చేరిక‌తో పార్టీకి ఏమైనా క‌లిసొస్తుందా అనే లెక్క‌లు కూడా వేసుకోకుండా నేత‌లు చేర్చుకుంటున్నారు.

ఈ నేప‌థ్యంలో ఇటీవ‌ల బీజేపీలో ప‌లు చేరిక‌లపై విమ‌ర్శ‌లు వెల్లువెత్త‌డంతో పార్టీ పార్టీని, రాష్ట్ర నేత‌ల‌ను న‌వ్వుల‌పాలు చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీని బ‌ల‌హీనం చేయ‌డం ద్వారా ఆ స్థానంలోకి తాము ఎద‌గాల‌ని భావించిన బీజేపీ న‌లుగురు టీడీపీ రాజ్య‌స‌భ ఎంపీల‌ను పార్టీలో చేర్చుకుంది. వీరు న‌లుగురూ వ్యాపార‌వేత్త‌లు. అందులో ఇద్ద‌రిపై ఆర్థిక నేరాలు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఒక‌రైతే సీబీఐ విచార‌ణ‌కు కూడా హాజ‌రుకాకుండా ముప్పుతిప్ప‌లు పెట్టిన చ‌రిత్ర ఉంది.

ఎన్నిక‌ల ముందు వ‌ర‌కూ బీజేపీని గ‌ట్టిగా వ్య‌తిరేకించిన వీరు ఎన్నిక‌ల్లో టీడీపీ దారుణ ఓట‌మితో బీజేపీలోనే చేరిపోయారు. వీరి న‌లుగురిలో ముగ్గురు ప్ర‌జ‌ల్లో నుంచి వ‌చ్చిన నాయ‌కులు కాదు. అయినా రాజ్య‌స‌భ‌లో బ‌లం అవ‌స‌ర‌మ‌నే ఉద్దేశ్య‌మో, మ‌రే లెక్క‌లో తెలియ‌దు కానీ బీజేపీ చేర్చేసుకుంది.

వీరి చేరిక స‌మ‌యంలోనే బీజేపీపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఆరోప‌ణ‌లు ఉన్న వారిని చేర్చుకొని ర‌క్ష‌ణ క‌ల్పిస్తున్నార‌నే భావ‌న ప్ర‌జ‌ల్లో వ్య‌క్త‌మైంది. దీంతో త‌మ పార్టీలో చేరిన ఆరోప‌ణ‌ల‌పై విచార‌ణ ఎదుర్కోవాల్సిందేన‌ని జీవీఎల్ న‌ర‌సింహారావు లాంటి బీజేపీ నేత‌లు డిఫెన్స్ చేసుకోవాల్సి వ‌చ్చింది.

అర‌కు మాజీ ఎంపీ కొత్త‌ప‌ల్లి గీత‌కు సైతం బీజేపీ జాతీయ అధ్య‌క్షులు అమిత్ షా కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆమెపై కూడా ప‌లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఆమె కూడా ప్ర‌జ‌ల్లో నుంచి వ‌చ్చిన నాయ‌కురాలు కాదు. ఐదేళ్ల‌లో మూడు పార్టీల మారిన ఘ‌న‌త ఆమె సొంతం. ఏ ర‌కంగా చూసిన కేసులు త‌ప్ప ప్ర‌జ‌ల్లో పెద్ద‌గా బ‌లం లేని ఆమెను బీజేపీలో చేర్చుకున్నారు.

ఇక‌, తాజాగా కోటి అనే వ్య‌క్తిని బీజేపీలో చేర్చుకోవ‌డం ద్వారా ఆ పార్టీ రాష్ట్ర నాయ‌క‌త్వం సోష‌ల్ మీడియాలో న‌వ్వుల‌పాలైంది. వైసీపీ నాయ‌కురాలు, దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ స‌తీమ‌ణి నంద‌మూరి ల‌క్ష్మీపార్వ‌తి వ‌ద్ద అత‌డు పీఏగా ప‌నిచేశారు.

ఎన్నిక‌ల ముందు ఆమెపై తీవ్ర ఆరోప‌ణ‌లు చేసి పోలీస్ కేసు పెట్టారు. న‌మ్మ‌శ‌క్యంగా లేని ఈ ఆరోప‌ణ‌ల‌ను ల‌క్షీపార్వ‌తిపై చేయ‌డాన్ని న‌మ్మ‌లేదు. దీంతో ఇప్పుడు ఆమె కుట్ర‌తోనే కోటి ఈ ఆరోప‌ణ‌లు చేసి త‌న గౌర‌వానికి భంగం క‌లిగించార‌ని, ఈ కుట్ర‌ను విచారించాల‌ని హైకోర్టును ఆశ్ర‌యించారు.

ఇప్పుడు ఈ కోటిని కూడా బీజేపీలో చేర్చుకున్నారు. ఏకంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షులు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ అత‌డికి కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ చేరిక‌పై సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. బీజేపీలో చేరాలంటే ఏదో ఒక ఆరోప‌ణ‌, వివాదం ఉండాలా అని నెటిజ‌న్లు ఎద్దేవా చేస్తున్నారు. దీంతో ఇప్పుడు ఈ చేరిక‌ను ఎలా స‌మ‌ర్థించుకోవాలో తెలియ‌క బీజేపీ నేత‌లు ఆపసోపాలు ప‌డుతున్నారు.

పార్టీని బ‌లోపేతం చేసుకోవ‌డానికి చేరిక‌లు ఒక మార్గ‌మే కావ‌చ్చు కానీ మ‌రీ తీవ్ర ఆరోప‌ణ‌లు ఉన్న‌వారు, ప్ర‌జ‌ల్లో ఏమాత్రం బ‌లం లేని వారిని చేర్చుకోవ‌డం ద్వారా బీజేపీ ఎటువంటి ప్ర‌యోజ‌నాలు ఆశిస్తుందో త‌ల‌పండి రాజ‌కీయ విశ్లేష‌కుల‌కు కూడా అంతుచిక్క‌డం లేదు.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle