newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

క‌మ్యూనిస్టుల్లోనూ రాజ‌ధాని చిచ్చు

14-01-202014-01-2020 07:51:51 IST
Updated On 14-01-2020 12:03:43 ISTUpdated On 14-01-20202020-01-14T02:21:51.109Z14-01-2020 2020-01-14T02:21:41.888Z - 2020-01-14T06:33:43.677Z - 14-01-2020

క‌మ్యూనిస్టుల్లోనూ రాజ‌ధాని చిచ్చు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని వ్య‌వ‌హారం ఇప్పుడు క‌మ్యూనిస్టు పార్టీల్లోనూ చిచ్చు పెట్టింది. రాజ‌ధానిపై త‌లో బాట అన్న‌ట్లుగా క‌మ్యూనిస్టు నేత‌లు సాగుతున్నారు. ముఖ్యంగా సీపీఐ పార్టీలో అమ‌రావ‌తి అంశం ర‌గ‌డ రేపుతోంది. ఓ వైపు సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణ అమ‌రావ‌తిని కాపాడుకోవాలి అంటూ ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు నాయుడుతో క‌లిసి పోరాడుతున్నారు. మ‌రోవైపు ఆయ‌న వైఖ‌రికి, పార్టీ రాష్ట్ర క‌మిటీ నిర్ణ‌యానికి వ్య‌తిరేకంగా సీపీఐ క‌ర్నూలు శాఖ తీర్మానం చేసింది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నామ‌మాత్రంగా మిగిలిపోయిన సీపీఐ, సీపీఎం పార్టీలు ఉనికి చాటుకునేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నాయి. త‌మ‌కంటే పెద్ద‌దైన ఏదో ఒక పార్టీతో క‌లిసి ప‌ని చేసేందుకు ఆ రెండు పార్టీలూ ఉవ్విళ్లూరుతుంటాయి. గ‌త ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీతో క‌లిసి నడిచిన క‌మ్యూనిస్టులు ఇప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు దూర‌మయ్యారు.

సీపీఐ ఇప్పుడు చంద్ర‌బాబు నాయుడుతో క‌లిసి న‌డుస్తోంది. ముఖ్యంగా ఆ పార్టీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణ అయితే అమ‌రావ‌తిని కాపాడుకునేందుకు చంద్ర‌బాబు అడుగులో అడుగేస్తున్నారు.

రాజ‌ధాని విష‌యంలో సీపీఐ, సీపీఎం ఒకేర‌కమైన వైఖ‌రితో ఉన్నాయి. అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ‌ను వ్య‌తిరేకించ‌డం లేదు కానీ, అమ‌రావ‌తిలోనే రాజ‌ధానిని కొన‌సాగించాల‌ని డిమాండ్ చేస్తున్నాయి.

ఈ విష‌యంలో సీపీఎం పెద్ద‌గా స్పందించ‌డం లేదు. కేవ‌లం అమ‌రావ‌తి రైతుల‌కు మ‌ద్ద‌తు ఇచ్చింది కానీ అమ‌రావ‌తిలో మాత్ర‌మే రాజ‌ధాని ఉండాల‌ని ఎటువంటి ఆందోళ‌న‌లు చేప‌ట్ట‌డం లేదు. సీపీఐ మాత్రం ఈ విష‌యంలో చాలా దూకుడుగా వెళుతోంది. తెలుగుదేశం పార్టీ చేప‌డుతున్న అన్ని ఆందోళ‌ణ‌ల్లోనూ సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి రామకృష్ణ పాల్గొంటున్నారు.

ఇప్పుడు ఇదే ఆ పార్టీలో ఇచ్చు రేపింది. త‌మ పార్టీ కార్య‌ద‌ర్శి చంద్ర‌బాబుతో క‌లిసి అమ‌రావ‌తిలో మాత్ర‌మే రాజ‌ధాని ఉండాల‌ని పోరాడుతుంటే క‌ర్నూలు జిల్లా సీపీఐ శాఖ మాత్రం రామ‌కృష్ణ వైఖ‌రికి భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తోంది.

అధికార వికేంద్రీక‌ర‌ణ‌, క‌ర్నూలులో హైకోర్టును స్వాగ‌తిస్తూ క‌ర్నూలు సీపీఐ తీర్మానం చేసింది. అంతేకాదు, రాయ‌ల‌సీమ, ఉత్త‌రాంధ్ర‌లోనూ అసెంబ్లీ స‌మావేశాలు పెట్టాల‌ని కోరింది. చంద్ర‌బాబు వ‌ల్లే రాజ‌ధాని స‌మ‌స్య వ‌చ్చింద‌ని ఆరోపించింది. అమ‌రావ‌తిని తాత్కాలిక రాజ‌ధానిగా చంద్ర‌బాబే మార్చార‌ని ఆరోపించింది.

అయితే, త‌మ పార్టీలో రెండు అభిప్రాయాలు లేవ‌ని రామ‌కృష్ణ అంటున్నారు. హైకోర్టు క‌ర్నూలులో పెట్ట‌డాన్ని తాను కూడా స్వాగ‌తిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే, రాజ‌ధాని మాత్ర‌మే అమ‌రావ‌తిలోనే ఉండాలంటున్నారు.

కానీ, ఆయ‌న క‌లిసి ఉద్య‌మిస్తున్న చంద్ర‌బాబు నాయుడు, అమ‌రావ‌తి రైతులు మాత్రం హైకోర్టు స‌హా రాజ‌ధాని అంతా అమ‌రావ‌తిలోనే ఉండాల‌ని గ‌ట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఇదంతా సీపీఐలో ఒక గంద‌ర‌గోళంలా మారింది. క‌ర్నూలు జిల్లా శాఖ‌నే కాకుండా మిగ‌తా రాయ‌ల‌సీమ‌, ఉత్త‌రాంధ్ర జిల్లాల సీపీఐ నేత‌లు కూడా రామ‌కృష్ణ వైఖ‌రిపై అసంతృప్తిగా ఉన్న‌ట్లు తెలుస్తోంది.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle