newssting
BITING NEWS :
తెలంగాణ రాస్ట్రంలో అతి పెద్ద జాతర అయిన మేడారం తేదీలు ఖరారు ఫిబ్రవరి 7, 8 న భక్తులు తమ మొక్కులు చెల్లించుకోనున్నారు * ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ సెమీస్‌లో బజ్‌రంగ్‌ పూనియాకు నిరాశ వివాదాస్పదరీతిలో పరాజయం * చైనా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాయిప్రణీత్‌ సింధు సహా అంతా అవుట్‌ * కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మకం: మోదీ * స్టాక్‌మార్కెట్లో రికార్డు లాభాలు, సెన్సెక్స్‌ 1921, నిఫ్టీ 569 పాయింట్లు జంప్‌* మన్మోహన్ సింగ్ పాక్‌పై సైనిక చర్యకు ప్లాన్ వేశారు : బ్రిటన్ మాజీ ప్రధాని * ఇకపై మంత్రి హరీశ్‌రావుతో ఘర్షణ ఉండదన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి * సచివాలయ ఉద్యోగాల పేరిట భారీ స్కాం.. ప్రశ్నపత్రాల లీకేజీపై చంద్రబాబు ట్వీట్ * ప్రధానమంత్రిని తిట్టడం దేశద్రోహం కిందికి రాదు: ఢిల్లీ పోలీసులు. * రామమందిరంపై సుప్రీం కోర్టు తీర్పును విశ్వసిద్దాం: నాసిక్‌ సభలో ప్రధాని నరేంద్రమోదీ *

క‌మలం పార్టీ ప‌వ‌న్‌ను లైన్‌లో పెడుతోందా..?

31-07-201931-07-2019 12:38:14 IST
2019-07-31T07:08:14.524Z31-07-2019 2019-07-31T07:08:11.811Z - - 20-09-2019

క‌మలం పార్టీ ప‌వ‌న్‌ను లైన్‌లో పెడుతోందా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో బ‌లోపేత‌మై వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్ర‌త్యామ్నాయం కావాల‌నుకుంటున్న భార‌తీయ జ‌న‌తా పార్టీకి ఇప్పుడు ఓ కొర‌త కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తోంది. రాష్ట్ర‌వ్యాప్తంగా మంచి గుర్తింపు, కొంతైనా ఓటర్ల‌ను ఆక‌ర్షించ‌గ‌లిగిన నేత ఆ పార్టీలో లేరు. కేవ‌లం న‌రేంద్ర మోడీ ఛ‌రిష్మా త‌ప్ప రాష్ట్ర స్థాయి పార్టీకి ఒక ఛ‌రిష్మా ఉన్న నేత క‌రువ‌య్యారు. పురందేశ్వ‌రి, క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ వంటి వారు ఉన్నా వారు రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌భావం చూప‌గ‌ల‌రా అంటే అనుమాన‌మే.

ఇదే స‌మ‌యంలో రాష్ట్రంలో బ‌లంగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి జ‌గ‌న్ ఛ‌రిష్మా, తెలుగుదేశం పార్టీకి చంద్ర‌బాబు నాయుడుకు ప్ర‌జ‌ల్లో ఉన్న గుర్తింపుతో ఆ రెండు పార్టీలూ బ‌లంగా ఉన్నాయి. అందుకే ఇప్పుడు జ‌గ‌న్‌, చంద్ర‌బాబుకు ధీటుగా ఒక బ‌ల‌మైన నేత‌ను త‌మ పార్టీ నుంచి ప్రొజెక్ట్ చేయాల‌ని బీజేపీ పెద్ద‌లు భావిస్తున్నారు. మొద‌ట మాజీ ముఖ్య‌మంత్రి కిర‌ణ్ కుమార్ రెడ్డిని పార్టీలోకి తీసుకుంటార‌ని అనుకున్నా అది వ‌ర్కౌట్ అవ్వ‌లేదు.

దీంతో ఇప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ వైపు బీజేపీ పెద్ద‌ల చూపు ప‌డింద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ విష‌యాన్ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా ధృవీక‌రించారు. అమెరికాలో జ‌రిగిన ప్ర‌వాసాంధ్రుల స‌మావేశంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఈ మేర‌కు రాష్ట్రంలో బీజేపీకి వ్యూహ‌క‌ర్త‌గా ఉన్న రామ్‌మాధ‌వ్ చ‌ర్చ‌లు జ‌రిపారు. బీజేపీతో క‌లిసి న‌డిస్తే మంచి భ‌విష్య‌త్ ఉంటుంద‌ని ఆయ‌న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు భ‌రోసా ఇచ్చారు.

ఇటీవ‌లి ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌న‌సేన పార్టీకి ఆరు శాతం ఓట్లు పోల‌య్యాయి. ఇవి ఆయ‌న వ్య‌క్తిగ‌త ఛ‌రిష్మాతో వ‌చ్చిన ఓట్లే. ఓ ప్ర‌ధాన సామాజ‌క‌వ‌ర్గం ఓట్ల‌ను ప‌వ‌న్ ప్ర‌భావితం చేయ‌గ‌ల‌ర‌నే అంచ‌నాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉభ‌య గోదావ‌రి, కృష్ణ‌, విశాఖ‌ప‌ట్నం జిల్లాల్లో ప‌వ‌న్ ప్ర‌భావం ఎక్కువగా ఉంటుంద‌ని బీజేపీ నేత‌లు సైతం గుర్తించారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ అయితే జ‌గ‌న్‌, చంద్ర‌బాబుకు స‌రైన ప్ర‌త్యామ్నాయంగా ఉంటార‌ని భావిస్తున్నారు. దీంతో ఆయ‌న‌ను బీజేపీలోకి రావాల్సిందిగా ఆహ్వానించిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

త‌న‌తో బీజేపీఈ చ‌ర్చుల జ‌రిపిన‌ట్లు ప‌రోక్షంగా క్లారిటీ ఇచ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ బీజేపీలో చేరేది లేద‌ని స్ప‌ష్టం చేశారు. అయితే, భ‌విష్య‌త్‌లో బీజేపీతో పొత్తు పెట్టుకునే అంశాన్ని మాత్రం ఆయ‌న కొట్టి పారేయ‌లేదు. తాను ఓట‌మికి సిద్ధ‌ప‌డే వ‌చ్చాన‌ని, 25 ఏళ్ల పాటు రాజ‌కీయం చేస్తాన‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ కార్య‌క‌ర్త‌ల‌కు ధైర్యం చెబుతున్నారు. దీంతో ఈ స‌మ‌యంలో ఆయ‌న పార్టీని బీజేపీలో విలీనం చేసే ప‌ని మాత్రం చేయ‌క‌పోవ‌చ్చు. ముఖ్యంగా గ‌తంలో ప్ర‌జారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశాక చిరంజీవికి రాజ‌కీయంగా క‌లిసి రాలేదు. అప్పుడు ఆయ‌న వేచి ఉంటే 2014 ఎన్నిక‌ల్లో మంచి అవ‌కాశం ఉండేదని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తారు.

 

దీంతో త‌న అన్న చేసిన త‌ప్పుడు ఇప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేయ‌క‌పోవ‌చ్చు. అయితే,బీజేపీకి ఇప్పుడు ప్ర‌ధాన టార్గెట్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా అధికారంలో ఉన్న వైసీపీని టార్గెట్ చేయ‌డం స‌హ‌జం. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి బీజేపీతో ప‌వ‌న్ క‌ళ్యాణ్ పొత్తు పెట్టుకునే అవ‌కాశాలు మాత్రం క‌నిపిస్తున్నాయి.


Sharat Bhamidi


With 5 years of experience in Digital Media, Sharat Bhamdi specialises in creating content for webistes, developing ad campaigns and social media campaigns. At NewsSting, he handles the video division where he brings in content through feature videos and interviews.
 sharat@rightfolio.co.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle