newssting
BITING NEWS :
*మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కార్యాలయంలో భారీ చోరీ*పాకిస్తాన్‌లో హైదరాబాద్‌ వాసి అరెస్ట్‌...అరెస్ట్‌ అయిన వ్యక్తి ప్రశాంత్‌ గా గుర్తింపు* రాజమండ్రి రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు*ఇవాళ సమ్మెపై తుది నిర్ణయం.. జడ్జిమెంట్‌ కాపీ చూశాక తుది నిర్ణయం.. సమ్మె యథాతథంగా కొనసాగుతుంది.. సడక్‌బంద్, రాస్తారోకోలు మాత్రం వాయిదా-అశ్వత్థామరెడ్డి*దీక్ష విరమించినా ఆర్టీసీ జేఏసీ ఆందోళన కొనసాగుతుంది-కోదండరాం*ఆర్టీసీ సమ్మెపై విచారణ ముగించిన హైకోర్టు *హైకోర్టుకు కొన్ని పరిమితులుంటాయి.. పరిధిదాటి ముందుకు వెళ్లలేం.. కార్మికశాఖ చూసుకుంటుంది.. 2 వారాల్లో సమస్య పరిష్కరించాలని సూచిస్తాం-హైకోర్టు

క‌న్న‌బాబుకి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌‌కి ఎక్కడ చెడింది?

04-11-201904-11-2019 08:12:21 IST
Updated On 04-11-2019 08:12:18 ISTUpdated On 04-11-20192019-11-04T02:42:21.533Z04-11-2019 2019-11-04T02:41:57.618Z - 2019-11-04T02:42:18.648Z - 04-11-2019

క‌న్న‌బాబుకి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌‌కి ఎక్కడ చెడింది?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తాను అన్నింటికీ సిద్ధ‌ప‌డే రాజ‌కీయాల్లోకి వ‌చ్చాన‌నేది జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎప్పుడూ చెప్పే మాట‌నే. త‌న‌పై విమ‌ర్శ‌ల‌ను ప‌ట్టించుకోన‌ని ఆయ‌న చెబుతుంటారు.

కానీ, ఒక్కోసారి ఆయ‌న విమ‌ర్శ‌లను అస్స‌లు భ‌రించ‌లేరు. ప్ర‌త్య‌ర్థి పార్టీల నుంచి త‌న‌పై ఎవ‌రెవ‌రు విమ‌ర్శ‌లు చేశారో, ఏమ‌ని విమ‌ర్శించారో గుర్తు పెట్టుకొని మ‌రీ బ‌హిరంగ స‌భ‌ల్లో ప‌వ‌న్ ఘాటుగా రిప్లై ఇస్తుంటారు.

విశాఖ‌ప‌ట్నంలో జ‌రిగిన జ‌న‌సేన లాంగ్ మార్చ్‌లోనూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇదే రిపీట్ చేశారు. వైసీపీ త‌ర‌పున త‌న‌ను ఎక్కువ‌గా విమ‌ర్శిస్తున్న వారిని ఈ వేదిక మీది నుంచి ప‌వ‌న్ క‌ళ్యాణ్ టార్గెట్ చేశారు.

అయితే, ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాష్ట్ర వ్య‌వ‌సాయ మంత్రి కుర‌సాల క‌న్న‌బాబుపై వ్య‌క్తిగ‌తంగానూ విమ‌ర్శ‌లు చేశారు. క‌న్న‌బాబు బ‌తుకంతా త‌న‌కు తెలుస‌ని, తానే రాజ‌కీయాల్లోకి తీసుకొచ్చాన‌ని చెప్పారు.

క‌న్న‌బాబును ప‌వ‌న్ విమ‌ర్శించ‌డం ఇదేమీ కొత్త కాదు. ఎందుకో గానీ క‌న్న‌బాబుపై ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు వ్య‌క్తిగ‌తంగా ధ్వేషం ఉన్న‌ట్లుగా ఆయ‌న మాట‌లు ఉంటాయి. గ‌తంలో జ‌గ‌న్ పాద‌యాత్ర తూర్పు గోదావ‌రి జిల్లాలో కొన‌సాగుతున్న స‌మ‌యంలోనే ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాకినాడ వెళ్లి క‌న్న‌బాబుపై విమ‌ర్శ‌లు గుప్పించారు. వాస్త‌వానికి అప్పుడు క‌న్నబాబు ఎమ్మెల్యే కూడా కాదు.

క‌న్న‌బాబు స్కూట‌ర్‌పై తిరిగేవాడ‌ని, ఆయ‌న ద‌గ్గ‌ర డ‌బ్బులు ఉండేవి కాద‌ని, ఆయ‌న అధ‌ముడు అంటూ, వైసీపీ చెంచా అని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. త‌న సోద‌రుడు చిరంజీవిని క‌న్న‌బాబు మోసం చేశార‌ని ఆయ‌న ఆరోపించారు.

తాను, నాగ‌బాబు క‌లిసి క‌న్న‌బాబును చిరంజీవికి ప‌రిచ‌యం చేయించామ‌ని చెప్పారు. త‌మ కనులుగ‌ప్పి క‌న్న‌బాబు ఎమ్మెల్యే అయ్యార‌ని ఆరోపించారు. ప్ర‌జారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో క‌ల‌ప‌డానికి కార‌ణం క‌న్న‌బాబు లాంటి వారే అని సైతం చెప్పారు.

త‌ర్వాత దీనికి క‌న్న‌బాబు గ‌ట్టి కౌంట‌ర్ కూడా ఇచ్చారు. ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ కాకినాడ రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంపై ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌త్యేక దృష్టి పెట్టారు. క‌న్న‌బాబును ఓడించ‌డ‌మే టార్గెట్‌గా ప‌వ‌న్ పెట్టుకున్నారు. కానీ, క‌న్న‌బాబు విజ‌యం సాధించి మంత్రి అయ్యారు.

చిరంజీవి ప్ర‌జారాజ్యం పార్టీ స్థాపించిన స‌మ‌యంలో క‌న్న‌బాబు జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేసేవారు. పార్టీ స్థాపించిన త‌ర్వాత ఉద్యోగాన్ని వ‌దిలి ఆయ‌న చిరంజీవితో ప‌నిచేశారు. అనూహ్యంగా ఆయ‌న‌కు ఎమ్మెల్యే టిక్కెట్ ద‌క్కి విజ‌యం సాధించారు.

2014 వ‌ర‌కు చిరంజీవితోనే ఉన్నారు. ఆ ఎన్నిక‌ల్లో ఇండిపెండెంట్‌గా పోటీచేసి రెండో స్థానంలో నిలిచారు. త‌ర్వాత ఆయ‌న జ‌న‌సేన పార్టీలోకి వెళ్ల‌కుండా వైసీపీలో చేరారు.

ఇటీవ‌లి ఎన్నిక‌ల్లో గెలిచి మంత్రి అయ్యారు. త‌న సోద‌రుడి వ‌ల్ల రాజ‌కీయాల్లోకి వ‌చ్చి ఎమ్మెల్యే అయ్యార‌న్న కోప‌మో, త‌మ కుటుంబం వ‌ల్ల ఎదిగి త‌న వెంట న‌డ‌వ‌లేద‌నే బాధ‌నో కానీ క‌న్న‌బాబు అంటే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు కోపం. ఆయ‌న ఏ మాత్రం త‌న‌ను విమ‌ర్శించినా ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌హించ‌లేరు.

మొన్న క‌న్న‌బాబు ప్రెస్‌మీట్ పెట్టి ప‌వ‌న్ త‌ల‌పెట్టిన లాంగ్‌మార్చ్‌ను విమ‌ర్శించారు. దీంతో విశాఖ‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌రోసారి క‌న్న‌బాబుపై విమ‌ర్శ‌లు చేశారు.

ఇదిలా ఉండ‌గా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు క‌న్న‌బాబుపై కోపం ఉన్నా చిరంజీవి మాత్రం ఆయ‌న‌తో స‌న్నిహితంగానే ఉంటారు. ఇటీవ‌ల క‌న్న‌బాబు సోద‌రుడు అకాల మ‌ర‌ణం చెందిన చిరంజీవి బిజీ షెడ్యూల్‌లోనూ ప్ర‌త్యేకంగా కాకినాడ వెళ్లి క‌న్న‌బాబును పరామ‌ర్శించి వ‌చ్చారు. క‌న్న‌బాబుకు కూడా చిరంజీవి అంటే చాలా అభిమాన‌మ‌ని ఆయ‌న ప‌లుమార్లు చెప్పుకున్నారు.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle