newssting
BITING NEWS :
* తూర్పుగోదావరి జిల్లా పెనికేరులో వింత జంతువు సంచారం..రాత్రివేళ పశువులను చంపేస్తున్న వింత జంతువు..తీవ్ర భయాందోళనలో స్థానికులు *నెల్లూరు జిల్లా కావలిలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి..ఆర్టీసీ డిపో ఆవరణలో ఉరివేసుకుని ఆత్మహత్య..ముసునూరుకి చెందిన బోయిన మాలకొండయ్య (50)గా గుర్తింపు*జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హై కోర్టు పనిచేస్తోందని, జడ్జి లను దూషిస్తూ సోషల్ మీడియా లో పలు పోస్టింగ్ లు.సుమోటోగా తీసుకొని విచారించి చర్యలు తీసుకోవాలని హై కోర్టుకు లేఖ రాసిన సీనియర్ న్యాయవాది లక్ష్మినారాయణ. *ఓయూలో ఉద్రిక్తత..ఓయూ భూముల పరిశీలన కు వచ్చిన ఉత్తమ్, భట్టి , విహెచ్, ఓయూ భూములు కబ్జా అవుతుంటే ప్రభుత్వం ఏమి చేస్తుందని ఫైర్..కాంగ్రెస్ కు మద్దతుగా ఓయూ విద్యార్థుల ఆందోళన..రంగంలోకి పోలీసులు* భారత్‌లో గత 24 గంటల్లో కొత్తగా, 6,767 కరోనా కేసులు నమోదు.. 147 మంది మృతి, దేశవ్యాప్తంగా 1,31,868 కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్పటి వరకు 3,867 మంది మృతి..యాక్టివ్ కేసులు 73,560..కోలుకున్న వారు 54,441*తెలంగాణలో 52 కొత్త కరోనా కేసులు..1,813కు చేరిన కరోనా కేసులు సంఖ్య, ఇప్పటి వరకు 49 మంది మృతి..యాక్టివ్ కేసులు 696

క‌డ‌ప గ‌డ‌ప‌లో తొలి విజ‌యం దిశ‌గా బీజేపీ..!

29-09-201929-09-2019 16:49:20 IST
Updated On 30-09-2019 14:54:26 ISTUpdated On 30-09-20192019-09-29T11:19:20.068Z29-09-2019 2019-09-29T11:05:41.399Z - 2019-09-30T09:24:26.545Z - 30-09-2019

క‌డ‌ప గ‌డ‌ప‌లో తొలి విజ‌యం దిశ‌గా బీజేపీ..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇటీవ‌ల కాలంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ కేంద్రంగా బీజేపీ నేత‌ల హ‌డ‌రావుడి పెరిగింది. కేంద్ర‌, రాష్ట్ర స్థాయి నేత‌ల ప‌ర్య‌ట‌న‌లు అందుకు అద్దం ప‌డుతున్నాయి. మీడియా స‌మావేశాలు పెడుతూ పార్టీ విధి విధానాల‌ను పూర్తి స్థాయిలో ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లేందుకు త‌మ‌వంతుగా ప్ర‌య‌త్నాల‌ను ముమ్మ‌రం చేస్తున్నారు. అందులోను ఈ మ‌ధ్య‌కాలంలో బీజేపీ స‌మావేశాలూ పెరిగాయి. ప్ర‌తి స‌మావేశానికి బీజేపీ కేంద్ర నేత‌ల‌తోపాటు రాష్ట్ర నేత‌లు ముఖ్యంగా క‌డ‌ప‌కు రాక‌పోక‌ల‌ను కొన‌సాగిస్తూవ‌స్తున్నారు.

రాయ‌ల‌సీమ న‌డిబొడ్డున ఉన్న క‌డ‌ప కేంద్రంగా బీజేపీ చేస్తున్న హ‌డావుడి ఇప్పుడు అంద‌రిలోను ఎన్నో సందేహాలు రేకెత్తించేలా ఉంది. గ‌తంలో వైసీపీతో బీజేపీ సంబంధాలు నెరుపుతుందంటూ వ‌చ్చిన విమ‌ర్శ‌లు ఇప్పుడు ప‌టాపంచ‌లైపోయాయా..?  టీడీపీ, బీజేపీల స్నేహం మ‌ళ్లీ చిగురించిందా..? అంటూ కొంద‌రు రాజ‌కీయ ప‌రిశీల‌కులు ఆరా తీయ‌డం చేస్తున్నారు.

కేంద్రం ఇచ్చిన ఆదేశాల‌ను కూడా పెడ చెవిన పెడుతున్న సీఎం వైఎస్ జ‌గ‌న్‌ను సొంత జిల్లాలోనే క‌ట్టడి చేయాల‌ని బీజేపీ కేంద్ర నాయ‌క‌త్వం ఆలోచిస్తున్న‌ట్టుగా ఉంద‌ని ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఈ మేర‌కు పార్టీ రాష్ట్ర నాయ‌క‌త్వానికి స్ప‌ష్ట‌మైన దిశానిర్దేశం చేస్తుంద‌ట బీజేపీ.

గ‌త ఎన్నిక‌ల్లో చావుదెబ్బ తిన్న టీడీపీని ప్ర‌జ‌ల్లో ఇంకా పాపులారిటీ ఉన్న కాంగ్రెస్ నేత‌ల‌కు గాలం వేయ‌డం ద్వారా సీఎం దూకుడుకు చెక్ పెట్టాల‌ని బీజేపీ నాయ‌క‌త్వం వ‌చ్చింద‌ని, అందులో భాగంగా ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌కు తెరతీసిన క‌మ‌ల‌ద‌ళం ప్ర‌స్తుతం ఇత‌ర పార్టీ నేత‌ల‌కు గాలం వేసే ప‌నిలో బిజీగా ఉందని స‌మాచారం. అందులో భాగంగానే జిల్లాలో టీడీపీతో అంటీఅంట‌న‌ట్టు ఉన్న నేత‌ల‌ను కేడ‌ర్‌కు అక్కున చేర్చుకునే ప‌నిలో బీజేపీ పెద్దక‌స‌ర‌త్తే చేస్తోంది.

ఇప్ప‌టికే రాజ్య‌స‌భ స‌భ్యుడు సీఎం ర‌మేష్‌ను పార్టీలో చేర్చుకున్న బీజేపీ మాజీ మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డితోపాటు మాజీ ఎమ్మెల్యేలు వీర‌శివారెడ్డి, వ‌ర‌ద‌రాజులురెడ్డిల‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతున్నారు. వీరిలో మాజీ మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి చేరిక ఇటీవ‌లె జ‌ర‌గాల్సి ఉన్నా భారీగా చేరిక‌లు జ‌రిగాక క‌డ‌ప కేంద్రంగా బ‌హిరంగ స‌భ నిర్వ‌హించి అంద‌ర్నీ ఒకేసారి పార్టీలో చేర్చుకోవాల‌ని క‌మ‌ల‌ద‌ళం వ్యూహం రూపొందించిన‌ట్టు రాజ‌కీయ విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ చివ‌రి ముఖ్య‌మంత్రి న‌ల్లారి కిర‌ణ్‌కుమార్‌రెడ్డితో సంప్ర‌దింపులు జ‌రుపుతున్న క‌మ‌ల‌నాధులు ఆయ‌న ద్వారా వ‌ల‌స‌ల‌ను ప్రోత్స‌హించాల‌న్న నిర్ణ‌యానికొచ్చార‌ని, దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ముఖ్య అనుచ‌రుల‌ను క‌మ‌లం గూటికి చేర్చే బాధ్య‌త‌ను కిర‌ణ్‌కుమార్‌రెడ్డికి అప్ప‌గించ‌నున్న‌ట్టు స‌మాచారం. ఈ మేర‌కు చ‌ర్చ‌లు కూడా పూర్త‌య్యాయ‌ని, క‌డ‌ప కేంద్రంగానే రాజ‌కీయ ఎత్తుగ‌డలు వేయాల‌ని బీజేపీ అధినాయ‌క‌త్వం నిర్ణ‌యించింది. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో క‌డ‌ప కేంద్రంగా తొలి విజ‌యం న‌మోదు చేయాల‌ని భావిస్తున్న బీజేపీ ప‌న్నుతున్న వ్యూహాల‌ను వైసీపీ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి మ‌రీ..!

భీమవరం ఆక్వాపరిశ్రమలలో వలస కార్మికుల అష్టకష్టాలు

భీమవరం ఆక్వాపరిశ్రమలలో వలస కార్మికుల అష్టకష్టాలు

   18 hours ago


రియల్ మహర్షి... పొలంలో నాట్లు, కాడెద్దులతో దుక్కిదున్నిన ఎస్పీ

రియల్ మహర్షి... పొలంలో నాట్లు, కాడెద్దులతో దుక్కిదున్నిన ఎస్పీ

   20 hours ago


కెమికల్స్ ఫ్యాక్టరీలో లీకేజీ ... పదిమంది కంటి చూపునకు ప్రమాదం

కెమికల్స్ ఫ్యాక్టరీలో లీకేజీ ... పదిమంది కంటి చూపునకు ప్రమాదం

   20 hours ago


లాక్ డౌన్ ఉల్లంఘనులకు జగన్ ఆఫర్

లాక్ డౌన్ ఉల్లంఘనులకు జగన్ ఆఫర్

   21 hours ago


డోసు పెంచిన కమలనేతలు.. ప్రభుత్వంపై గవర్నరుకు ఫిర్యాదు!

డోసు పెంచిన కమలనేతలు.. ప్రభుత్వంపై గవర్నరుకు ఫిర్యాదు!

   21 hours ago


ప్రయాణికులకు గుడ్ న్యూస్.... తెలుగు రాష్ట్రాల్లో రిజర్వేషన్ కౌంటర్లివే

ప్రయాణికులకు గుడ్ న్యూస్.... తెలుగు రాష్ట్రాల్లో రిజర్వేషన్ కౌంటర్లివే

   21 hours ago


శ్రీవారి అస్తులకే ఎసరు.. అమ్మకానికి సిద్ధమైన టీటీడీ!

శ్రీవారి అస్తులకే ఎసరు.. అమ్మకానికి సిద్ధమైన టీటీడీ!

   21 hours ago


చరిత్రలో కలిసిపోయిన మూడులాంతర్ల స్థూపం.. విమర్శల పర్వం

చరిత్రలో కలిసిపోయిన మూడులాంతర్ల స్థూపం.. విమర్శల పర్వం

   23-05-2020


వరద రోజుల్లో వాడుకున్న నీటిని కోటాలో కలిపేస్తారా.. కృష్ణా బోర్డుపై ఏపీ గుస్సా

వరద రోజుల్లో వాడుకున్న నీటిని కోటాలో కలిపేస్తారా.. కృష్ణా బోర్డుపై ఏపీ గుస్సా

   23-05-2020


ఇప్పుడు జూనియ‌ర్‌పైనే ఆశ‌లు పెంచుకుంటున్నారా..?

ఇప్పుడు జూనియ‌ర్‌పైనే ఆశ‌లు పెంచుకుంటున్నారా..?

   23-05-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle