newssting
Radio
BITING NEWS :
కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై సస్పెన్స్‌కు తెరపడింది. బీఎస్‌ యడియూరప్ప సోమవారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ సాయంత్రం గవర్నర్‌ను కలిసి రాజీనామాను సమర్పించనున్నారు. రాజీనామాపై ఆయన స్పందిస్తూ.. ‘‘ రాజకీయ జీవితంలో ఎన్నో అగ్నిపరీక్షలు ఎదుర్కొన్నా. కర్ణాటక అభివృద్ధి కోసం చాలా చేశా. 75 ఏళ్లు దాటినా నాకు రెండేళ్ల పాటు అవకాశం ఇచ్చారు. అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తా’’ అని అన్నారు. * ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా సోమవారం 2,128 కోవిడ్‌ టీకా కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ అందిస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల కోవిడ్‌ వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. * చరిత్రలోనే మొట్టమొదటిసారి మన తెలుగు సంపద అయిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన రామప్ప ఆలయానికి ఐక్యరాజ్య సమితి విద్య, విజ్ఞాన (పరిశోధన), సాంస్కృతిక సంస్థ (యునెస్కో) ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా కోసం 2015లోనే ప్రయత్నాలు మొదలయ్యాయి. * టోక్యో ఒలింపిక్స్‌లో జపాన్‌కి చెందిన మోమిజీ నిషియా సంచలనం సృష్టంచింది. ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన రెండో అతి పిన్న వయస్కురాలిగా రికార్డు క్రియాట్‌ చేసింది. టోక్యో ఒలింపిక్స్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన స్కేట్‌బోర్డింగ్ లో నిషియా స్వర్ణ పతకం సాధించింది. * ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌ పూరి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘చోర్‌ బజార్‌’’. ‘దళం, జార్జ్‌ రెడ్డి’ చిత్రాల ఫేమ్‌ జీవన్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. గెహనా సిప్పీ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

క్వారంటైన్‌లో సౌకర్యాల్లో ఏపీ ది బెస్ట్: బ్రిటన్ ప్రొఫెసర్ ప్రశంసలు

18-04-202018-04-2020 13:52:02 IST
Updated On 18-04-2020 14:35:01 ISTUpdated On 18-04-20202020-04-18T08:22:02.376Z18-04-2020 2020-04-18T08:22:00.419Z - 2020-04-18T09:05:01.431Z - 18-04-2020

క్వారంటైన్‌లో సౌకర్యాల్లో ఏపీ ది బెస్ట్: బ్రిటన్ ప్రొఫెసర్ ప్రశంసలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
క్వారంటైన్ అనగానే మనందరికీ గుర్తుకొచ్చేది కరోనా వైరస్ జ్ఞాపకాలు మాత్రమే. అంతగా ప్రపంచాన్ని భయపెట్టేస్తోందది. కానీ కరోనా పాజిటివ్ అని పరీక్షల్లో తేలిన తర్వాత రెండువారాల పాటు క్వారంటైన్ కేంద్రాల్లో ఉండవలసి వస్తున్న వారికి ఆ ఒంటరితనం, ఏకాంతం దుర్భరంగానే ఉంటుంది. అయితే క్వారంటైన్‌ కేంద్రంలో సరైన వసతులు ఏర్పరిస్తే రోగి తన మానసిక ఆందోళనలను తగ్గించుకుని స్వస్థత పొందటానికి వీలుంటుంది. సరిగ్గా ఒక విదేశీయుడికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. సొంత ఇంట్లో కూడా క్వారంటైన్‌లో ఉన్నంత సౌకర్యం ఉండదని, కరోనా రోగులు క్వారంటైన సేవలను ఉపయోగించుకోవాలని ఆ విదేశీయుడు మరీమరీ కోరుతున్నారు. ఆయన చెప్పిందాన్ని బట్టే క్వారంటైన్ లోపల ఎలా ఉంటుందనేది మొదటిసారి బయట ప్రపంచానికి అనుభవంలోకి వచ్చింది.

శ్రీవారి దర్శనం కోసం తిరుపతికి వచ్చి లాక్‌డౌనే నేపథ్యంలో ఇరుక్కుపోయిన ఆ ప్రొఫెసర్ ఆంధ్రప్రదేశ్ రాష్టంలో కరోనా రోగులకు క్వారంటైన్‌లో లభిస్తున్న సౌకర్యాలు చూసి ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. 22 రోజులపాటు క్వారంటైన్‌లో ఉండిపోయిన ఆయన విదేశాల్లో కూడా చూడని సౌకర్యాలను రాష్ట్రంలోని క్వారంటైన్ కేంద్రాల్లో చూశానని పొగిడారు. పైగా స్టార్ హోటల్స్‌ని తలపించేలా క్వారంటైన్‌లో వసతి సౌకర్యాలు ఉన్నాయని ప్రశంసల వర్షం కురిపించారు.

వివరాల్లోకి వెళితే... క్లైవ్ కుల్లీ ఒక బ్రిటన్ ప్రొఫెసర్. తిరుమల శ్రీవారి దర్శనం కోసం మార్చి 23న తిరుపతి వచ్చారు. అయితే ఆ తర్వాతి రోజు కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్ డౌన్‌ ప్రకటించడంతో ఎటూ పోలేక ఇరుక్కుపోయారు. ఇక వసతి సౌకర్యాలు కూడా లేక బిక్కచచ్చిపోయిన ఆ ప్రొఫెసర్  తిరుపతి పక్కనే ఉన్న తిరుచానూరులోని శ్రీ పద్మావతీ నిలయంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రంలో 22 రోజులపాటు గడిపారు. అనంతరం నిర్వహించిన పరీక్షల్లో కరోనా నెగిటివ్‌గా తేలడంతో బ్రిటన్‌ వెళ్లేందుకు అనుమతి లభించింది. ఎలాగోలా బ్రిటన్ చేరిన ఆయన తిరుచానూరు క్వారంటైన్‌లో ఏపీ ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలు, వైద్య సేవలు అత్యత్తమంగా ఉన్నాయంటూ కొనియాడారు.

మధుర స్మృతులతో బ్రిటన్‌కి తిరిగి వెళుతూ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. విదేశాల్లోనూ చూడని సౌకర్యాలు తిరుచానూరు క్వారంటైన్‌లో చూశానని, అక్కడి వైద్య సిబ్బింది, అధికారుల ఆప్యాయతను మరవలేనని చెబుతున్న ప్రొఫెసర్ క్లైవ్ కెల్లీ చెప్పిన విశేషాలను చూద్దాం. 

"నా స్వస్థలం యూకేలోని బేబింగ్‌టన్‌ అనే చిన్న పట్టణం. వృత్తి రీత్యా జాగ్రఫీ ప్రొఫెసర్‌ని. విదేశాలను సందర్శించడం నా హాబీ. ప్రధాన దేవాలయాలు, చారిత్రక కట్టడాలు, విదేశాల సంస్కృతిని ప్రత్యక్షంగా గమనిస్తుంటా. తిరుమల శ్రీవారి దేవాలయాన్ని చూడాలనిపించి భారత్‌కు వచ్చా. మార్చి 23న తిరుపతి చేరుకున్న మరుసటిరోజే భారత్‌లో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించారు. దీంతో నన్ను క్వారంటైన్‌ కేంద్రానికి తరలించారు. అక్కడ 22 రోజులు ఉన్నా. నేను ఊహించిన దానికి, క్వారంటైన్‌లో పరిస్థితికి ఎంతో వ్యత్యాసం వుంది. విదేశాల్లో కూడా ఈ సౌకర్యాలను చూడలేదు. స్టార్‌ హోటల్స్‌ను తలపించేలా క్వారంటైన్‌లో వసతి సౌకర్యాలు ఉన్నాయి...

వైద్య సిబ్బంది సేవలు, అధికారుల ప్రేమానురాగాల మధుర స్మతులతో స్వదేశానికి తిరిగి వెళ్తున్నా. వారి సేవ, ఆప్యాయత తలచుకుంటే కళ్లు చెమ్మగిల్లుతున్నాయి. నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేవరకు నిత్యం ప్రతి 30 నిమిషాలకు ఒకసారి నా గదికి వచ్చి ఆరోగ్యం గురించి ఆరా తీశారు. సిబ్బంది ప్రవర్తన, ప్రేమ మరువలేనివి. రక్త సంబంధీకులు కూడా ఇంత సేవ చేయలేరు. వారికి హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నా. మరోసారి భారత్‌కు వచ్చినప్పుడు వారిని తప్పకుండా కలుస్తా...

క్వారంటైన్‌ కేంద్రంలో నాణ్యమైన ఆహారంతోపాటు హాట్‌వాటర్, టీ, కాఫీ, కంపెనీ వాటర్‌ బాటిల్స్‌ అందించారు. నిత్యం గదిని శానిటైజర్స్‌తో శుభ్రపరుస్తూ దుప్పట్లు, టవళ్లు మార్చారు. తాజా కూరగాయలతో వండిన ఆహారం, పలు రకాల పండ్లు అందించారు. రోజుకు రెండుసార్లు స్నాక్స్, బిస్కెట్లు ఇచ్చారు. వైద్యులు సూచించిన పౌష్టికాహారాన్ని గది వద్దే అందించారు. క్వారంటైన్‌లో ఉండేవారి కోసం వాట్సాప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేశారు. ఏ అవసరం వచ్చినా మెసేజ్‌ చేస్తే సిబ్బంది వెంటనే వచ్చేవారు....

క్వారంటైన్‌ కేంద్రంలో అందించే సౌకర్యాలు మన ఇంట్లో కూడా ఉండవు. ఒకసారి ఇక్కడకు వచ్చాక తిరిగి ఇంటికి వెళ్లాలన్నా సంకోచిస్తారు. అనుమానితులు క్వారంటైన్‌కు స్వచ్ఛందంగా వెళ్లి అధికారులకు సహకరించండి. రెండు సార్లు నిర్వహించిన పరీక్షల్లో కరోనా నెగిటివ్‌గా రావడంతో నన్ను డిశ్చార్జి చేసి రూ.2 వేలు నగదు ఇచ్చారు. ట్రీట్‌మెంట్, మంచి వసతి సౌకర్యాలు కల్పించి నగదు సాయం చేయడం అభినందనీయం. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌ నుంచి బ్రిటన్‌ వెళ్లేందుకు ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశారు. అందులో ప్రయాణించేందుకు క్వారంటైన్‌ కేంద్రం అధికారులు నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ జారీ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మా స్వస్థలానికి వెళ్తున్నా అందరికీ వీడ్కోలు'' అంటూ ఆ ప్రొఫెసర్ చెమర్చిన కళ్లతో స్వదేశానికి పయనమయ్యారు.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle