newssting
BITING NEWS :
* దేశంలో కరోనా పాజిటివ్ బాధితుల సంఖ్య 1,51,767.. 4337 మరణాలు * ప్రభుత్వ భూములు అమ్మేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో 474 సస్పెండ్ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ వేసిన డాక్టర్ శైలజ *లాక్‍డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ చంద్రబాబుపై పిటిషన్‍ను హైకోర్టులో విచారణ *విశాఖ ఎల్జీ పాలిమర్స్ మృతులకు మహానాడు నివాళి. మృతుల కుటుంబాలకు పార్టీ తరఫున రూ50వేల ఆర్ధిక సాయం ప్రకటించిన చంద్రబాబు *ఎల్జీ పాలిమర్స్ వ్యవహారం పై హైకోర్టులో విచారణ *సీఆర్డీఏ చట్టం, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు పై ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు లో విచారణ.. జూలై 22 కి వాయిదా *గురువారం తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలక సమావేశం *ఏపీలో మరో 68 కరోనా కేసులు.. మొత్తం కేసులు 2787 *తెలంగాణలో 71 పాజిటివ్ కేసులు .... ఇప్పటి వరకు 1991 కేసులు*ఎల్జీ పాలిమర్స్ ఘటనలో 13కు చేరిన మృతుల సంఖ్య .. అస్వస్థతకు గురై ఆస్పత్రి నుంచి డిశ్చార్జయిన వెంకాయమ్మ..మరోసారి తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో మృతి

క్యూలో జనం ..రేషన్..కరోనా పరేషాన్

04-04-202004-04-2020 12:46:30 IST
Updated On 04-04-2020 14:07:28 ISTUpdated On 04-04-20202020-04-04T07:16:30.028Z04-04-2020 2020-04-04T07:16:22.016Z - 2020-04-04T08:37:28.221Z - 04-04-2020

క్యూలో జనం ..రేషన్..కరోనా పరేషాన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా మహమ్మారి మనదేశంలో మరింత విజృంభిస్తూనే ఉంది. ఢిల్లీలోని జమాత్‌ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన 16మంది హిందూపూర్ వాసులకు కరోనా వైద్య పరీక్షలు నిర్వహించగా నెగిటివ్‌ అని వచ్చినట్లు వైద్య అధికారులు తెలిపారు. వారందర్నీ ఇదివరకే క్వారంటైన్‌కు తరలించిన విషయం తెలిసిందే. వీరందరికి నెగిటివ్‌ రావడంతో పట్టణ ప్రజలు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా హిందూపురంలో ఓ మహిళకు పాజిటివ్‌ వచ్చిన విషయం తెలిసిందే. ఆమె బంధువులు, ఆమెను కలిసిన 19మందికి  కూడా వైద్య పరీక్షల కోసం నమూనాలను సేకరించి అనంతపురం పంపారు.

వీటి ఫలితాలు రావాల్సి వుంది.  కృష్ణా జిల్లా విజయవాడలో తొలి కరోనా మరణం చోటు చేసుకుంది. ఢిల్లీ మత ప్రార్థనకు వెళ్లొచ్చిన యువకుడి నుంచి అతడి తండ్రికి కరోనా సోకడంతో ఆయన మృతి చెందాడు. ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది వైద్య ఆరోగ్య శాఖ. తాజా కేసులతో ఏపీలో 180 కి చేరాయి కరోనా పాజిటివ్ కేసులు. ఇటు కృష్ణాజిల్లా లో 27కి చేరాయి కేసులు. 

ఒకవైపు కరోనా లాక్ డౌన్.. ఇంట్లో సరుకులు నిండుకున్నాయి. ఏం చేయాలో జనానికి అర్థం కావడంలేదు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రేషన్ బియ్యం, కందిపప్పులాంటి నిత్యావసరాలను పంపిణీ చేస్తోంది. అయితే కరోనా భయంతో జనం బయటకు రావడానికి జంకుతున్నారు. ఏపీ వ్యాప్తంగా జనం రేషన్ షాపుల ముందు బారులు తీరారు. నెల్లూరు జిల్లాలో సామాజిక దూరం అంటూ వృద్ధులను,వికలాంగులను గంటల తరబడి నిలబెడుతున్నారు రేషన్ డీలర్లు. దీంతో ముప్పతిప్పలు తప్పడంలేదు.

వేలిముద్రలు అవసరం లేదని పౌరసరఫరాల మంత్రి కొడాలి నాని మొదలు,సిఎం వరకు చెబుతున్నా రేషన్ కోసం పరేషాన్ తప్పడం లేదు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలో ఏరేషన్ షాపు ముందు చూసినా జనమే. కరోనా వైరస్ కారణంగా అత్యవసరమైతేనే బయటకు రావాలని అధికారులు ఆదేశాలు ఉన్నప్పటికి ప్రభుత్వ చౌక దుకాణాలలో సరుకులు తీసుకోవాలంటే ఉన్న ప్రాణం పోయే అంత పరిస్థితి ఏర్పడింది.

జనం క్యూలో నిలుచున్నా సర్వర్లు పనిచేయకపోవడంతో వృద్ధులు నిలబడలేక అవస్థలు పడుతున్నారు. గంటల తరబడి సామాజిక దూరం అంటూ నిలబెట్టడంతో సహనం కోల్పోతున్నారు. మరోపక్క కరోనా వైరస్ భయంతో ఆందోళన చెందుతున్నారు మహిళలు. రాష్ట్ర ప్రభుత్వం గత నెల 29వ తారీఖు నుండి రేషన్ సరుకులు పంపిణీ చేయమని ఆదేశాలు ఇచ్చినప్పటికీ రోజుకి 50 నుండి 60 మందికి మాత్రమే రేషన్ సరుకులు అందుతున్నాయి. లాక్ డౌన్ ఉండడం వలన రోజువారి కూలి చేసుకుని జీవనం సాగిస్తున్న వారి పరిస్థితి దారుణంగా ఉంది రేషన్ కార్డులు లేని గిరిజనులకు రేషన్ అందడం లేదు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle