newssting
BITING NEWS :
*అక్రమ వలసదారులను పంపిస్తాం: హోం మంత్రి అమిత్ షా *నేడు, రేపు తెలంగాణ శాసనసభ.. రేపు మండలి సమావేశాలు *మున్సిపల్‌ చట్టాల బిల్లును ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం *22న నింగిలోకి.. చంద్రయాన్‌–2 *కర్నాటకలో ఇవాళ కుమారస్వామి ప్రభుత్వ విశ్వాసపరీక్ష * కుల్ భూషణ్ కి రిలీఫ్.. పాక్ విధించిన మరణశిక్షను రద్దుచేసిన అంతర్జాతీయ న్యాయస్థానం * కర్నాటక అసెంబ్లీకి వెళ్లే ప్రసక్తే లేదు: రెబల్స్‌ *తిరుమలలో ఎల్1, ఎల్ 2, ఎల్ 3 దర్శనాలు రద్దు *ముంబయి పేలుళ్ల సూత్రధారి సయీద్‌ అరెస్టు

కౌంట్ డౌన్ .... యుద్ధానికి నేతల రె ‘ఢీ’

11-03-201911-03-2019 07:34:04 IST
Updated On 11-03-2019 12:59:09 ISTUpdated On 11-03-20192019-03-11T02:04:04.733Z11-03-2019 2019-03-11T01:53:18.858Z - 2019-03-11T07:29:09.377Z - 11-03-2019

కౌంట్ డౌన్ .... యుద్ధానికి  నేతల రె ‘ఢీ’
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలుగు రాష్ట్రాల కీలక నేతలకు గుండె చప్పుళ్ళు...బీపీ లెవెల్స్ పెరిగిపోతున్నాయి. ఎన్నికలకు కౌంట్ డౌన్ ప్రారంభం అయింది. సరిగ్గా నెలరోజుల్లో కీలక ఎన్నికల యుద్ధం జరగనుంది. లోక్‌సభతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకటించింది. ‘తాంబూలాలిచ్చాం తన్నుకుచావండి’ అన్నట్టుగా నోటిఫికేషన్ ఇవ్వడంతో నేతలు తమ యుద్ధ తంత్రాలకు పదును పెడుతున్నారు. మొదటి దశలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లోనే తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి. ఇరు రాష్ట్రాల్లో ఏప్రిల్‌ 11న ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు అప్పుడే జరగనున్నాయి. 

తెలంగాణలో ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఏప్రిల్‌ 11న ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్‌సభ నియోజక వర్గాలతో పాటు, తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు జరుగుతాయి. 2014లో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను మార్చి మొదటి వారంలోనే ప్రకటించారు.

అంతేగాక, అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో ఏడు, ఎనిమిదో దశల్లో ఎన్నికలు జరిగాయి. అంటే సార్వత్రిక ఎన్నికలను ఈ ఇరు ప్రాంతాల్లోని 42 లోక్‌సభ సీట్లకు రెండు విడతలుగా నిర్వహించారు. ఈసారి మాత్రం రెండురాష్ట్రాల ఎన్నికలు అన్నిటికంటే ముందే జరగనున్నాయి. 

గతంలో కంటే 19 రోజుల ముందే  ఎన్నికలు జరగబోతున్నాయి. తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజక వర్గాల్లో ఏప్రిల్‌ 30, 2014న ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు ఏప్రిల్ 11న జరుగుతాయి. రెండో దశలో సీమాంధ్ర ప్రాంతంలో మే 7, 2014న ఎన్నికలు జరిగాయి. 2014లో మొదటి దశ ఎన్నికలు ఏప్రిల్‌ 7 నుంచి ప్రారంభం కాగా, తెలంగాణలో ఏడో దశలో, ఆంధ్రప్రదేశ్‌లో ఎనిమిదో దశలో జరిగాయి.

షెడ్యూలు ప్రకటనకు, ఎన్నికల తేదీలకి మధ్య చాలా సమయం ఉండడంతో ఇరు రాష్ట్రాల్లోని పార్టీలు ఎటువంటి తొందర పాటు లేకుండా అన్ని వ్యవహారాలను చూసుకున్నాయి. అయితే, ఈ సారి మాత్రం షెడ్యూలు విడుదలకు, పోలింగ్‌ తేదీకి మధ్య కేవలం నెల రోజులు మాత్రమే సమయం ఉండడం నేతల్ని టెన్షన్ పెడుతోంది. 

మరో ఎనిమిది రోజుల్లో (మార్చి 18న) ఎన్నికల నోటిఫికేషన్‌  రాబోతోంది. ఇప్పటికే ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో హడావిడి పథకాల ప్రకటనకు, ప్రారంభోత్సవాలకు అడ్డుకట్ట పడింది. అభ్యర్ధుల ఎంపిక, ప్రచార వ్యూహాలు మార్చి 11 నుంచే వేగవంతం చేయాలి. పోలీసుల తనిఖీలు కూడా కఠినతరం కావడంతో పార్టీలు ఎన్నికల వ్యూహరచనకు సిద్ధపడుతున్నాయి.

ఈ ఎన్నికలు ఏపీలో చంద్రబాబు, జగన్, పవన్ లకు అగ్నిపరీక్ష కానున్నాయి. తెలంగాణలో మాత్రం తమ దూకుడు కొనసాగుతోందని గులాబీనేతలు ధీమాతో వున్నారు. టీఆర్ఎస్ పార్టీకి గట్టిపోటీ ఇస్తామంటోంది కాంగ్రెస్.  


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle