newssting
BITING NEWS :
*అమరావతి: ముగిసిన బీఏసీ సమావేశం... మూడు రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం*రాజధాని ప్రకటనకు ముందు గుట్టుచప్పుడు కాకుండా టీడీపీ నేతలు భూములు కొన్నారు... గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 4070 ఎకరాలు తేలింది, కంతేరు గ్రామంలో చంద్రబాబు 14.2 ఎకరాలు కొన్నారు-మంత్రి బుగ్గన *అసెంబ్లీ వికేంద్రీకరణ బిల్లు ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి బుగ్గన *మూడురాజధానులకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ *అమరావతి, విశాఖలో మంత్రులు అందుబాటులో ఉంటారు.. స్థానిక జోన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.. నాలుగు జిల్లాలకు కలిపి జోనల్ డెవలప్‌మెంట్ బోర్డు, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే బిల్లు ఉద్దేశం-మంత్రి బుగ్గన*సీఆర్డీఏ రద్దు బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి బొత్స, మూడు రాజధానుల ప్రతిపాదలను బిల్లులో పేర్కొన్న ప్రభుత్వం*రంగారెడ్డి జిల్లా: షాద్‌నగర్‌లో చిరుత కలకలం.. ఓ ఇంటిపై చిరుత సంచారం, భయాందోళనలో స్థానికులు*ఛలో అసెంబ్లీకి అమరావతి జేఏసీ పిలుపు.. మద్దతు ప్రకటించిన టీడీపీ, సీపీఐ.. టీడీపీ ఎమ్మెల్యేలు*బెంగళూరు వన్డేలో టీమ్ ఇండియా విజయం. 3 వన్డేల సీరీస్ ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న టీమ్ ఇండియా

కోవర్టులా? కోరుకున్న స్నేహితులా? -2

21-06-201921-06-2019 23:03:48 IST
Updated On 22-06-2019 09:38:53 ISTUpdated On 22-06-20192019-06-21T17:33:48.168Z21-06-2019 2019-06-21T17:33:44.837Z - 2019-06-22T04:08:53.562Z - 22-06-2019

కోవర్టులా? కోరుకున్న స్నేహితులా? -2
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
(మొదటి భాగం తరువాయి)

పెట్టుబడిదారులే ప్రజాప్రతినిధులైతే వారు ముందుగా తమ వ్యాపార ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తారనేది కాదనలేని నిజం. గతంలో ఎన్టీఆర్ తటస్ఠులు, వృత్తి నిపుణులు, వివిధ రంగాల్లో పేరొందిన ప్రముఖులను గుర్తించి రాజకీయాల్లోకి తీసుకొచ్చి పదవులు ఇచ్చేవారు. క్రమేణా ఆ సంస్కృతి పోయి సొంత ప్రయోజనాలు ఆశించి వచ్చే బడా పారిశ్రామికవేత్తలు, సంపన్నవర్గాలకు  టిక్కెట్లు ఇవ్వడం, పదవుల్ని కట్టబెట్టడం మొదలయ్యింది. పదవుల ఎంపిక ప్రక్రియలో అసలు చంద్రబాబు శైలి వేరు. పార్టీ వ్యవస్థాపకుడిలా కాకుండా ఆయన తన సహజ ధోరణిని అనుసరిస్తారు.

‘సామాజిక సేవ’ను ప్రామాణికంగా తీసుకోకుండా సామాజిక వర్గాల లెక్కల ఆధారంగా చంద్రబాబు ఎంపిక ప్రక్రియ ఉంటుంది. సాధారణంగా ఒక అభ్యర్థిని ఎంపిక చేయాలంటే ఆయన కట్టే లెక్కల్లో అంతుచిక్కని ఎన్నో కోణాలు దాగుంటాయి. అనేక రోజులు ఆ ఎంపిక ప్రక్రియను నాన్చి చివరికి పార్టీలో ముఖ్యుల్ని సమావేశపరచి వారి ముందుంచుతారు.

వారు సహజంగానే అభ్యర్థుల ఎంపిక బాధ్యతను అధినేతకు అప్పజెబుతున్నట్టు ఒక తీర్మానం చేస్తారు. చివరికి ఏ అర్ధరాత్రి ముహూర్తంలోనే చంద్రబాబు నుంచి ఒక ప్రకటన వెలువడుతుంది. ఇదీ సాధారణంగా టీడీపీలో జరిగే ఎంపిక తంతు.

రాష్ట్ర విభజన నేపధ్యంలో ఎంతో పరిపాలన అనుభవం కలిగిన చంద్రబాబుపై రాష్ట్ర ప్రజలు గురి పెట్టుకున్నట్టే ఆయన్ని నమ్మి ఎందరో తటస్థులు వెన్నంటి నడిచారు. అందులో విద్యావంతులు, ఆర్థికవేత్తలు, వృత్తి నిపుణులు, వివిధవర్గాల ప్రముఖులు ఉన్నారు. రాజ్యసభ సభ్యుల ఎంపికలో వారినెవ్వరినీ కాకుండా ఆయన తన పార్టీకి ఆర్థికంగా అండదండలు అందించిన పారిశ్రామికవేత్తలకే ప్రాధాన్యం ఇచ్చారు. వారిపై ఎంతో విశ్వాసం ఉంచారు. ఇప్పుడీ నమ్మకాలే పటాపంచలయ్యాయి. 

‘పెద్దల’ కప్పగంతులపై కుప్పలు తెప్పలుగా విమర్శలు వస్తున్నాయి.మొన్నటి ఎన్నికల్లో దేశం మూడ్ తెలుసుకుని రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీలో విలీనమైనట్టు రాజ్యసభ సభ్యుల బృందం చెప్పుకొచ్చారు.

ఇప్పుడు పార్టీని వీడిన వారంతా నిజానికి తక్కువ వాళ్ళు కూడా కాదు. పార్టీకి ఎంతో సేవ చేసిన వాళ్లే. పార్టీ కష్టకాలంలో అన్నీ తామై నాయకుణ్ణి నడిపించారు. ముఖ్యంగా వైవీఎస్ చౌదరి 2004 నుంచి 2014 వరకు పార్టీలో నెంబర్ 2గా ఉన్నారు. వారంతా పార్టీ కోసం కష్టపడి పనిచేశారు. సీఎం రమేష్ కూడా అంతే. నాయకుడికి వెన్నంటి ఉన్నారు. ప్రత్యేక హోదా కోసం జరిపిన పొరుతో పార్లమెంటులో ప్రకంపనలు సృష్టించారు.

టీడీపీ రాజ్యసభ సభ్యుల బృందం చెప్పినట్టు అసలు ఇది విలీనమేనా? టీడీపీ రాజ్యసభా పక్షాన్ని తీసుకెళ్లి బీజేపీలో కలిపేస్తే.. పార్టీ అధినేత, కార్యకర్తలు ఊరుకుంటారా?  ఊరుకోనట్టే కనిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఇప్పటికే అనేక ఊళ్ల నుంచి తండోపతండాలుగా పార్టీ కార్యకర్తలందరూ అమరావతికి చేరుకుంటున్నారు. పార్టీ నేతకు జరిగిన అవమానంగా తీసుకుని పగతో రగిలిపోతున్నారు. ఇది ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాల్సివుంది. 

మరోపక్క, తమ పార్టీని వీడిన నలుగురు రాజ్యసభ ఎంపీలు బీజేపీలో చేరడంపై ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్య నాయుడుకు టీడీపీ ఫిర్యాదు చేసింది. ఆ పార్టీ లోక్‌సభ సభ్యులు ఉపరాష్ట్రపతిని కలిసి  ఈ విలీనం చెల్లదని వాదించారు. ఎంపీలు గల్లా జయదేవ్‌, కేశినేని నాని, కింజరాపు రామ్మోహన్‌నాయుడు, కనకమేడల రవీంద్రకుమార్‌, తోట సీతారామలక్ష్మి దీనిపై ఉపరాష్ట్రపతికి ఒక లేఖ అందజేశారు. రాజ్యసభ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేశ్‌, టీజీ వెంకటేశ్‌, గరికపాటి మోహన్‌రావు భాజపాలో చేరడం ఫిరాయింపుల కిందికే వస్తుందని ఫిర్యాదు చేశారు. 

రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌ ప్రకారం రాజకీయ పార్టీల విలీనానికే అవకాశముందని టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత గల్లా జయదేవ్‌ గట్టిగా చెబుతున్నారు. అందుకే టీడీపీ తరఫున ఎన్నికై బీజేపీలో చేరిన నలుగురు ఎంపీలనూ అనర్హులుగా ప్రకటించాలని రాజ్యసభ చైర్మన్‌ను కోరినట్టుగా ఆయన మీడియాకు చెప్పారు. విలీన ప్రక్రియ ఎన్నికల సంఘానికి సంబంధించిన అంశమని.. విలీనాన్ని ఈసీ ఆమోదిస్తేనే పదో షెడ్యూల్‌ వర్తిస్తుందని చెప్పారు. విలీన ప్రక్రియను ఇప్పటివరకు రాజ్యసభ ఛైర్మన్‌ ఆమోదించలేదని.. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదని కనకమేడల వెల్లడించారు. 

మొత్తం మీద రాజకీయాల్లో శాశ్వత మిత్రులు కానీ, శత్రువులు కానీ ఉండరన్నట్టు నిన్నటి వరకు తిట్టిన తిట్టు తిట్టని వైరి పంచనే వీరు చేరిపోయారు. ఈ సరికొత్త బంధం ఏ రాజకీయ మలుపులకు దారితీస్తుందో తెలియని రాష్ట్ర ప్రజలు మాత్రం ప్రస్తుతానికి ఈ ఎపిసోడ్‌పై ఎడతెగకుండా చర్చించుకుంటున్నారు.

కోవర్టులా? కోరుకున్న స్నేహితులా? -1

డీఎస్ పశ్చాత్తాపం.. కాంగ్రెస్‌ని వీడి తప్పుచేశా!

డీఎస్ పశ్చాత్తాపం.. కాంగ్రెస్‌ని వీడి తప్పుచేశా!

   9 hours ago


పనిచేయని పవన్ ఆదేశాలు .. రాపాక రూట్ అటేనా?

పనిచేయని పవన్ ఆదేశాలు .. రాపాక రూట్ అటేనా?

   10 hours ago


కామన్ సెన్స్ కి వచ్చిన తిప్పలు.. సెన్సాఫ్ హ్యూమరట!

కామన్ సెన్స్ కి వచ్చిన తిప్పలు.. సెన్సాఫ్ హ్యూమరట!

   11 hours ago


రాజకీయ పార్టీల వికృత క్రీడకు బలైపోయిన ఆంధ్రుడు!

రాజకీయ పార్టీల వికృత క్రీడకు బలైపోయిన ఆంధ్రుడు!

   13 hours ago


స్పీకర్ నామమాత్రమేనా? జగనే సుప్రీం అవుతున్నారా?

స్పీకర్ నామమాత్రమేనా? జగనే సుప్రీం అవుతున్నారా?

   15 hours ago


అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ప్రవేశ పెట్టిన బుగ్గన

అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ప్రవేశ పెట్టిన బుగ్గన

   15 hours ago


హైపవర్ కమిటీ నివేదికకి కేబినెట్ ఓకె.. మూడురాజధానులకు సై

హైపవర్ కమిటీ నివేదికకి కేబినెట్ ఓకె.. మూడురాజధానులకు సై

   15 hours ago


టీడీపీ హయాంలో అభివృద్ధి... బీజేపీ, కాంగ్రెస్ నేతల పోటీ

టీడీపీ హయాంలో అభివృద్ధి... బీజేపీ, కాంగ్రెస్ నేతల పోటీ

   15 hours ago


జేపీ న‌డ్డా.. ఇక బీజేపీ బాస్‌..! ఎవ‌రాయ‌న‌..?

జేపీ న‌డ్డా.. ఇక బీజేపీ బాస్‌..! ఎవ‌రాయ‌న‌..?

   15 hours ago


'జ‌గ‌న్‌కు మోడీ, అమిత్ షా అండ‌'.. మీకు అర్ధ‌మ‌వుతుందా..?

'జ‌గ‌న్‌కు మోడీ, అమిత్ షా అండ‌'.. మీకు అర్ధ‌మ‌వుతుందా..?

   16 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle