newssting
BITING NEWS :
*అమరావతి: ముగిసిన బీఏసీ సమావేశం... మూడు రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం*రాజధాని ప్రకటనకు ముందు గుట్టుచప్పుడు కాకుండా టీడీపీ నేతలు భూములు కొన్నారు... గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 4070 ఎకరాలు తేలింది, కంతేరు గ్రామంలో చంద్రబాబు 14.2 ఎకరాలు కొన్నారు-మంత్రి బుగ్గన *అసెంబ్లీ వికేంద్రీకరణ బిల్లు ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి బుగ్గన *మూడురాజధానులకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ *అమరావతి, విశాఖలో మంత్రులు అందుబాటులో ఉంటారు.. స్థానిక జోన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.. నాలుగు జిల్లాలకు కలిపి జోనల్ డెవలప్‌మెంట్ బోర్డు, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే బిల్లు ఉద్దేశం-మంత్రి బుగ్గన*సీఆర్డీఏ రద్దు బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి బొత్స, మూడు రాజధానుల ప్రతిపాదలను బిల్లులో పేర్కొన్న ప్రభుత్వం*రంగారెడ్డి జిల్లా: షాద్‌నగర్‌లో చిరుత కలకలం.. ఓ ఇంటిపై చిరుత సంచారం, భయాందోళనలో స్థానికులు*ఛలో అసెంబ్లీకి అమరావతి జేఏసీ పిలుపు.. మద్దతు ప్రకటించిన టీడీపీ, సీపీఐ.. టీడీపీ ఎమ్మెల్యేలు*బెంగళూరు వన్డేలో టీమ్ ఇండియా విజయం. 3 వన్డేల సీరీస్ ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న టీమ్ ఇండియా

కోవర్టులా? కోరుకున్న స్నేహితులా? -1

21-06-201921-06-2019 23:01:29 IST
Updated On 22-06-2019 09:36:05 ISTUpdated On 22-06-20192019-06-21T17:31:29.557Z21-06-2019 2019-06-21T17:31:12.645Z - 2019-06-22T04:06:05.147Z - 22-06-2019

కోవర్టులా? కోరుకున్న స్నేహితులా? -1
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
‘బీజేపీలో బాబు కోవర్టులు’ అనే శీర్షికతో ఏపీలో అధికార పార్టీ సొంత పత్రిక ‘సాక్షి’లో వచ్చిన వార్తా కథనం, ఆ పార్టీ నేతలు చేస్తున్న విమర్శలు తెలుగు ప్రజానీకాన్ని డైలామాలో పడేశాయి. కేంద్ర సర్కారుతో చంద్రబాబుకు సత్సంబంధాలు ఉన్న రోజుల్లో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వెళ్లి ప్రధానమంత్రి కార్యాలయం దగ్గర తచ్చాడినప్పుడు తెలుగుదేశం శిబిరానికి కలిగిన డైలమాలాంటిదే ఇది. 

అప్పట్లో విజయసాయిరెడ్డి ప్రధానమంత్రిని కలిసి వైసీపీ, బీజేపీ మధ్య సరికొత్త స్నేహబంధానికి పునాదులు వేశారన్న వార్తలే కేంద్రంతో చంద్రబాబు కటీఫ్ చెప్పడానికి కారణమైందనేది తెలిసిందే. మరిప్పుడు తాజా కథనం ద్వారా ‘సాక్షి’ ఏం చెప్పబోతోంది?

టీడీపీ, బీజేపీ మధ్య మళ్లీ అనురాగం చిగురిస్తోందని బాహ్య ప్రపంచానికి చాటి చెబుతోందా? ఒకవేళ సాక్షి కథనమే నిజమనుకుంటే బీజేపీతో లోపాయికారి ఒప్పందం చేసుకుని బాబు మున్ముందు మోడీకి దగ్గర అవుతారా? దీన్నే వేరే అర్ధంలో చెప్పాలంటే ఇక ముందు బీజేపీ ఇప్పటి తన వైరి టీడీపీని చేరదీసి వైసీపీని దూరం పెడుతుందా? ఇవీ ఇవాళ సాధారణ ప్రజానీకానికి కలిగిన సవాలక్ష సందేహాలు. 

ఈ ముగ్గుర్నీ చంద్రబాబే బీజేపీలోకి పంపించాడనేది ఒకరకంగా విపరీత వ్యాఖ్యానం. రాజ్యసభ సభ్యుల్ని పంపి చంద్రబాబు రాజీకి ప్లాన్ చేశారని వైసీపీ రాజ్యసభ సభ్యుడు ట్విట్టర్ వేదికగా చంద్రబాబును తిట్టిపోస్తున్నారు.

నిశితంగా పరిశీలిస్తే, తన ఎంపీల్ని కోవర్టులుగా పంపాల్సిన అగత్యం అసలు టీడీపీకి ఉంటుందా. ? తమ ఎంపీల్ని కోవర్టులుగా పంపి ఎవరైనా సొంత పార్టీని ఖాళీ చేసుకుంటారా? అలా చేసి దేశవ్యాప్తంగా అప్రదిష్ట తెచ్చుకునేంత తెలివితక్కువ పని 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు వంటి నాయకుడు చేయగలడా? ఎలా చూసినా ‘సాక్షి’ కోవర్టుల కథనం ఏవిధమైన లాజిక్‌కూ అందడం లేదు. పోనీ, కొత్తగా వచ్చి చేరిన ఈ ముగ్గురితో బ్రహ్మాండం బద్దలైపోతుందని అటు బీజీపీ భ్రమ పడుతుందా అంటే అలా అని అనుకోవడానికీ లేదు. కాకపోతే, రాజ్యసభలో తమకు ఎదురే ఉండకూడదని కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అనుకుని వీరిని చేర్చుకుంటే చేర్చుకోవచ్చు. 

మున్ముందు తాము తీసుకొచ్చే బిల్లులకు ఉభయ సభల్లో అడ్డే ఉండకూడదని మోడీ-షా భావిస్తుండవచ్చు. అది అందరికీ తెలిసిందే. ఇలావుంటే, ఢిల్లీ వేదికగా జరిగిన పరిణామాలు తమ పార్టీకి ఎలాంటి నష్టం కలిగించబోవని తెలుగుదేశం పార్టీ నేతలు ఘంటాపథంగా చెబుతున్నారు. తమ నాయకుడు దేశంలో లేని వేళ ఆయన ఎంతో నమ్మి పదవులు కట్టబెడితే చివరికి టీడీపీ రాజ్యసభ సభ్యుల టీం ఇలా చేయడం 37 ఏళ్ల తెలుగుదేశం పార్టీలోని శ్రేణుల్ని మాత్రం నిర్ఘాంతపరిచింది. అదే సమయంలో తమ పార్టీ అధినేత వ్యవహార శైలిని కూడా కార్యకర్తలు ఇదే సందర్భంగా తప్పుబడుతున్నారు. 

తగిన పదవులకు తగిన అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ తమ పార్టీలో సక్రమంగా సాగడం లేదనేది ఇటీవల వారి నుంచి వినవస్తున్న విమర్శ. తాజా ఎపిసోడ్ నేపథ్యంలో తమ నేత వ్యవహరించిన తీరును వారు బాహాటంగానే విమర్శిస్తున్నారు. అసలు మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో సరైన అభ్యర్ధుల్నిఎంపిక చేయకపోవడం వల్ల ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నామని,  ఆరోపణలు ఎదుర్కొన్న పాత వారిని మార్చి కొత్తవారికి అవకాశం ఇచ్చి వుంటే అసలు ఓడిపోయేవారమే కాదని  ఓపక్క శ్రేణులన్నీ వాపోతున్నాయి. ఈ తరుణంలో ఇప్పుడు రాజ్యసభలో తమ పార్టీని ఖాళీ చేసేశారన్న వార్త వారి పాలిటి పిడుగుపాటుగా మారింది. 

‘పెద్దల సభ’కు అభ్యర్ధుల్ని ఎంపిక చేసే విషయంలో నేతల గుణగణాల్ని బట్టి కాకుండా వారి ‘ధనబలాన్ని’ చూసి నిర్ణయాలు తీసుకోవడం వల్లనే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురైందని టీడీపీలోని ద్వితీయశ్రేణి నాయకులు, పార్టీ కార్యకర్తలు దుయ్యబడుతున్నారు.  (ఇంకా ఉంది)

కోవర్టులా? కోరుకున్న స్నేహితులా? -2

డీఎస్ పశ్చాత్తాపం.. కాంగ్రెస్‌ని వీడి తప్పుచేశా!

డీఎస్ పశ్చాత్తాపం.. కాంగ్రెస్‌ని వీడి తప్పుచేశా!

   9 hours ago


పనిచేయని పవన్ ఆదేశాలు .. రాపాక రూట్ అటేనా?

పనిచేయని పవన్ ఆదేశాలు .. రాపాక రూట్ అటేనా?

   10 hours ago


కామన్ సెన్స్ కి వచ్చిన తిప్పలు.. సెన్సాఫ్ హ్యూమరట!

కామన్ సెన్స్ కి వచ్చిన తిప్పలు.. సెన్సాఫ్ హ్యూమరట!

   11 hours ago


రాజకీయ పార్టీల వికృత క్రీడకు బలైపోయిన ఆంధ్రుడు!

రాజకీయ పార్టీల వికృత క్రీడకు బలైపోయిన ఆంధ్రుడు!

   13 hours ago


స్పీకర్ నామమాత్రమేనా? జగనే సుప్రీం అవుతున్నారా?

స్పీకర్ నామమాత్రమేనా? జగనే సుప్రీం అవుతున్నారా?

   15 hours ago


అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ప్రవేశ పెట్టిన బుగ్గన

అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ప్రవేశ పెట్టిన బుగ్గన

   15 hours ago


హైపవర్ కమిటీ నివేదికకి కేబినెట్ ఓకె.. మూడురాజధానులకు సై

హైపవర్ కమిటీ నివేదికకి కేబినెట్ ఓకె.. మూడురాజధానులకు సై

   15 hours ago


టీడీపీ హయాంలో అభివృద్ధి... బీజేపీ, కాంగ్రెస్ నేతల పోటీ

టీడీపీ హయాంలో అభివృద్ధి... బీజేపీ, కాంగ్రెస్ నేతల పోటీ

   15 hours ago


జేపీ న‌డ్డా.. ఇక బీజేపీ బాస్‌..! ఎవ‌రాయ‌న‌..?

జేపీ న‌డ్డా.. ఇక బీజేపీ బాస్‌..! ఎవ‌రాయ‌న‌..?

   15 hours ago


'జ‌గ‌న్‌కు మోడీ, అమిత్ షా అండ‌'.. మీకు అర్ధ‌మ‌వుతుందా..?

'జ‌గ‌న్‌కు మోడీ, అమిత్ షా అండ‌'.. మీకు అర్ధ‌మ‌వుతుందా..?

   16 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle