newssting
BITING NEWS :
* నేడు తెలంగాణ కేబినెట్‌ సమావేశం*మాజీ ప్రధాని చంద్రశేఖర్‌ కుమారుడు, సమాజ్‌వాదీ పార్టీ రాజ్యసభ సభ్యుడు నీరజ్‌ శేఖర్‌ బీజేపీలో చేరిక *నీటి ప్రాజెక్టులను నిలిపేసేందుకు జగన్ ప్రయత్నం- చంద్రబాబు*ఏపీ గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్ *ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు *తెలంగాణలో నేటి నుంచి రెండో విడత వైద్య విద్య ప్రవేశాలు*అనంతపురంలో భారీవర్షం

కోర్టు తరలింపు.. వెళ్ళక తప్పని క్షణం.. అంతా ఉద్వేగం!

31-12-201831-12-2018 13:47:38 IST
Updated On 31-12-2018 15:06:15 ISTUpdated On 31-12-20182018-12-31T08:17:38.904Z31-12-2018 2018-12-31T08:17:34.299Z - 2018-12-31T09:36:15.525Z - 31-12-2018

కోర్టు తరలింపు.. వెళ్ళక తప్పని క్షణం.. అంతా ఉద్వేగం!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఉమ్మడి హైకోర్టు విభజనకు లైన్‌క్లియర్ అయింది. హైకోర్ట్ భవన నిర్మాణం పూర్తయ్యేవరకు విభజనను నిలిపివేయాలంటూ దాఖలైన హౌస్ మోషన్ పిటిషన్‌పై సత్వరమే విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం నిరాకరించింది. దీనిపై తదుపరి విచారణను జనవరి 2కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టు న్యాయవాదులు విజయవాడకు వెళ్లడం అనివార్యం అయింది. దీంతో హైకోర్టులో సందడి వాతావరణం ఏర్పడింది. ఎక్కడికక్కడ న్యాయవాదులు ఇదే అంశంపై చర్చించుకుంటూ కనిపించారు.

విజయవాడనుంచి వచ్చిన ప్రత్యేక బస్సుల్లో వారంతా ప్రయాణం అయ్యారు. సోమవారం సాయంత్రానికి వారు విజయవాడ చేరుకుంటారు. ఏపీ న్యాయవాదులు, న్యాయమూర్తులు, సిబ్బందికి వీడ్కోలు పలికేందుకు తెలంగాణ న్యాయవాదులు వచ్చారు. రాజకీయ కారణాలు, సెంటిమెంట్, ప్రత్యేక కోర్టులు... ఇటువంటివన్నీ ఎలాగున్నా నిన్నటి వరకూ కలిసిమెలిసి వున్న తెలంగాణ, ఆంధ్రా లాయర్లు, సిబ్బంది ఒకరిని ఒకరు విడిచి వెళ్లిపోతున్న వేళ కన్నీటి పర్యంతం అయ్యారు. ఆంధ్రాలాయర్లు, ఉద్యోగులకు శుభాకాంక్షలు చెబుతూనే, ఇలా విడిపోవడం తమకెంతో బాధ కలిగిస్తోందని తెలంగాణ లాయర్లు అంటున్నారు. 

మంగళవారం నుంచి అమరావతిలో కోర్టు సేవలను నిర్వహించాల్సి వుంది. న్యాయవాదులు, సిబ్బంది, టన్నుల కొద్దీ ఫైళ్లను అమరావతికి తరలించేందుకు ఈ ఉదయం అఫ్జల్ గంజ్ సమీపంలోని తెలుగు రాష్ట్రాల హైకోర్టు)కు బస్సులు, లారీలు చేరుకోగా తరలింపు ప్రక్రియ మొదలైంది. సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారమే విభజన ప్రక్రియ సాగనుంది. మంగళవారం ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే)గా జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌కుమార్‌ జనవరి ఒకటో తేదీ మంగళవారం ఉదయం 10.30 గంటలకు ప్రమాణం చేయనున్నారు.

ఆయనతో గవర్నర్‌ నరసింహన్‌ ప్రమాణం చేయించనున్నారు. అలాగే ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా వ్యవహరించనున్న మిగిలిన 13 మంది ఆ రోజే ప్రమాణం చేయనున్నారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తులకు విజయవాడలోని నోవాటెల్‌లో తాత్కాలిక బస కల్పించాలని ఏపీ సర్కార్‌ నిర్ణయించింది. అలాగే హైకోర్టు రిజిస్ట్రార్‌లకు సైతం అక్కడే బస ఏర్పాటు చేస్తున్నారు. సీఎం క్యాంప్‌ ఆఫీస్‌లో న్యాయమూర్తులు, రిజిస్ట్రార్‌లు, కోర్టు సిబ్బంది పనిచేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. 

జనవరి 1, 2019 నుంచి అమరావతిలో ఆంధ్ర హైకోర్టు ప్రారంభం అవుతుందంటూ రాష్ట్రపతి రాజపత్రం విడుదల చేశారు. ఏపీకి హైకోర్ట్ రావడం వెనక ఎంతో కథ నడిచింది. తెలంగాణ విభజన తర్వాత ఉమ్మడి హైకోర్టు కార్యకలాపాలు సాగించింది. హైకోర్ట్ విభజనకు తెలంగాణ న్యాయవాదులు పెద్ద ఎత్తు ఉద్యమాలు చేశారు. తమ చిరకాల కోరిక తీరడంతో తెలంగాణ న్యాయవాదులు సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు హైకోర్ట్ విభజన హడావిడిగా జరిగిందని ఏపీ న్యాయవాదులు అంటున్నారు.

గెజిట్ విడుదలయ్యాక కనీసం రెండుమూడు నెలల సమయం ఉంటుందని ఏపీ న్యాయవాదులు, ఉద్యోగులు భావించారు. కానీ వెంటనే అక్కడికి వెళ్ళాల్సి రావడంతో వారు మానసికంగా సిద్ధం కాలేకపోయారు. ఉద్యోగులు అక్కడికి వెళ్ళి విధులు నిర్వహించాల్సి రావడం, హైదరాబాద్‌లో చదువుకుంటున్న తమ పిల్లల్ని అక్కడికి తరలించడం కుదరదని ఉద్యోగులు అంటున్నారు. ఈ విద్యాసంవత్సరం ముగిసేవరకూ హైదరాబాద్ -విజయవాడ, విజయవాడ-హైదరాబాద్ మధ్య తాము రాకపోకలు సాగించాలంటున్నారు.

అమరావతికి హైకోర్ట్ రావడంపై అక్కడి న్యాయవాదులు, ప్రజలు హర్షం చేస్తున్నారు. ఆంధ్రాలోని చాలా ప్రాంతాల వారికి కేసుల కోసం హైదరాబాద్ రావాల్సిన ఇబ్బంది తప్పుతుంది. గంటల ప్రయాణం, ఖర్చులు కూడా తగ్గుతాయి. ఏపీ సచివాలయం ఇప్పటికే అమరావతిలో ఉండడంతో, అధికారులు కోర్టుకు సమాచారం ఇవ్వడం, ప్రభుత్వ న్యాయవాదులతో సంప్రదింపుల వంటి వాటికి అయ్యే సమయం బాగా తగ్గుతుంది. 

Image may contain: one or more people and crowd


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle