newssting
BITING NEWS :
*దిశ చట్టం తెచ్చినందుకు ఏపీ సీఎం జగన్‌కు అభినందనలు తెలిపిన ప్రత్యుష తల్లి సరోజినిదేవి *ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా వెంకట్రామిరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక *ఎన్‌కౌంటర్‌లో మరణించిన నలుగురు దిశ నిందితుల మృతదేహాల్ని భద్ర పర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం * కాంగ్రెస్‌ ‘భారత్‌ బచావో’ ర్యాలీ* ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా విడుదల....ఫోర్బ్స్‌ జాబితాలో నిర్మలాసీతారామన్‌*బ్రిటన్‌ ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీ ఘన విజయం*భారత పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌కు గాయం. వెస్టిండీస్‌తో జరిగే మూడు వన్డే సిరీస్‌లకు దూరం * టి20 క్రికెట్‌లోకి వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రేవో

కోడెల మాదిరి.. చింత‌మ‌నేనినీ ప‌ట్టించుకోని టీడీపీ అధిష్టానం..!

18-09-201918-09-2019 14:01:02 IST
Updated On 19-09-2019 15:52:13 ISTUpdated On 19-09-20192019-09-18T08:31:02.123Z18-09-2019 2019-09-18T08:30:58.032Z - 2019-09-19T10:22:13.003Z - 19-09-2019

కోడెల మాదిరి.. చింత‌మ‌నేనినీ ప‌ట్టించుకోని టీడీపీ అధిష్టానం..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో ఈ ద‌ఫా జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల వ‌ర‌కు తెలుగుదేశం పార్టీకి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా కంచుకోట‌. అయితే, ఎన్నిక‌ల్లో ఘోర ఓట‌మిపాలైన టీడీపీ డీలా ప‌డింది. మాజీ ఎమ్మెల్యే చింత‌మ‌నేని అరెస్టుతో టీడీపీ మ‌రింత చ‌తికిల‌ప‌డుతుంద‌న్న ఊహాగానాలు అప్పుడే మొద‌ల‌య్యాయి. టీడీపీలో 30 ఏళ్లుగా ఉన్న చింత‌మ‌నేని కార్య‌క‌ర్త స్థాయి నుంచి ఎమ్మెల్యేగా ప్ర‌భుత్వ విప్‌గా ఎదిగిన సంగ‌తి తెలిసిందే.

పార్టీ క‌ష్ట‌కాలంలో ఉన్న‌ప్పుడు చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ ముందుండి జెండా మోశారు. 2009లో రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రాక‌పోయినా దెందులూరు ఎమ్మెల్యేగా గెలిచిన చింత‌మ‌నేని జిల్లాలో రైతులు, ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పార్టీ త‌రుపున పోరాడి, ఎన్నో ఉద్య‌మాలు, ఆందోళ‌న‌లు చేసి పార్టీలో డేరింగ్ లీడ‌ర్‌గా ముద్ర వేసుకున్నారు. చింత‌మ‌నేనికి చురుకైన పాత్ర ఇచ్చి చంద్ర‌బాబు ప్రోత్స‌హించారు కూడా.

2014లోనూ దెందులూరు ఎమ్మెల్యేగా గెలిచిన చింత‌నేనిపై ఎన్ని ఆరోప‌ణ‌లు ఉన్నా చంద్ర‌బాబు ప్ర‌భుత్వ విప్ ప‌ద‌విని క‌ట్ట‌బెట్టారు. ఈ నేప‌థ్యంలో అధికారుల‌పై, ప్ర‌జా ప్ర‌తినిధుల‌పై, ప్ర‌త్య‌ర్దుల‌పై, అమాయ‌కుల‌పై చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ దాడులు చేశార‌ని, ధూషించార‌ని ఇలా లెక్క‌లేన‌న్ని కేసులు న‌మోద‌య్యాయి.

టీడీపీ అధికారంలో ఉన్నా, ప్ర‌తిప‌క్షంలో ఉన్నా, ప్ర‌భుత్వం ఏదైనా చింత‌మ‌నేనిపై కేసులు మాత్రం ఆగ‌లేదు. టీడీపీ హ‌యాంలో చింత‌మ‌నేనిని అరెస్టు చేసి జైలుకు పంప‌ని పోలీసులు ఇప్పుడు అత్యంత వ్యూహాత్మ‌కంగా ఉద్రిక్త ప‌రిస్థితుల మ‌ధ్య అరెస్టు చేశారు. నాట‌కీయ ప‌రిణామాల మ‌ధ్య అనుకున్న కేసులు కాకుండా పాత కేసుల‌ను త‌వ్వి మ‌రీ ఆ కేసుల్లో చింత‌మ‌నేనిని కోర్టులో హాజ‌రు ప‌రిచి రిమాండ్‌కు త‌ర‌లించారు.

అయితే చింత‌మ‌నేని వ్య‌వ‌హారంలో ఇంత జరుగుతున్నా ప‌శ్చిమ గోదావ‌రి టీడీపీ అధ్య‌క్షురాలు, రాజ్య‌స‌భ స‌భ్యురాలు తోట సీతారామ‌ల‌క్ష్మీ క‌నీసం స్పందించ‌కపోవ‌డంపై పార్టీ శ్రేణులు, చింత‌మ‌నేని అనుచ‌రులు ఆగ్ర‌హంతో ఊగిపోతున్నారు. మ‌రోవైపు ఏలూరులోనే ఉన్న పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు మాజీ ఎంపీ మాగంటి బాబు సైతం క‌నీసం స్పందించ‌క‌పోవ‌డంపైనా పుకార్లు పుడుతున్నాయి. జిల్లాలో ఉన్న ముగ్గురు మాజీ మంత్రులు జ‌వ‌హ‌ర్‌, పితాని స‌త్య‌నారాయ‌ణ‌, పీత‌ల సుజాత‌లు చింత‌మ‌నేని అరెస్టును క‌నీసం ఖండించక‌పోవ‌డంపై అనేక అనుమానాలు వ‌స్తున్నాయి. త‌మ నేత కోసం సొంత పార్టీ నుంచి క‌నీసం ఒక్క నేత కూడా పెద‌వి విప్ప‌లేద‌ని చింత‌మ‌నేని అనుచ‌రులు మండిప‌డుతుండ‌టం గ‌మ‌నార్హం.

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle