newssting
BITING NEWS :
*దిశ చట్టం తెచ్చినందుకు ఏపీ సీఎం జగన్‌కు అభినందనలు తెలిపిన ప్రత్యుష తల్లి సరోజినిదేవి *ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా వెంకట్రామిరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక *ఎన్‌కౌంటర్‌లో మరణించిన నలుగురు దిశ నిందితుల మృతదేహాల్ని భద్ర పర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం * కాంగ్రెస్‌ ‘భారత్‌ బచావో’ ర్యాలీ* ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా విడుదల....ఫోర్బ్స్‌ జాబితాలో నిర్మలాసీతారామన్‌*బ్రిటన్‌ ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీ ఘన విజయం*భారత పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌కు గాయం. వెస్టిండీస్‌తో జరిగే మూడు వన్డే సిరీస్‌లకు దూరం * టి20 క్రికెట్‌లోకి వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రేవో

కోడెల ఫర్నిచర్.. జగన్ కిటికీలు రెండూ ఒక్కటే!

12-11-201912-11-2019 16:15:19 IST
2019-11-12T10:45:19.082Z12-11-2019 2019-11-12T10:45:17.453Z - - 15-12-2019

కోడెల ఫర్నిచర్.. జగన్ కిటికీలు రెండూ ఒక్కటే!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఇంట్లో ప్రభుత్వ ఫర్నిచర్ వివాదం అందరికీ తెలిసిందే. ప్రభుత్వ అసెంబ్లీకి సంబంధించిన ఫర్నిచరును హైదరాబాద్ నుండి అమరావతి తరలించిన సందర్భంలో అప్పటి అసెంబ్లీ స్పీకరుకు అధికారికంగా కేటాయించిన భవనానికి ఆ ఫర్నిచర్ తరలించాలి. అయితే అప్పుడు కోడెల సొంత నివాసాన్ని అధికారిక నివాసంగా మార్చుకొని ఫర్నిచర్ తరలించారు.

కోడెలను ఆ ఫర్నిచరును అయన కుమారుడు బిజినెస్ కార్యాలపాలకు వాడుకున్నారని ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం తీవ్ర ఆరోపణలు చేసింది. హైదరాబాద్ నుండి భారీగా వచ్చిన ఫర్నిచరు వృధాగా పడిఉండడం ఇష్టంలేకనే వాడుకున్నామని.. ప్రభుత్వం మారిన తర్వాత అధికారికంగా అది ప్రభుత్వానికి అప్పగించాలి కనుక ఫర్నిచరును స్వాధీనం చేసుకోవాలని, లేదా ఫర్నిచర్ విలువను ప్రభుత్వానికి చెల్లించేందుకు కూడా తాను సిద్ధమేనని కోడెల ప్రభుత్వానికి రెండుసార్లు లేఖలు రాశారు.

అయితే ప్రభుత్వ వైసీపీ పార్టీ దానికి రాజకీయంగా మార్చి కోడెలను ఫర్నిచర్ దొంగగా ముద్రవేసింది. వివాదం కాస్త చిలికి చిలికి కోడెల మరణానికి కారణమైంది. అయితే ఆ వివాదంలో ఫర్నిచర్ ప్రజల ఆస్తి మాదిరే ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటిలో కూడా ప్రజా ఆస్తి ఉందన్నది కొందరి వాదన. సీఎం తాడేపల్లిలో ఆయన నిర్మించుకున్న నివాసానికి ప్రభుత్వ నిధులతో సౌకర్యాలను కల్పించుకున్నారు.

నిజానికి ప్రభుత్వం సీఎం అధికారిక నివాసాలను ప్రజా ధనంతో నిర్మించి ఇవ్వాలి. ముఖ్యమంత్రులు మారినా నివాసం మాత్రం అధికారికంగా తర్వాత వచ్చే ముఖ్యమంత్రులకు కేటాయించబడుతుంది. ఇప్పుడు సీఎం జగన్ తన నివాసాన్నే అధికారిక నివాసంగా మార్చుకొని దానికి సౌకర్యాల నిమిత్తం కోట్ల రూపాయాల ప్రజా ధనాన్ని ఖర్చు చేశారు.

జగన్ తాడేపల్లి నివాసానికి ఇప్పటికే ఏసీలు, భద్రతా పరమైన సౌకర్యాలు, ఇంటి మొత్తానికి దోమల నివారణ కోసం జాలీలు, తాజాగా కిటికీలకు కూడా కోట్ల రూపాయాల ప్రజల నిధులను కేటాయించారు. అధికారికంగా ఓ ముఖ్యమంత్రికి సౌకర్యాలను కల్పించడం ప్రభుత్వం బాధ్యత కనుక దీనిని తప్పు బట్టలేము. అయితే భవిష్యత్తులో ప్రభుత్వం మారితే ఇవన్నీ జగన్ ప్రభుత్వానికి అప్పగిస్తారా అన్నదే కొందరి ప్రశ్న.

సీఎం అధికారిక నివాసానికి ఖర్చు పెట్టింది తదనంతరం వచ్చే ముఖ్యమంత్రికి కూడా ఉపయోగపడాలి. మరి జగన్ నివాసానికి పెట్టింది తర్వాత వచ్చే ముఖ్యమంత్రులకు ఉపయోగపడుతుందా? కోడెలకు అధికారికంగా ఇచ్చిన ఫర్నిచర్ తిరిగి ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉన్నట్లే జగన్ భవిష్యత్ లో ఇంటికి పెట్టిన సౌకర్యాలను తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేస్తారా?

ప్రభుత్వాలు ఏవీ శాశ్వతం కాదు.. ఐదేళ్ల రాజకీయంలో ఏమైనా జరగొచ్చు. తర్వాత వచ్చే ప్రభుత్వాలు జగన్ కిటికీల ఖర్చును రాజకీయం చేసే అవకాశాలు ఉన్నాయి. అయినా వేలకోట్ల ఆరోపణల సంగతి పక్కన పెట్టినా జగన్ అధికారికంగా కూడా వందల కోట్లను ఆస్తులగా చూపించారు. మరి వందల కోట్ల ఆసామి ఇంటి కిటికీలకు ప్రజల ధనాన్ని ఖర్చు చేయడం ఎందుకు? ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వడం కాకపోతే!

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle