newssting
BITING NEWS :
*కాకినాడలో ముగిసిన జనసేన రైతు సౌభాగ్యదీక్ష*మహిళలకు అండగా చరిత్రాత్మక బిల్లుకు ఏపీ కేబినెట్‌ ఆమోదం *ఆఖరి టీ 20లో ఉతికి ఆరేసిన టీమిండియా...సిరీస్ కైవసం *తెలంగాణ కేబినెట్‌లో పలు కీలక నిర్ణయాలు..దమ్ముగూడంలో గోదావరిపై బ్యారేజ్ నిర్మించాలని నిర్ణయం*Ap రాజధాని భూ సమీకరణ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ కేబినెట్..అసైన్డ్ భూములని నిబంధనలకు విరుద్దంగా కొనుగోలు చేసి ల్యాండ్ పూలింగుకు ఇచ్చిన వ్యక్తుల రిటర్నబుల్ ప్లాట్లను రద్దు చేస్తూ నిర్ణయం *125 మంది సభ్యుల మద్దతుతో పౌరసత్వ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపిన పెద్దల సభ*వర్మ సినిమాకు గ్రీన్ సిగ్నల్..అమ్మరాజ్యంలో కడప బిడ్డలు మూవీ ఇవాళ విడుదల *పీఎస్ఎల్వీ సి48 రీశాట్, 2 బీఆర్-1 ప్రయోగం విజయవంతం *గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ప్రత్యేక సభ్యుడిగా గుర్తిస్తున్నట్టు అసెంబ్లీలో తెలిపిన ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం

కోడెల టీడీపీని వీడాలనుకున్నారా?

17-09-201917-09-2019 15:12:40 IST
Updated On 17-09-2019 15:32:54 ISTUpdated On 17-09-20192019-09-17T09:42:40.324Z17-09-2019 2019-09-17T09:42:20.280Z - 2019-09-17T10:02:54.680Z - 17-09-2019

కోడెల టీడీపీని వీడాలనుకున్నారా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలుగు రాష్ట్రాల్లో ఏపీ మాజీ స్పీకర్‌, టీడీపీ సీనియర్‌ నేత కోడెల శివ ప్రసాద్‌ ఆత్మహత్య కలకలం రేపుతోంది. దివంగత సీఎం, టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు పిలుపు మేరకు 1983లో కోడెల రాజకీయ రంగ ప్రవేశం చేశారు. వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించారు. ఎన్టీఆర్, చంద్రబాబుల హయాంలలో మంత్రిగా చేసిన కోడెల తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరి ప్రేమాభిమానాలను పొందగలిగారు. అలాంటి వ్యక్తి బలవన్మరణానికి పాల్పడడం తెలుగు ప్రజలు జీర్ణించుకోలేని అంశం. ఇప్పుడు కోడెల మృతికి రాజకీయ రంగు పులుముకుంది.

వైసీపీ ప్రభుత్వం వేధింపుల వల్లే కోడెల మృతి చెందారని టీడీపీ నేతలు ఆరోపిస్తుండగా.. కోడెలను తాము ఎలాంటి వేధింపులకు గురిచేయలేదని వైసీపీ పేర్కొంటుంది. కోడెల శివప్రసాద్‌ హైదరాబాద్‌లోని తన నివాసంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడటంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం బసవతారకం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కోడెల మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఉమ్మడి ఏపీ రాజకీయాల్లోనూ కోడెల కీలకంగా వ్యవహరించారు.

ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు అనంతరం నూతన ఏపీలో తొలి స్పీకర్‌గా కోడెల విశేష సేవలందించారు. అందరిలోనూ మంచి వ్యక్తిగా కోడెల గుర్తింపు తెచ్చుకున్నారు. 2019 ఎన్నికల్లో ఏపీలో టీడీపీ ఘోర పరాభావం పాలైంది. కోడెలసైతం వైసీపీ గాలికి ఓటమి పాలయ్యాడు. అప్పటి నుంచి కోడెల చుట్టూ పలు వివాదాలు చుట్టుకున్నాయి.

జగన్మోహన్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి కోడెలకు బ్యాడ్‌టైం మొదలైందని తెలుగుదేశం నేతలు పేర్కొంటున్నారు. కోడెల శివ ప్రసాద్‌కు ఉన్న మంచిపేరును చెడగొట్టాలనే ఉద్దేశంతో వైసీపీ టార్గెట్‌ రాజకీయాలు చేసిందని వారు వాదిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు కోడెల కుటుంబం ఎన్నో అక్రమాలు చేసిందని, కేట్యాక్స్‌ అంటూ వసూళ్లకు పాల్పడ్డారంటూ విమర్శలు వెల్లువెత్తాయి.

కోడెల బాధితులు చాలా మంది పోలీస్‌ స్టేషన్‌లలో ఫిర్యాదులు చేశారు. దీనికితోడు అసెంబ్లీ ఫర్నీచర్‌ను తన ఇంటికి తరలించడంపై ఆయనపై వ్యతిరేకత వచ్చింది. దీంతో కోడెల దొంగ అంటూ వైసీపీ నేతలు ప్రెస్‌మీట్‌లు పెట్టిమరీ ప్రచారం నిర్వహించారు. తీవ్ర మనస్థాపానికి గురైన కోడెల తనను వైసీపీ ప్రభుత్వం టార్గెట్‌ చేసిందని, తనను మానసికంగా దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తుందని పలువురు టీడీపీ నేతల వద్ద కోడెల వాపోయినట్లు తెలుస్తుంది.

వైసీపీ టార్గెట్‌ రాజకీయాలను తప్పుకోవాలంటే బీజేపీలో చేరడమే ప్రత్యామ్నాయమని కోడెల ఒకానొక సమయంలో భావించినట్లు ప్రచారం జరుగుతుంది. దీనిలో భాగంగా బీజేపీ నేతలు కంభంపాటి రామ్మోహన్‌, సుజనా చౌదరిలతో కూడా ఆయన సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. వారు బీజేపీ పెద్దలతో మాట్లాడి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు.. అప్పటి నుండి టీడీపీ నేతలతోనూ కోడెల కొంత దూరంగా ఉంటూ వచ్చారని స్థానికంగా ప్రచారం జరుగుతుంది. 

కానీ టీడీపీ వీడటంపై కుమారుడు శివరామకృష్ణ తీవ్రంగా వ్యతిరేకించాడని, దీంతో కుటుంబంలోనూ గొడవలు చోటు చేసుకున్నాయని తెలుస్తుంది. ఈ సమయంలో కోడెల తీవ్ర మనస్థాపానికి గురయ్యారని ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో అటు టీడీపీని వీడలేక.. వైసీపీ ప్రభుత్వం కుట్రలను ఎదుర్కోలేక, బీజేపీలోనూ చేరలేక కోడెల తీవ్ర ఆవేదనకు గురయ్యార నే ప్రచారం సాగుతుంది. ఈ పరిస్థితులన్నీ కోడెల ఆత్మహత్యకు దారితీశాయని తెలుస్తుంది. ఏదిఏమైనా కోడెల లాంటి వ్యక్తి ఇలాంటి రీతిలో మృతి చెందడం తెలుగు ప్రజలు జీర్ణించుకోలేని విషయం.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle