newssting
BITING NEWS :
*దిశ చట్టం తెచ్చినందుకు ఏపీ సీఎం జగన్‌కు అభినందనలు తెలిపిన ప్రత్యుష తల్లి సరోజినిదేవి *ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా వెంకట్రామిరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక *ఎన్‌కౌంటర్‌లో మరణించిన నలుగురు దిశ నిందితుల మృతదేహాల్ని భద్ర పర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం * కాంగ్రెస్‌ ‘భారత్‌ బచావో’ ర్యాలీ* ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా విడుదల....ఫోర్బ్స్‌ జాబితాలో నిర్మలాసీతారామన్‌*బ్రిటన్‌ ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీ ఘన విజయం*భారత పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌కు గాయం. వెస్టిండీస్‌తో జరిగే మూడు వన్డే సిరీస్‌లకు దూరం * టి20 క్రికెట్‌లోకి వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రేవో

కోడెల ఆత్మహత్య.. డీలా పడ్డ తెలుగు తమ్ముళ్ళు

17-09-201917-09-2019 08:16:39 IST
2019-09-17T02:46:39.412Z17-09-2019 2019-09-17T02:46:23.828Z - - 15-12-2019

కోడెల ఆత్మహత్య.. డీలా పడ్డ తెలుగు తమ్ముళ్ళు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ శాసనసభ మాజీ స్పీకర్ డా.కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య టీడీపీ శ్రేణుల్లో నిస్తేజం కలిగించింది. చిన్నాపెద్ద నేతలంతా కోడెల ఆకస్మిక మృతిని జీర్ణించుకోలేక పోతున్నారు. ఆయనతో అనుబంధం ఉన్న మాజీ టీడీపీ నేతలు, మాజీ మంత్రులు చలించిపోయారు. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవన్‌లో కోడెల శివప్రసాద్ భౌతికకాయానికి మాజీ సీఎం చంద్రబాబు, నారా లోకేష్ నివాళులర్పించారు.  అనంతరం పార్టీ జెండాను కోడెలపై కప్పారు. 

మంగళవారం ఉదయం 8 గంటలకు హైదరాబాద్ నుంచి కోడెల పార్థివ దేహంతో చంద్రబాబు, లోకేష్ గుంటూరు బయలుదేరారు టీడీపీ నేతలు. కోదాడ, సూర్యాపేట, విజయవాడ, మంగళగిరి మీదుగా గుంటూరు పార్టీ ఆఫీసుకు కోడెల పార్థీవ దేహం తరలిస్తున్నారు. మంగళవారం సాయంత్రం గుంటూరు పార్టీ ఆఫీసు నుంచి నరసరావుపేటకు తరలిస్తారు.

ఇదిలా ఉంటే ప్రభుత్వ వేధింపుల వల్లే కోడెల శివప్రసాదరావు చనిపోయారని ఆరోపిస్తున్న టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. మంగళ, బుధవారాలను సంతాప దినాలుగా పాటించాలని నిర్ణయించింది. అన్ని నియోజకవర్గాల్లో నల్లజెండాలు, బ్యాడ్జీలతో నిరసన తెలపాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. 

కోడెల సంతాప సభలు ఏర్పాటు చేయడంతోపాటు...పార్టీ కార్యాలయలపై జెండాలను అవతనం చేయాలని సూచించారు. కోడెల ఆత్మహత్య చేసుకోవడానికి దారితీసిన పరిస్థితులు...ప్రభుత్వం వేధింపుల గురించి ప్రజలకు వివరించాలన్నారు. మరోవైపు నరసరావుపేటలో డా.కోడెల అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని గుంటూరు రూరల్‌ ఎస్పీ జయలక్ష్మి తెలిపారు.

Image may contain: one or more people and flower

రాష్ట్రస్థాయి నేత కావటంతో వీఐపీలు అధికసంఖ్యలో వచ్చే అవకాశం ఉందని,  అభిమానులు భావోద్వేగాలకు గురయ్యే అవకాశం ఉందని, దీన్ని దృష్టిలో పెట్టుకొని ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణకు, శాంతి భద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకున్నట్టు తెలిపారు.

నరసరావుపేట పార్లమెంట్‌ నియోజక వర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సున్నితమైన గ్రామాల్లో శాంతి భద్రతల పరిరక్షణకు పికెట్లను ఏర్పాటు చేసి 144వ సెక్షన్‌ విధించారు. సామాన్య ప్రజానీకానికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదనే లక్ష్యంతో ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు.

Image may contain: 26 people, including Purna Chandu, Suresh Kota and Palle Ravanna Followers, people standing


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle