newssting
BITING NEWS :
*కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్ష *విజయవాడ రానున్న ఏపీ కొత్త గవర్నర్ బి.బి హరిచందన్ *బీజేపీ పార్లమెంటరీ సమావేశం*బీజేపీలో చేరనున్న మాజీ ఎంపీ వివేక్* ఎర్రమంజిల్ భవనం కూల్చివేతే కేసుపై హైకోర్టులో విచారణ *ప్రారంభం కానున్న జపాన్ ఓపెన్ బ్యాట్మింటన్ టోర్నీ

కోడెల-అంబటి మధ్య మాటల యుద్ధం

16-04-201916-04-2019 08:37:20 IST
Updated On 06-07-2019 12:33:43 ISTUpdated On 06-07-20192019-04-16T03:07:20.817Z16-04-2019 2019-04-16T03:07:03.794Z - 2019-07-06T07:03:43.062Z - 06-07-2019

కోడెల-అంబటి మధ్య మాటల యుద్ధం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావు, వైసీపీ నేత అంబ‌టి రాంబాబు మ‌ధ్య ఆరోప‌ణ‌ల ప‌ర్వం తీవ్రస్థాయికి చేరుకున్న‌ట్లు తెలుస్తోంది. రౌడీ రాజ‌కీయం చేస్తున్నారంటూ ఒక‌రి మీద మ‌రొక‌రు ఏదో ఒక స‌మ‌యంలో బహిరంగంగానో, పార్టీ కార్య‌క‌ర్త‌ల స‌మ‌క్షంలోనే చెప్పేస్తున్నారు. వీరి మాట‌ల సంగ‌తేమో కానీ, గ‌తం చూస్తే ఈ ఇద్ద‌రు నేత‌ల మీద చాలా ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఒక‌రు ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాల‌ను ప్రోత్స‌హించార‌నీ కొంద‌రు, ముఠా క‌క్ష‌ల‌ను రెచ్చ‌గొట్టార‌ని మ‌రికొంద‌రు అటు కోడెల‌, ఇటు అంబ‌టి మీద ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. 

ఎందుకంటే ప‌ల్నాడులో బాంబుల సంస్కృతిని ప్రోత్స‌హించార‌న్న ఆరోప‌ణ‌లు కోడెల మీద చాలా ఉన్నాయి. గ‌తంలో కోడెల‌ ఆస్ప‌త్రి కింద గ‌దిలో బాంబులు పేలాయి.ఈ ఘ‌ట‌న‌లో ఆయ‌న ముఖ్య అనుచ‌రుడు చౌద‌రి శీను చ‌నిపోయాడు. బాంబులు త‌యారు చేస్తుండ‌గా పేలుడు జ‌రిగింద‌ని ఆ త‌ర్వాత పోలీసులు విచార‌ణ‌లో తేలింది.

ఇదంతా కోడెల‌కు తెలియ‌కుండా జ‌రుగుతుందా అనే ప్రశ్నలు ఉత్పన్నం అయ్యాయి. మొన్న‌టి ఎన్నిక‌ల్లో స‌త్తెనప‌ల్లి నుంచి గెలిచారు కోడెల‌. అప్ప‌టి నుంచి ఆయ‌న కుమారుడు కేఎస్టీ పేరుతో అంటే కోడెల స్పెష‌ల్ ట్యాక్స్ పేరుతో జ‌నాన్ని దోచేశార‌న్న ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. కోడెల కూడా ఈ ఎన్నిక‌ల్లో టిక్కెట్ ఖ‌రారు అయిన త‌ర్వాత‌, త‌న కుటుంబం ఎవ్వ‌రినీ ఇబ్బంది పెట్ట‌ద‌ని వివ‌ర‌ణ ఇచ్చుకున్నారు. అంటే ఇప్ప‌టి దాకా ఇబ్బంది పెట్టింద‌న్న విష‌యాన్ని ఆయ‌న ఒప్పుకున్న‌ట్లు అర్థం అవుతోంది. అందుకే ఇనిమెట్ల ఘ‌ట‌న‌పై కోడెల శివ‌ప్ర‌సాద‌రావు, టీడీపీ నేత‌లు ఎంతగా చెబుతున్న జ‌నం న‌మ్మ‌డం లేదు. ఆయ‌న స్వ‌భావం ఎరిగిన వారు కావ‌డంతో వైసీపీ ఆరోప‌ణ‌ల‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌క పోయినా, కోడెల‌ను మాత్రం స‌మ‌ర్థించ‌డం లేద‌ని తెలుస్తోంది.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle