newssting
BITING NEWS :
*ప్రధాని మోదీని కలిసిన వైఎస్ఆర్సీఎల్పీ నేత జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర సమస్యలపై చర్చ, ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం * వాల్డ్ కప్ వార్మప్ మ్యచ్ లో టీమిండియా పేలవ ప్రదర్శన, న్యూజీల్యాండ్ చేతిలోఓటమి * నరేంద్ర మోదీని పీఎం ఎలక్ట్ గా నియమించిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ * రాష్ట్రపతి కోవింద్ కు కొత్త ఎంపీల జాబితా సమర్పించిన ఈసీ * ఎవరెస్ట్ పర్వతంపై ఈ వారం మరణించిన పర్వతారోహకుల సంఖ్య 10కి చేరిక * తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కు ఏపీలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల జాబితా సమర్పించిన సీఈఓ జీకే ద్వివేది

కోడెలకు కష్టమేనా?

15-03-201915-03-2019 07:43:50 IST
2019-03-15T02:13:50.176Z15-03-2019 2019-03-15T02:13:38.774Z - - 26-05-2019

 కోడెలకు కష్టమేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తన కుటుంబంతో ఎలాంటి సమస్యలు రావనీ, తనను నమ్మాలనీ, మరోసారి గెలిపించాలంటూ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు స్పీకర్ కోడెల శివప్రసాదరావు. ఆయన మాటలు చూస్తుంటే సొంత పార్టీ నేతలను వేడుకుంటున్నట్లు అనిపిస్తోందట. ఎందుకంటే... ఈసారి కూడా కోడెలకు సత్తెనపల్లి టిక్కెట్ ఖరారు అవ్వడంతో టీడీపీలోని ఓ వర్గం ఆయన మీద మండిపడుతోంది. ఆయనకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగుతోంది. కోడెలకు టిక్కెట్ ఇస్తే ఓడిస్తామని తేల్చి చెబుతోంది. ముఖ్యంగా వ్యతిరేక వర్గానికి నాయకత్వం వహిస్తున్న గోగినేని కోటేశ్వరరావు, జిల్లా టీడీపీ కార్యదర్శి పెద్దింటి వెంకటేశ్వర్లు తదితరులు కోడెల పేరు వింటేనే మండిపడుతున్నారు. వీరి కోపానికి కారణం ఒక్కటే. 

కోడెల ట్యాక్స్ పేరుతో జనాన్ని, పార్టీ నేతలను కోడెల కుటుంబం భారీగా దోచేసిందని వీరు ఆరోపిస్తున్నారు. తోపుడు బండ్ల దగ్గర నుంచి పరిశ్రమలదాకా... ప్రతి దానికీ కోడెల ట్యాక్స్ పేరుతో దోచేశారనీ, ఎవ్వరినీ వదిలి పెట్టలేదని మండిపడుతున్నారు. తిరుపతి దర్శనం కోసం రికమండేషన్ లెటర్ పొందాలన్నా డబ్బులు అడుగుతున్నారని చెబుతున్నారు. అంతేకాదు... పార్టీ నేతలు కూడా కోడెల ట్యాక్స్ బారిన పడ్డారని వాపోతున్నారు. నిజంగా కోడెల ట్యాక్స్ పేరుతో ఆయన కుటుంబం దోచేసిందా అంటే... అవుననే అంటున్నారు సత్తెనపల్లి ప్రజలు. 

వారి మాటల్లో నిజానిజాలు ఎలా ఉన్నా... ఇక్కడో లాజిక్ మిస్ అవ్వకూడదు. ఎందుకంటే కోడెల మీద వైసీపీ నేతలు ఈ ఆరోపణలు చేస్తే వాటిని కొట్టిపారేయచ్చు. ఏకంగా సొంత పార్టీ నేతలే కోడెల శివప్రసాదరావు మీద ఆగ్రహం వ్యక్తం చేయడంతోనే కోడెల ట్యాక్స్ నిజమని అర్థం అవుతోంది.

ఒకవేళ కోడెల మీద అక్కసుతో కొందరు పార్టీ నేతలు ఈ ఆరోపణలు చేశారని అనుకుంటే... స్వయంగా కోడెల శివప్రసాదరావే తన మీద వచ్చిన ఆరోపణలు నిజమని తేల్చేశారట. తన కుటుంబంతో పార్టీ నేతలకు ఎలాంటి సమస్యలు రావని మీడియా సాక్షిగా కోడెల ఒప్పుకున్నారు. అంటే కోడెల ట్యాక్స్ అనేది నిజమని తేలిపోయింది. వీళ్ల గోల ఎలా ఉన్నా తాజా పరిణామాలు సత్తెనపల్లి వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబుకు సంతోషం కలిగిస్తున్నాయట. ఈసారి ఎలాగైనా ‘అంబటి రాంబాబు అనే నేను... ’ అంటూ అసెంబ్లీలోకి అడుగుపెడతానని ఆత్మవిశ్వాసంతో ఉన్నారు.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకి జర్నలిజంలో విశేష అనుభవం. 21 సంవత్సరాల క్రితం జర్నలిజంలోకి ప్రవేశించిన సత్యనారాయణరాజు ప్రముఖ దినపత్రికలు, న్యూస్ ఛానెళ్ళలో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... మూడేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో సీనియర్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు.ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle