newssting
BITING NEWS :
* నేను తెలంగాణను కించ పర్చేలా మాట్లాడలేదు.. తెలంగాణలోని ప్రధాన పట్టణాలకు రైల్ కనెక్టివిటీ లేదని చెప్పాలన్నదే నా ఉద్దేశ్యం.. ఆంధ్ర పాలకుల హయాంలో తెలంగాణ నిర్లక్ష్యానికి గురైందని చెప్పా-కేంద్రమంత్రి కిషన్ రెడ్డి *కాంగ్రెస్‌ ఎంపీ అహ్మద్‌పటేల్‌కు ఐటీశాఖ నోటీసులు.. రూ.400 కోట్ల హవాలా మనీ కేసులో సమన్లు.. ఫిబ్రవరి 11నే నోటీసులు జారీ చేసిన ఐటీశాఖ.. హాజరుకాకపోవడంతో మరోసారి నోటీసులు*కోవిడ్‌-19 బారిన పడి వుహాన్‌ వుచాంగ్‌ హాస్పిటల్‌ డైరక్టర్‌ మృతి.. కరోనాపై ఫస్ట్‌ హెచ్చరిక జారీ చేసిన లియూ చిమింగ్‌... ఆయన మృతికి సంతాపం ప్రకటించిన చైనా వాసులు*ధాన్యం కొనుగోలు కోసం నిధులను కేటాయించారా.. లేదా?, కేటాయిస్తే ఆ నిధులు ఎటుపోయాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలి-పవన్ కల్యాణ్ *ఎన్నికల వరకే రాజకీయం.. ఆ తర్వాత ప్రభుత్వ పథకాలే ముఖ్యం, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులే రేపటి నాయకులు-కేసీఆర్* భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం... ట్రంప్ పర్యటన నేపథ్యంలో కీలక నిర్ణయాలు *పాకిస్థాన్‌లో ముస్లింల సంఖ్య 23 శాతం తగ్గిందట.. మరి వాళ్లంతా ఏమయ్యారు, చనిపోయి ఉండాలి.. ఇస్లామిక్‌లోనైనా కలిసి ఉండాలి లేదా భారత్‌లో చొరబడి స్థిరపడి ఉండాలి!-పీయూష్ గోయల్

కోడెలకు కన్నీటి వీడ్కోలు...

18-09-201918-09-2019 18:06:36 IST
Updated On 19-09-2019 15:47:23 ISTUpdated On 19-09-20192019-09-18T12:36:36.304Z18-09-2019 2019-09-18T12:36:33.928Z - 2019-09-19T10:17:23.195Z - 19-09-2019

కోడెలకు కన్నీటి వీడ్కోలు...
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మాజీ స్పీకర్‌, టీడీపీ సీనియర్‌ నేత కోడెల శివప్రసాద్‌కు తెదేపా కార్యకర్తలు, అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. సోమవారం ఆత్మహత్యచేసుకొని అనుమానాస్పద స్థితిలో కోడెల మృతిచెందాడు. కాగా కోడెల హత్య ఏపీలోని వైకాపా, తెదేపా పార్టీల మధ్య రాజకీయ రంగు పులుముకుంది. పోస్టుమార్టం నిమిత్తం మంగళవారం గుంటూరుకు చేరుకున్న పార్దీవదేహానికి టీడీపీ నేతలు, కార్యకర్తలు, కోడెల అభిమానులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బుధవారం సాయంత్రం నరసరావుపేటలోని గుంటూరు రోడ్డులోని స్వర్గపురిలో ఆయన భౌతిక కాయానికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

కోడెల ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేసిన గుంటూరు రోడ్డులోని శ్మశానవాటికలోనే ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. కోడెల అంతిమయాత్ర టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. కోడెలను కడసారి చూసేందుకు సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల ప్రజలు వేల సంఖ్యలో తరలివచ్చారు. పల్నాడు ప్రాంతంలోని పలు గ్రామాల నుంచి ఆయన అభిమానులు కోడెల నివాసానికి చేరుకొని అంతిమయాత్రలో పాల్గొన్నారు. పెద్దఎత్తున తరలివచ్చిన పార్టీ కార్యకర్తలు, అభిమానులతో కోటసెంటర్‌ జనసంద్రంగా మారింది. కోడెల అంత్యక్రియల నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

కోడెల నివాసానికి రెండు కిలోమీటర్ల దూరంలోనే వాహనాలను పోలీసులు నిలిపివేశారు. కోడెల శివప్రసాదరావుకు సంతాపం తెలుపుతూ నరసరావుపేట పట్టణంలోని దుకాణాలను వ్యాపారులు స్వచ్ఛందంగా మూసివేశారు. ఇదిలా ఉంటే బుధవారం ఉదయం కోడెల నివాసం అంతిమయాత్ర ప్రారంభమైంది. అంతిమ యాత్రలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌, ఎమ్మెల్యే బాలకృష్ణ, అచ్చెంన్నాయుడు, టీడీపీ నేతలు పాల్గొన్నారు. కోడెలను కడసారి చూసేందుకు వచ్చిన నేతలు, కార్యకర్తలు, ఆయన అభిమానులు కోడెల సేవలను గుర్తు చేసుకుంటున్నారు. నరసరావుపేట అభివృద్ధి ఆయన చలవేనంటూ గుర్తుచేసుకుంటున్నారు. జై కోడెల.. జైజై కోడెల.. పలనాటి పులిబిడ్డ కోడెల అంటూ కార్యకర్తలు, అభిమానులు పెద్దపెట్టున అంతిమయాత్రలో నినాదాలు చేశారు.

ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలకు ససేమిరా..

కోడెల పార్దివ దేహానికి గుంటూరు రోడ్డులోని శ్మశానవాటిక 'స్వర్గపురి'లో అంత్యక్రియలు నిర్వహించారు. కాగా ఏపీ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు అంత్యక్రియలపై నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నరసరావుపేటలోని స్వర్గపురిలో కోడెలకు అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. కుటుంబ సభ్యులు వద్దని చెప్పినా అధికారులు ఏర్పాట్లు చేశారు.

ప్రభుత్వ వేధింపుల కారణంగానే కోడెల ఆత్మహత్యకు పాల్పడ్డారని, ప్రభుత్వ అధికారిక లాంఛనాలు అవసరం లేదని ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా కలెక్టర్‌ ఆనంద్‌ కుమార్‌, ఎస్పీ జయలక్ష్మి టీడీపీ నేతలు, కుటుంబ సభ్యులతో చర్చించారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశామని వివరించారు. అందుకు కోడెల కుటుంబీకులు ససేమిరా అన్నారు. టీడీపీ నాయకులు కూడా తీవ్రంగా వ్యతిరేకించినట్లు తెలిసింది.

24liveblog


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle