newssting
BITING NEWS :
*జపాన్ టీంని ఓడించిన ఇండియన్ ఉమెన్స్ హాకీ టీం *ప్రత్యేక హోదాపై తేల్చేసిన కేంద్రం... దేశంలో ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ప్రకటించే అవకాశం లేదన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్*బీహార్ లో మెదడువాపు వ్యాధికి బలమయిన 152 మంది చిన్నారులు *ప్రజావేదికను కూల్చేయండి.. సీఎం జగన్ ఆదేశం*కొనసాగుతున్న ఏపీలో కలెక్టర్ల కాన్ఫరెన్స్*అఫ్గాన్‌పై బంగ్లా ఘనవిజయం

కోడెలకు ఇబ్బందులు తప్పవా?

11-06-201911-06-2019 09:01:51 IST
Updated On 24-06-2019 12:27:22 ISTUpdated On 24-06-20192019-06-11T03:31:51.598Z11-06-2019 2019-06-11T03:31:44.658Z - 2019-06-24T06:57:22.602Z - 24-06-2019

కోడెలకు ఇబ్బందులు తప్పవా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావుకి ఇబ్బందులు తప్పవా? 2014నుంచి 2019 వరకూ కోడెల కుటుంబం గుంటూరు జిల్లా సత్తెనపల్లి, నరసరావు పేట ప్రాంతాల్లో సాగించిన అధికార దుర్వినియోగం, బెదిరింపులపై బాధితులు బయటకు వస్తున్నారు.

వారి ఫిర్యాదులతో కేసులు కూడా నమోదవుతున్నాయి. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎంతగా ప్రయత్నం చేసినా కోడెల తన సిట్టింగ్ స్థానమైన సత్తెనపల్లి నియోజకవర్గంను నిలబెట్టుకోలేకపోయారు. అక్కడ పోటీచేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంబటి రాంబాబు చేతిలో ఆయన ఘోరంగా ఓడిపోయారు. అంతేకాదు ఆయన ప్రాతినిధ్యం వహించిన టీడీపీ కూడా భారీ ఓటమి పాలైంది. కొన్నిజిల్లాల్లో ప్రాతినిధ్యమే కరువైంది. 

ఈఐదేళ్ల కాలంలో కోడెల శివప్రసాద్ కుటుంబ సభ్యులు చేసిన అకృత్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ‘కే’ ట్యాక్స్ పేరుతో వందల కోట్లు దోచుకున్నారని ఆరోపణలున్నాయి. బాధితులు ఎవరైనా వచ్చి ఆధారాలతో ఫిర్యాదులు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.

దీంతో కోడెల బాధితులు పోలీస్ స్టేషన్ల కు క్యూ కడుతున్నారని తెలుస్తోంది. తమకు అన్యాయం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారని సమాచారం. అందరి నుంచి లిఖితపూర్వకంగా ఫిర్యాదులు తీసుకుంటున్నారట పోలీసులు. ఓ టీడీపీ నేత, బిల్డర్ పోలీసులకు ఫిర్యాదుచేయడం చర్చనీయాంశంగా మారింది. కోడెల శివప్రసాదరావు కొడుకు శివరాం, కూతురు విజయలక్ష్మిపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

టీడీపీ ప్రభుత్వ హయాంలో అపార్టుమెంట్ల అనుమతికి కోడెల తనయుడు శివరాం తన వద్ద అక్రమంగా డబ్బు వసూళ్లు చేశారని.. అలా చేయడమే కాకుండా ఇంకా తనను డబ్బులివ్వాలని ఇబ్బంది పెడుతున్నారంటూ మల్లికార్జునరావు అనే బిల్డర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఈయన ఎవరో కూడా టీడీపీ నేతే.  గతంలో ఆరోపణలు వచ్చినా కోడెలకు భయపడి పోలీసులు సైతం కేసులు పెట్టలేదు. కానీ ఇప్పుడు మాత్రం శివరాంపై కేసు నమోదు చేశారు పోలీసులు.

కేవలం శివరాం పైనే కాదు.. ఆయన సోదరి కోడెల శివప్రసాద్ కుమార్తె పూనాటి విజయలక్ష్మి పై కూడా నరసరావుపేటలో ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతంలో తాను కొనుగోలు చేసిన భూమికి అన్యాయంగా తనవద్ద డబ్బు వసూలు చేశారని సదరు మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాదు తాను అప్పట్లో డబ్బులు ఇచ్చినప్పటికీ ఇంకా ఇవ్వాలంటూ తనను వేధిస్తున్నారని అందులో జోడించారు.

దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ రెండు కేసులు కోడెల కుటుంబాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇవి కేవలం రాజకీయ ఆరోపణలు కాదని అంటున్నారు. మొత్తం మీద కోడెల వ్యవహారం టీడీపీ నేతలను కూడా వణికిస్తోంది. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకి జర్నలిజంలో విశేష అనుభవం. 21 సంవత్సరాల క్రితం జర్నలిజంలోకి ప్రవేశించిన సత్యనారాయణరాజు ప్రముఖ దినపత్రికలు, న్యూస్ ఛానెళ్ళలో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... మూడేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో సీనియర్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు.ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle