newssting
BITING NEWS :
*అక్రమ వలసదారులను పంపిస్తాం: హోం మంత్రి అమిత్ షా *నేడు, రేపు తెలంగాణ శాసనసభ.. రేపు మండలి సమావేశాలు *మున్సిపల్‌ చట్టాల బిల్లును ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం *22న నింగిలోకి.. చంద్రయాన్‌–2 *కర్నాటకలో ఇవాళ కుమారస్వామి ప్రభుత్వ విశ్వాసపరీక్ష * కుల్ భూషణ్ కి రిలీఫ్.. పాక్ విధించిన మరణశిక్షను రద్దుచేసిన అంతర్జాతీయ న్యాయస్థానం * కర్నాటక అసెంబ్లీకి వెళ్లే ప్రసక్తే లేదు: రెబల్స్‌ *తిరుమలలో ఎల్1, ఎల్ 2, ఎల్ 3 దర్శనాలు రద్దు *ముంబయి పేలుళ్ల సూత్రధారి సయీద్‌ అరెస్టు

కోడెలకు అడ్డొస్తున్న బ్యాడ్ సెంటిమెంట్..!

23-03-201923-03-2019 12:37:37 IST
2019-03-23T07:07:37.132Z23-03-2019 2019-03-23T07:07:32.064Z - - 18-07-2019

కోడెలకు అడ్డొస్తున్న బ్యాడ్ సెంటిమెంట్..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఎట్టకేలకు పార్టీలో తన మాట నెగ్గించుకున్నారు. అధినేతపై ఒత్తిడి చేసే మరీ మరోసారి ఆయన సత్తెనపల్లి టిక్కెట్ తెచ్చుకొని పోటీ చేస్తున్నారు. ఆయనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయిన అంబటి రాంబాబు పోటీ చేస్తున్నారు. ఇక, జనసేన నుంచి మాజీ ఎమ్మెల్యే ఎర్రం వెంకటేశ్వర్ రెడ్డి పోటీలో ఉన్నారు. ప్రధాన పోటీ టీడీపీ, వైసీపీ మధ్యే ఉన్నా జనసేన చీల్చే ఓట్లు ఏ పార్టీపై ప్రభావం చూపుతుందనేదానిపై అభ్యర్థుల గెలుపోటములు ఆధారపడి ఉన్నాయి.

గత ఎన్నికల్లో కోడెల 924 ఓట్ల స్వల్ప మెజారిటీతో అంబటి రాంబాబుపై గెలిచారు. ఆరుసార్లు గెలిచిన ఆయనకు స్పీకర్ పదవి దక్కింది. ఈ ఐదేళ్ల కాలం ఆయన నియోజకవర్గంలో అభివృద్ధి పనులు బాగానే చేశారు. అయితే, ఆయన కుమారుడిపై అదే స్థాయిలో ఆరోపణలు రావడం, వాటిని ప్రతిపక్షాలు ప్రజల్లోకి తీసుకెళ్లడం ఆయనకు మైనస్‌గా కనిపిస్తోంది.

కోడెలకు సత్తెనపల్లి టిక్కెట్ ఇవ్వవద్దని పలువురు టీడీపీ నేతలు అధిష్టానంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. పలు ఆందోళనలు, నిరసనలు చేసినా సీనియర్ నేత అయిన కోడెలకు గౌరవమిస్తూ చంద్రబాబు మరోసారి టిక్కెట్ ఖరారు చేశారు. ఇక, నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు వర్గంతో కూడా ఆయనకు కొంత సయోధ్య లేకపోవడం ఇబ్బందిగా మారే అవకాశం ఉంది.

ఇదే సమయంలో వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబుపైన కూడా పార్టీలోని కొందరు నేతలు అసంతృప్తిగా ఉన్నారు. టిక్కెట్ ఆయనకు ఇవ్వవద్దని జగన్‌పై ఒత్తిడి చేసినా ఆయనకే టిక్కెట్ దక్కింది. గత ఎన్నికల్లో ఓడిపోయిన సానుభూతి, కొడెల వారసుడిపై ఉన్న వ్యతిరేకత తనకు కలిసివస్తుందని ఆయన భావిస్తున్నారు. అయితే, వైసీపీకి ఎక్కువగా అండగా ఉండే రెడ్డి సామాజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వరరెడ్డి జనసేన తరఫున పోటీ చేస్తుండటంతో ఆ ఎఫెక్ట్ ఎక్కువగా వైసీపీపై పడే అవకాశం ఉంది.

అయితే, ఆంధ్రప్రదేశ్‌లో, ఇప్పుడు తెలంగాణలో స్పీకర్‌గా పనిచేసిన వారు తర్వాత ఎన్నికల్లో ఓడిపోవడం అనే ఓ సెంటిమెంట్ కొనసాగుతోంది. 1990లో స్పీకర్‌గా పనిచేసిన దుద్దిళ్ల శ్రీపాదరావు తర్వాత ఎన్నికల్లో మంథని నుంచి ఓడిపోయారు. 1999లో స్పీకర్‌గా ఉన్న ప్రతిభా భారతి తర్వాత వరుసగా మూడుసార్లు ఓటమి పాలయ్యారు. వైఎస్ హయాంలో 2004లో స్పీకర్ గా ఉన్న సురేష్ రెడ్డి కూడా తర్వాత రెండు ఎన్నికల్లో ఓడారు.

2009లో స్పీకర్‌గా పనిచేసి అనంతరం ముఖ్యమంత్రి అయిన కిరణ్ కుమార్ రెడ్డి కూడా తర్వాత ఎన్నికల్లో పోటీనే చేయలేదు. ఆయన రాజకీయ భవిష్యత్ ఆశాజనకంగా కనిపించడం లేదు. ఆయన తర్వాత స్పీకర్‌గా ఉన్న నాదెండ్ల మనోహర్ కూడా గత ఎన్నికల్లో ఓడిపోయారు. ఈ సెంటిమెంట్ ఇటీవలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొనసాగింది. 2014లో స్పీకర్‌గా పనిచేసిన మధుసుదనాచారి భూపాలపల్లి నుంచి ఇటీవలి ఎన్నికల్లో ఓడిపోయారు.

మరి, ఈ సెంటిమెంట్లను, వ్యతిరేకతలను తన అభివృద్ధి మంత్రంతో కోడెల శివప్రసాదరావు ఛేదించి విజయం సాధిస్తారా లేదా ఆంధ్రప్రదేశ్‌లోనూ సెంటిమెంట్ కొనసాగి ఓడిపోతారా చూడాలి. 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle