newssting
BITING NEWS :
* భారత్ లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు 1, 45, 380.. మరణాలు 4167*ఏపీలో 2719 మృతులు 57, తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1920 * కరోనా వైరస్ మహమ్మారిపై పోరులో భారత్ కు చైనా సహకారం యథాతథం * మహారాష్ట్రలో 1695 కోవిడ్ మరణాలు.. కేసులు 17,082*భారత్ లో వారం రోజుల్లో 45 వేల కేసులు *ఏపీలో భారీగా పట్టుబడుతున్న తెలంగాణా మద్యం*హైకోర్టుకు చేరిన ఏపీ వికేంద్రీకరణ, సీఆర్డీఏ సవరణ బిల్లు వ్యవహారం*సిద్దిపేట:కొండపోచమ్మ సాగర్‌ ప్రారంభోత్సవం ముహూర్తం ఖరారు..ఈనెల 29న ఉ. 11:30 గంటలకు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ *జార్ఖండ్ లో ఘోర ప్రమాదం ఐదుగురి మృతి

‘కోడి కత్తి’ కేసులో ట్విస్ట్..!

03-12-201803-12-2018 15:08:52 IST
Updated On 03-12-2018 15:10:30 ISTUpdated On 03-12-20182018-12-03T09:38:52.659Z03-12-2018 2018-12-03T09:38:47.891Z - 2018-12-03T09:40:30.048Z - 03-12-2018

‘కోడి కత్తి’ కేసులో ట్విస్ట్..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అక్టోబర్ 25న విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై జరిగిన కోడికత్తి దాడి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. తనపై హత్యాయత్నం కేసును స్వతంత్ర సంస్థతో నిష్పక్షపాతంగా విచారణ జరపాలని జగన్ హైకోర్టులో పిటిషన్ వేశారు. రాష్ట్ర ప్రభుత్వ విచారణపై తనకు నమ్మకం లేదని జగన్ ఎప్పటినుంచో చెబుతున్నారు. ఈ పిటిషన్ విచారించిన కోర్టు… ఎయిర్ పోర్టులో సంఘటన జరిగితే మీరెలా విచారిస్తారని ఏపీ పోలీసులను ప్రశ్నించింది. కేసును ఎందుకు ఎన్ఐఏకు బదిలీ చేయలేదో కౌంటర్ దాఖలు చేయాలంటూ కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ కోసం ఈ కేసును డిసెంబర్ ఐదుకు వాయిదా వేసింది. అయితే, చట్ట ప్రకారం ఎయిర్ పోర్టు లేదా ఎయిర్ క్రాఫ్ట్ లో సంఘటన జరిగితే ఎన్ఐఏ‌నే విచారించాలని జగన్ తరపు అడ్వకేట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దాడి ఘటనపై ఏపీ సర్కార్ ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం( సిట్ ) విచారణను నిలిపివేయాలని కోర్టుకు జగన్ తరపు న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు. 

ఈ కేసును ఎన్ఐఏకు ఎందుకు బదిలీ చేయలేదో బుధవారం లోగా కౌంటర్ దాఖలు చేయాలంటూ ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించడం కేసులో ట్విస్ట్‌గా చెబుతున్నారు. ఈకేసులో కేంద్రం, ఏపీ ప్రభుత్వాలకు కోర్టు నోటీసులు జారీచేసింది. అక్టోబర్ 25న విశాఖ ఎయిర్‌పోర్టుకి వచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ సమయంలో జగన్‌ని కలిసేందుకు వచ్చిన అభిమాని శ్రీనివాసరావు అనే వెయిటర్ కత్తితో దాడికి దిగాడు. దాడినుంచి తృటిలో తప్పించుకున్న జగన్ భుజానికి గాయమైంది. దీంతో వెంటనే అప్రమత్తమయిన ఎయిర్ పోర్ట్ పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. దాడి ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర సంస్థలతో దర్యాప్తు చేయాలంటూ డిమాండ్ చేసింది. హోంమంత్రి, రాష్ట్రపతిని కలిసిన వైసీపీ నాయకులు వినతిపత్రాలు కూడా సమర్పించారు. అప్పటినుంచి ఈ కేసు విచారణ సాగుతూనే ఉంది. మరోవైపు నిందితుడు శ్రీనివాసరావు ఈనెల ఏడవ తేదీ వరకూ రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఈనెల ఐదవ తేదీన కోర్టు ఏ నిర్ణయం వెలువరిస్తుందో చూడాలి. 

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

   11 hours ago


బాబోయ్ ఎండలు.. నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు!

బాబోయ్ ఎండలు.. నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు!

   13 hours ago


వైరల్ అవుతున్న కేటీయార్ చేనేత మాస్కులు

వైరల్ అవుతున్న కేటీయార్ చేనేత మాస్కులు

   16 hours ago


అకస్మాత్తు నిర్ణయాలతో ప్రయాణికుల అయోమయం

అకస్మాత్తు నిర్ణయాలతో ప్రయాణికుల అయోమయం

   18 hours ago


తెలంగాణ 66.. ఏపీలో 89.. పోటాపోటీగా పాజిటివ్ కేసులు

తెలంగాణ 66.. ఏపీలో 89.. పోటాపోటీగా పాజిటివ్ కేసులు

   19 hours ago


సీరియల్ కిల్లర్ సంజయ్.. ఒక హత్య దాచేందుకు 10 హత్యలు

సీరియల్ కిల్లర్ సంజయ్.. ఒక హత్య దాచేందుకు 10 హత్యలు

   19 hours ago


ఈ కుర్రాడు చాలా బోల్డ్.. ఢిల్లీ నుంచి ఒంటరిగా బెంగళూరుకు

ఈ కుర్రాడు చాలా బోల్డ్.. ఢిల్లీ నుంచి ఒంటరిగా బెంగళూరుకు

   19 hours ago


బాబోయ్ కోడి @500.. ఇక కొని తినలేమా?

బాబోయ్ కోడి @500.. ఇక కొని తినలేమా?

   20 hours ago


నిద్రపోతున్న జగన్ సర్కారుకి హైకోర్టు మొట్టికాయలు

నిద్రపోతున్న జగన్ సర్కారుకి హైకోర్టు మొట్టికాయలు

   20 hours ago


ముదిరిన టీటీడీ భూవివాదం.. వెనక్కు తగ్గిన ప్రభుత్వం!

ముదిరిన టీటీడీ భూవివాదం.. వెనక్కు తగ్గిన ప్రభుత్వం!

   20 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle