ముఖ్యమంత్రిగా మీ ఛాయిస్ ఫలితాలు.

{"1":1289,"2":2222,"3":1407}

nara chandrababu naidu
1665
ys jagan mohan reddy
2290
Pawan Kalyan
1423
newssting

Your PM Choice?

{"1":1393,"2":1710,"3":350,"4":71}

Narendra Modi
1407
Rahul Gandhi
1721
Mayawati
360
Mamata Banerjee
76
BITING NEWS :
*కొనసాగుతున్న ఏడో విడత పోలింగ్ ...ఓటేసిన ప్రముఖులు *ఇవాళ్టితో ముగుస్తున్న ఎన్నికల ప్రక్రియ *ఏపీలొ భద్రత మధ్య రీపోలింగ్ * ఐబీ హెచ్చరికలతో తిరుమలలో ముమ్మర తనిఖీలు *తానెక్కడికీ పారిపోలేదు.. నటుడు శివాజీ వివరణ *ఏపీలో హంగ్‌వచ్చే పరిస్థితిలేదు: లగడపాటి *అఖిలేశ్‌తో చంద్రబాబు భేటీ *మోడీపై పరువునష్టం దావా వేసిన మమతా బెనర్జీ మేనల్లుడు ఎంపీ అభిషేక్ బెనర్జీ

‘కోడికత్తి’ కేసులో ఏపీ సర్కార్‌కు ఎదురుదెబ్బ

19-01-201919-01-2019 17:29:00 IST
Updated On 19-01-2019 17:28:58 ISTUpdated On 19-01-20192019-01-19T11:59:00.212Z19-01-2019 2019-01-19T11:58:17.280Z - 2019-01-19T11:58:58.640Z - 19-01-2019

‘కోడికత్తి’ కేసులో ఏపీ సర్కార్‌కు ఎదురుదెబ్బ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
విశాఖ విమానాశ్రయంలో ఏపీ విపక్ష నేత జగన్‌పై గత ఏడాది అక్టోబర్ 25న జరిగిన ‘కోడికత్తి’ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ఏపీ ప్రభుత్వానికి మరోసారి గట్టి షాక్ తగిలింది. జగన్‌పై దాడి కేసును ఎన్ఐఏకి అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ సర్కార్ హైకోర్టులో దాఖలు చేసిన హౌజ్ మోషన్ పిటిషన్‌కి చుక్కెదురైంది. శనివారం హౌజ్ మోషన్ పిటిషన్‌పై వాదనలు విన్న ఏపీ హైకోర్టు ఈ పిటిషన్‌ని తిరస్కరించింది. ఇప్పటికే కేసు విచారణను ఎన్ఐఏ చేపట్టింది. నిందితుడు శ్రీనివాసరావును కస్టడీలోకి తీసుకుంది. వారం రోజులపాటు కస్టడీలో తీసుకున్న ఎన్ఐఏ అధికారులు ఐదు రోజుల్లోనే విచారణ పూర్తి చేశారు. అయితే తమకి ఏపీ పోలీసులు సహకరించడం లేదని ఎన్ఐఏ కోర్టుకెక్కింది. కేసుకు సంబంధించి పూర్తి రికార్డులు, మెటీరియల్‌ ఆబ్జెక్టులను ఎన్‌ఐఏకు అప్పగించాలని రాష్ట్ర పోలీసులను న్యాయస్థానం శుక్రవారం ఆదేశించిన సంగతి తెలిసిందే. 

ఈకేసును ఎన్ఐఏకి అప్పగించడాన్ని ఏపీ సర్కార్ మెుదటి నుంచి వ్యతిరేకిస్తోంది. పలు బహిరంగ సభల్లో, పత్రికా సమావేశాల్లో చంద్రబాబు నాయుడు దీనిపై తన అభ్యంతరం తెలుపుతూనే ఉన్నారు. రాష్ట్రాల హక్కుల్లో కేంద్రం తలదూర్చుతుందంటూ ఆయన మండిపడుతూనే ఉన్నారు. రాష్ట్ర పోలీసులు సహకరించకున్నా.. ఎన్ఐఏ ఏమాత్రం వెనకడుగు వెయ్యకుండా విచారణను వేగవంతం చేస్తోంది. నిందితుడు శ్రీనివాసరావు ఎన్‌ఐఏ కస్టడి గడువు ముగిసిన రోజే విచారణను నిలిపివేయాలంటూ హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. అటు ఎన్ఐఏ అధికారులు సైతం కోర్టును ఆశ్రయించారు. ఏపీ పోలీసులు తమకు సహకరించడం లేదని కేసు రికార్డులు, సీజ్ చేసి సాక్ష్యాధారాలు ఇవ్వడం లేదంటూ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు ఈ కేసులో నిందితుడు శ్రీనివాసరావుకి ప్రాణహాని ఉన్న దృష్ట్యా రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో ఇతర ఖైదీలతో కలపకుండా ప్రత్యేకమైన గదిలో ఉంచారు. 

హైకోర్టు తాజా తీర్పుతో ఎన్‌ఐఏ విచారణను అడ్డుకోవాలని భావించిన చంద్రబాబు ప్రభుత్వ ప్రయత్నానికి బ్రేక్‌ పడిందంటున్నారు. ఈ విషయంలో తమ వాదనలను సోమవారం బలంగా వినిపిస్తామని జగన్ తరఫు న్యాయవాది తెలిపారు. ఇదిలా ఉంటే జగన్‌పై హత్యాయత్నం కేసులో కీలకంగా భావిస్తున్న ఎయిర్‌పోర్ట్‌లోని ఫ్యూజన్‌ ఫుడ్స్‌ రెస్టారెంట్‌ యజమాని హర్షవర్దన్‌ చౌదరి ఇప్పటివరకు పత్తాలేకుండా పోయారు. దీనిపై పత్రికల్లో కథనాలు రావడంతో.. హర్షవర్దన్‌ ఎన్‌ఐఏ అధికారులకు అందుబాటులోకి వచ్చారు. తనకు యాక్సిడెంట్‌ అయి కదల్లేని పరిస్థితుల్లో ఇంట్లోనే ఉన్నానని, ఆరోగ్యం కుదుటపడిన తర్వాత విచారణకు వచ్చి సహకరిస్తానని సమాచారం పంపారు. వీలైనంత త్వరగా విచారణకు హాజరు కావాల్సిందిగా ఎన్ఐఏ అధికారులు ఆదేశాలిచ్చారు.   


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకి జర్నలిజంలో విశేష అనుభవం. 21 సంవత్సరాల క్రితం జర్నలిజంలోకి ప్రవేశించిన సత్యనారాయణరాజు ప్రముఖ దినపత్రికలు, న్యూస్ ఛానెళ్ళలో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... మూడేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో సీనియర్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు.ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle