newssting
BITING NEWS :
తెలంగాణ రాస్ట్రంలో అతి పెద్ద జాతర అయిన మేడారం తేదీలు ఖరారు ఫిబ్రవరి 7, 8 న భక్తులు తమ మొక్కులు చెల్లించుకోనున్నారు * ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ సెమీస్‌లో బజ్‌రంగ్‌ పూనియాకు నిరాశ వివాదాస్పదరీతిలో పరాజయం * చైనా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాయిప్రణీత్‌ సింధు సహా అంతా అవుట్‌ * కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మకం: మోదీ * స్టాక్‌మార్కెట్లో రికార్డు లాభాలు, సెన్సెక్స్‌ 1921, నిఫ్టీ 569 పాయింట్లు జంప్‌* మన్మోహన్ సింగ్ పాక్‌పై సైనిక చర్యకు ప్లాన్ వేశారు : బ్రిటన్ మాజీ ప్రధాని * ఇకపై మంత్రి హరీశ్‌రావుతో ఘర్షణ ఉండదన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి * సచివాలయ ఉద్యోగాల పేరిట భారీ స్కాం.. ప్రశ్నపత్రాల లీకేజీపై చంద్రబాబు ట్వీట్ * ప్రధానమంత్రిని తిట్టడం దేశద్రోహం కిందికి రాదు: ఢిల్లీ పోలీసులు. * రామమందిరంపై సుప్రీం కోర్టు తీర్పును విశ్వసిద్దాం: నాసిక్‌ సభలో ప్రధాని నరేంద్రమోదీ *

కోట్లు పంచినా ఓట్లు రాల్లేదు..!

25-05-201925-05-2019 11:56:29 IST
Updated On 26-06-2019 16:10:03 ISTUpdated On 26-06-20192019-05-25T06:26:29.298Z25-05-2019 2019-05-25T06:26:26.375Z - 2019-06-26T10:40:03.614Z - 26-06-2019

కోట్లు పంచినా ఓట్లు రాల్లేదు..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రభుత్వం చేసే ప్రతీ కార్యక్రమం వెనుక ఉద్దేశ్యాల‌ను ప్రజ‌లు ఇట్టే ప‌సిగ‌ట్టేస్తున్నారు. నాయ‌కుల నోటి నుంచి వ‌చ్చిన మాట‌ల‌ను గ్రామాల్లో చ‌ర్చించుకుంటూ వారి మాట‌ల వెనుక అంత‌రార్థాన్ని ప‌సిగ‌డుతున్నారు. ముఖ్యంగా సోష‌ల్ మీడియా ప్రభావం పెరిగాక ప్రభుత్వ ప‌నితీరుపై అన్ని వైపుల నుంచీ ప్రజ‌లు అవ‌గాహ‌న తెచ్చుకుంటున్నారు.

అయితే, 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ అయిన చంద్ర‌బాబు నాయుడు మాత్రం ఈ విష‌యాన్ని, ప్రజ‌ల్లో వ‌చ్చిన మార్పును ప‌సిగ‌ట్టలేక‌పోయారు. ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా త‌మ ప‌ద‌వీకాలంలోని చివ‌రి ఏడాది కొత్త ప‌థ‌కాల‌ను ప్రారంభించి కోట్లను ప్రజ‌ల‌కు ఎర‌గా వేస్తే ఓట్లు ప‌డ‌తాయ‌నే ఓ పాత ఫిలాస‌ఫీని తెలుగుదేశం ప్రభుత్వం అమ‌లు చేసింది. త‌మ ఓట్ల కోసం ఈ ప‌థ‌కాల‌న్నీ అని ప్రజ‌లు గుర్తించ‌డంతో టీడీపీ వ్యూహం దారుణంగా బెడిసికొట్టింది.

ఎన్నిక‌ల‌కు ఆరు నెలల ముందు వ‌ర‌కు జ‌గ‌న్ పాద‌యాత్ర ప్రభుత్వ వ్యతిరేక‌త కార‌ణంగా వైసీపీ అధికారంలోకి రానుంద‌ని మెజారిటీ స‌ర్వేలు స్పష్టంగా చెప్పాయి. చంద్రబాబు స‌ర్వేలూ ఇదే విష‌యాన్ని గుర్తించాయి. దీంతో న‌ష్ట నివార‌ణ కోసం చంద్రబాబు ఎన్నిక‌ల తాయిలాలుగా ప్రభుత్వ నిధుల‌ను వెచ్చించే ప‌థ‌కాల‌ను ప్రారంభించారు.

రాష్ట్రంలో 65 ల‌క్షల మంది ఉన్న డ్వాక్రా మ‌హిళ‌ల‌ను ఆక‌ట్టుకోవ‌డానికి ఎన్నిక‌లకు మూడు నెల‌ల ముందు ప‌సుపు కుంకుమ ప‌థ‌కానికి శ్రీకారం చుట్టారు. డ్వాక్రా మ‌హిళ‌ల‌కు నాలుగు విడ‌త‌ల్లో రూ.10 వేలు ఇచ్చారు. ఏప్రిల్ 11న ఎన్నిక‌లు జ‌ర‌గ‌గా ఏప్రిల్ 5, 6, 7 తేదీల్లోనూ ఈ డ‌బ్బులు డ్వాక్రా మ‌హిళ‌ల‌కు అందాయి. దీంతో వీరి ఓట్లపై టీడీపీ భారీగా అంచ‌నాలు పెట్టుకుంది. మ‌హిళ‌ల ఓట్లు పెర‌గ‌డం త‌మ‌కు అనుకూల‌మ‌ని భావించింది. చంద్రన్న స్ట్రాట‌జీ వ‌ర్కౌట్ అయ్యింద‌నుకుంది. 

కానీ, ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత సీన్ రివ‌ర్స్ అయ్యింది. తాను పిలుపునిస్తే అర్థరాత్రి వ‌ర‌కు కూడా మ‌హిళ‌లు లైన్లలో నిల‌బ‌డి ఓట్లేశార‌ని చంద్రబాబు భావించారు. కానీ, ఆయ‌న‌ను గ‌ద్దె దించేందుకే ఓట్లేశార‌ని మాత్ర ప‌సిగ‌ట్టలేక‌పోయారు. ప‌సుపు కుంకుమ ప‌థ‌కానికి జ‌గ‌న్ ఇచ్చిన కౌంట‌ర్లు ప్రజ‌ల్లోకి వెళ్లాయి. పిల్లల‌ను బ‌డికి పంపిస్తే ఏడాది త‌ల్లికి రూ.15 ఇస్తామ‌ని జ‌గ‌న్ న‌వ‌ర‌త్నాల్లో ఇచ్చిన హామీ మ‌హిళ‌ల‌ను ఆక‌ట్టుకుంది. ఇక‌, డ్వాక్రా మ‌హిళ‌ల‌కు మ‌ళ్లీ వ‌డ్డీ లేని రుణాలు ఇస్తామ‌ని, చంద్రబాబు వ‌ల్ల డ్వాక్రా మ‌హిళ‌లు రుణ‌మాఫీ కాక మోస‌పోయిన విష‌యాన్ని వైసీపీ బ‌లంగా తీసుకెళ్లింది.

ఇక‌, జ‌గ‌న్ కు అండ‌గా ఉంటార‌నుకున్న రైతుల‌ను త‌మ‌వైపు తిప్పుకునేందుకు అన్నాధాత సుఖీభ‌వ కార్యక్రమాన్ని సైతం చంద్రబాబు ఎన్నిక‌ల ముందే ప్రారంభించారు. రైతుల ఖాతాల్లోకి నేరుగా డ‌బ్బులు వేశారు. ఎన్నిక‌లకు వారం రోజుల ముందే ఈ డ‌బ్బులు రైతుల‌కు చేరాయి. ఇక‌, గ‌త ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీ మేర‌కు రైతు రుణ‌మాఫీ చివ‌రి రెండు విడ‌త‌ల సొమ్మును కూడా ఎన్నిక‌ల ముందే జ‌మ చేశారు. దీంతో రైతులు త‌మ‌కే ఎక్కువ‌గా ఓట్లు వేస్తార‌ని తెలుగుదేశం పార్టీ అంచ‌నా వేసింది.

అయితే, రుణ‌మాఫీ పేరుతో చంద్ర‌బాబు ఇచ్చిన డ‌బ్బులు వ‌డ్డీల‌కు కూడా స‌రిపోలేద‌ని జ‌గ‌న్ చేసిన ప్రచారం రైతుల‌ను ఆలోచింప‌జేసింది. రైతుల‌కు న‌వ‌ర‌త్నాల్లో జ‌గ‌న్ ఇచ్చిన హామీలు కూడా వారిని ఆక‌ర్షించాయి. దీంతో చంద్రబాబు వేసిన ఎన్నిక‌ల తాయిలాలు వారి వ‌ద్ద ప‌నిచేయ‌లేదు. రూర‌ల్ ప్రాంతంలో ఏక‌ప‌క్షంగా జ‌గ‌న్ ప్రభంజ‌నం వీయ‌డానికి కార‌ణం కూడా ఇదే.

మొత్తంగా ఎన్నిక‌ల ముందు ప‌థ‌కాల‌కు టీడీపీ ప్రభుత్వం అనేక ఆర్థిక ఇబ్బందుల‌ను ఎదుర్కొని రూ.29 వేల కోట్లు వెచ్చించింది. కానీ, ఈ తాయిళాలు త‌మ ఓట్ల కోస‌మే అని పసిగ‌ట్టిన ఓట‌ర్లు వాటికి పెద్ద‌గా ఆక‌ర్షితులు కాలేదు. ఫ‌లితంగా తెలుగుదేశం పార్టీ చ‌రిత్రలోనే ఎన్నడూ చ‌విచూడ‌ని ఓట‌మిని ఎదుర్కోవాల్సి వ‌చ్చింది.


Sharat Bhamidi


With 5 years of experience in Digital Media, Sharat Bhamdi specialises in creating content for webistes, developing ad campaigns and social media campaigns. At NewsSting, he handles the video division where he brings in content through feature videos and interviews.
 sharat@rightfolio.co.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle