newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

కోటంరెడ్డితో విభేదాల‌పై కాకాణి క్లారిటీ ..!

09-10-201909-10-2019 17:50:48 IST
Updated On 10-10-2019 15:08:19 ISTUpdated On 10-10-20192019-10-09T12:20:48.240Z09-10-2019 2019-10-09T12:20:43.234Z - 2019-10-10T09:38:19.975Z - 10-10-2019

కోటంరెడ్డితో విభేదాల‌పై కాకాణి క్లారిటీ ..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
నెల్లూరు జిల్లా వైసీపీలో చెల‌రేగిన సంక్షోభానికి పొలిటిక‌ల్ ఆప‌రేష‌న్ మొద‌లైంది. కాగా, అధికార‌పార్టీకి చెందిన ఇద్ద‌రు ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి, కాకాణి గోవర్ధ‌న్‌రెడ్డి మ‌ధ్య నిప్పు రాజుకున్న సంగ‌తి తెలిసిందే. ఇద్ద‌రి మ‌ధ్య బ‌హిరంగంగానే జ‌రుగుతున్న ఈ యుద్ధానికి సాక్ష్యంగా కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డిపై కేసు కూడా న‌మోదైంది.

ఆ త‌రువాత చోటు చేసుకున్న ప‌రిణామాల నేప‌థ్యంలో అరెస్టైన కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి బెయిల్‌పై బ‌య‌ట‌కొచ్చారు. వీరిద్ద‌రి వ్య‌వ‌హారంపై ఆగ్ర‌హం వెలిబుచ్చిన ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ఎమ్మెల్యేలిద్ద‌ర్నీ అమ‌రావ‌తికి ర‌మ్మ‌ని హుకుం జారీ చేశారు. ఈ క్ర‌మంలో నేడు వైసీపీ ముఖ్య నేత‌, టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి నివాసంలో నెల్లూరు జిల్లా వైసీపీ శ్రేణుల స‌మావేశం ముగిసింది.

ఇద్ద‌రు ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి, కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి, జిల్లా మంత్రి అనీల్‌కుమార్ యాద‌వ్, ఎంపీ ఆదాల ప్ర‌భాక‌ర్‌రెడ్డి, స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి త‌దిత‌రులు వైవీ సుబ్బారెడ్డి నివాసంలో భేటీ అయ్యారు. అస‌లు గొడ‌వ‌కు దారి తీసిన కార‌ణాలు, ఎంపీడీవో ఫిర్యాదు వెనుకున్న ఎత్తులు, నేత‌ల మ‌ధ్య స‌యోధ్య వంటి అంశాల‌పై సుబ్బారెడ్డి వారితో చ‌ర్చించిన‌ట్టు తెలుస్తుంది. వివాదంపై సీఎం జ‌గ‌న్ సీరియ‌స్ అయిన త‌రువాత విబేధాలు స‌ర్దుమ‌ణిగిన‌ట్టేన‌ని పార్టీ శ్రేణులు అభిప్రాయాన్ని వ్య‌క్త‌ప‌రుస్తున్నారు.

అయితే, కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డితో త‌నకు విబేధాలు అంటూ వ‌స్తున్న క‌థ‌నాల‌పై ఇప్ప‌టి వ‌ర‌కు స్పందించ‌ని కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడారు. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఈ నెల 15న నెల్లూరు జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ రైతు భ‌రోసా కార్య‌క్ర‌మాన్ని జిల్లాలోనే ప్రారంభించ‌నున్నారు. క‌నుక జిల్లాకు జ‌గ‌న్ వ‌స్తున్నారు. రైతు భ‌రోసా కార్య‌క్ర‌మానికి సంబంధించి ఏ విధంగా ఏర్పాట్లు చేయాలి..? జ‌గ‌న్ స‌భ‌ను ఏ విధంగా విజ‌య‌వంతం చేయాలి..? రైతు భ‌రోసా విధి విధానాలు ప్ర‌జ‌ల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి..? అన్న అంశాల‌పై ప్ర‌ధానంగా చ‌ర్చ జ‌రిగింద‌ని కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి చెప్పారు.

అలాగే, శ్రీ‌ధర్‌రెడ్డి, తాను బాల్య మిత్రుల‌మ‌ని కాక‌ణి స్ప‌ష్టం చేశారు. మా ఇద్ద‌రి మ‌ధ్య విబేధాలు ఉన్నాయ‌న్న‌ది అవాస్త‌వ‌మ‌న్నారు. మా మ‌ధ్య ఒక‌రొచ్చి మ‌ధ్య‌వ‌ర్తిత్వం చేయాల్సిన అవ‌స‌రం బ‌తికుండ‌గా జ‌ర‌గాల‌ని కోరుకోవ‌డం లేదు. జ‌ర‌గాల‌ని అభిప్రాయ‌ప‌డ‌టమూ లేదు. ఒక‌రి మీద ఒక‌రికి ఇష్ట‌ముంది. ప్రేమాభిమానాలు ఉన్నాయి. గౌర‌వం ఉంది. ఒకే ద‌గ్గ‌ర పుట్టాం.. ఒకే ద‌గ్గర పెరిగాం. శ్రీ‌ధ‌ర్ నాకు బామ్మ‌ర్ది. కుటుంబ ప‌రంగాను, వ్య‌క్తిగ‌తంగాను శ్రీ‌ధ‌ర్‌రెడ్డితో సంబంధాలు ఉన్నాయ‌ని కాకాణి మీడియా ముందు తెలిపారు.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle