newssting
BITING NEWS :
* భారత్-అమెరికా మధ్య కుదిరిన ఐదు ఒప్పందాలు.. ట్రంప్‌తో నాకు ఇది ఐదో సమావేశం, ట్రంప్ సకుటుంబంగా భారత్‌కు రావడం సంతోషంగా ఉంది-ప్రధాని మోడీ*మూడు బిలియన్ డాలర్ల ఒప్పందం జరిగింది, సహజవాయురంగంలో ఒప్పందం చేసుకున్నాం-డొనాల్డ్ ట్రంప్ *ఇండియాతో మాకు ప్రత్యేక అనుబంధం, ఈ టూర్ ఎప్పటికీ మర్చిపోలేను, రెండు దేశాలకు ఇది ఉపయోగకరమైన పర్యటన, ఇస్లాం తీవ్రవాదంపై కూడా చర్చించాం-ట్రంప్ * నిర్భయ దోషుల ఉరి శిక్షలో మరో ట్విస్ట్..! విచారణ 5వ తేదీకి వాయిదా *ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్‌ సస్పెన్షన్ రద్దుచేసిన క్యాట్.. కృష్ణకిషోర్‌ కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ట్రైబ్యునల్‌ అనుమతి, కృష్ణకిషోర్‌పై కేసులను ప్రభుత్వం చట్టప్రకారం పరిశీలించుకోవచ్చన్న క్యాట్ *ఢిల్లీ సర్వోదయ స్కూల్‌లో అమెరికన్ ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్... హ్యాపిసెన్ క్లాస్‌లను పరిశీలించిన మెలానియా*రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. నోటిఫికేషన్‌ మార్చి 6, నామినేషన్లకు చివరి తేది మార్చి 13, నామినేషన్ల పరిశీలన మార్చి 16, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది మార్చి 18, మార్చి 26న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్. సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ * సాయంత్రం మోడీ-ట్రంప్ విందుకు హాజరుకానున్న ప్రముఖులు. రాలేనని సందేశం పంపిన మాజీ పీఎం మన్మోహన్ సింగ్

కొవ్వూరు గోష్పాద క్షేత్రం వద్ద అన్యమత ప్రచార కలకలం

19-01-202019-01-2020 08:54:50 IST
Updated On 19-01-2020 08:54:42 ISTUpdated On 19-01-20202020-01-19T03:24:50.063Z19-01-2020 2020-01-19T03:23:43.290Z - 2020-01-19T03:24:42.194Z - 19-01-2020

కొవ్వూరు గోష్పాద క్షేత్రం వద్ద అన్యమత ప్రచార కలకలం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
హిందూ పుణ్యక్షేత్రాలవద్ద అన్యమత ప్రచారం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా.. రోజూ ఏదో ఒక చోట అన్యమత మార్పిడులు యథేచ్ఛగా సాగుతున్నాయి. తాజాగా పశ్చియగోదావరి జిల్లా కొవ్వూరు గోష్పాద క్షేత్రం సాక్షిగా మతమార్పిడులు జరిగాయి. కొవ్వూరులో ఈ రేవుకి ఎంతో ప్రాధాన్యత వుంది. రోజూ వందలాదిమంది ఇక్కడ పుణ్యస్నానాలు చేస్తుంటారు. పౌర్ణమికి, పుష్కరాలకు ఈ రేవు జనసంద్రంగా మారుతుంది. 

దుర్గమ్మ చెంత మతమార్పిడి కలకలం... హిందూ ధార్మిక సంఘాల ఆగ్రహం

అలాంటి పవిత్రమయిన క్షేత్రంలో క్రైస్తవమత ప్రచారంపై జనం మండిపడుతున్నారు. ఇటీవల బెజవాడ నడిబొడ్డులో మత మార్పిడులు కలకలం రేపాయి. పున్నమి ఘాట్లో వందలమందిని కృష్ణమ్మ సాక్షిగా క్రైసవమతంలోకి మార్చేశారు. ఈ ఉదంతం దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ నివాసానికి కూతవేటు దూరంలో జరిగింది. అయితే, దీనిపై ప్రభుత్వం అంతగా స్పందించలేదు.

విజయవాడ కనక దుర్గ ఆలయం వద్ద మరో వివాదం తెరపైకి వచ్చింది. ఆలయానికి సమీపంలోనే మత మార్పిడులు కలకలం రేపాయి. కృష్ణా నదిలో పున్నమి ఘాట్ వద్ద స్నానాలు చేయించిన పాస్టర్లు పెద్ద ఎత్తున మత మార్పిడి కార్యక్రమం నిర్వహించారు.పెద్ద పెద్ద లౌడ్ స్పీకర్లు పెట్టి మత ప్రచారం చేసుకుంటున్నా పట్టించుకునే నాథుడు లేకుండా పోయాడు. .అమ్మవారి ఆలయం వద్ద ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని హిందూత్వ వాదులు ఆరోపించారు. గుట్టుచప్పుడు కాకుండా శ్రీశైలం, తిరుమలలో జరుగుతున్న అన్యమత ప్రచారంపై హిందూత్వవాదులు, పురోహితులు మండిపడుతున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle